Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు అరుణ్ 3 లక్షలు- మీనా పీక పట్టుకున్న బాలు- మనోజ్‌కు జ్వరం, రోహిణిపై నిందలు
Gunde Ninda Gudi Gantalu Serial September 15th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 15వ తేది ఎపిసోడ్‌లో తాగొచ్చిన బాలును మందలిస్తుంది మీనా. ఇద్దరు గొడవ పడతారు. మరుసటి రోజు ఉదయం మీనా పీక పట్టుకుంటాడు బాలు. సుమతి కాల్ చేయడంతో హాస్పిటల్‌కు వెళ్తుంది మీనా. మీనాకు అరుణ్ 3 లక్షలు ఇస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తాగొచ్చి ట్రాఫిక్ పోలీస్‌తో గొడవ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఊదుతాను, నా బేరం పోగొట్టాడు, తాగలేదని తెలిసి కూడా ఊదమనడం అవమానించడమేగా అని బాలు రచ్చ చేస్తాడు.

నన్ను అరెస్ట్ చేయండి
ఊదుతా రాజా అంటూ అరుణ్ చెంపలు పట్టుకుంటాడు. అరెయ్ ఎక్కువ చేస్తున్నావురా అని రాజేష్ అంటాడు. ఇందాక తాగలేదని తెలిసింది కదా. ఇప్పుడెందుకు తాగొచ్చి ఇష్యూ చేస్తున్నావని మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటాడు. బ్రీత్ అనలజైర్ తీసుకుని ఊదిన బాలు వెలిగింది.. వెలిగింది.. నన్ను అరెస్ట్ చేయండని అరుణ్‌తో అంటాడు.
ఏంటీ తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నావని కేస్ పెడతానని అరుణ్ అంటాడు. అయితే ఇలా లేకుంటే అలా అని బాలు అంటాడు. నీ ఫ్రెండ్‌ని తీసుకెళ్లు. ఆరోజు నో పార్కింగ్‌లో వీడియో తీశావ్‌గా నేను కూడా తీయనా అని అరుణ్ అంటాడు. వద్దు సర్ పరువు పోతుంది అని రాజేష్ అంటాడు. నేను తాగొచ్చాను, నువ్వు తాగలేదు. నా ప్రతాపం ఏంటో చూస్తావా అని బాలు గోల చేస్తాడు.
మరో కానిస్టేబుల్ కూడా తీసుకెళ్లకుంటే ఇద్దరిని లోపల వేస్తానని అంటాడు. ఇక్కడ నాటుకోడి గుడ్డు దొరుకుతుందట కదా. ఎక్కడ అని అరుణ్‌ని అవమానిస్తాడు బాలు. అదంతా ఎందుకురా అని బాలును బలవంతంగా తీసుకెళ్తాడు రాజేష్. బాలు ఇంటికి వెళ్తాడు. తూలి సోఫాలో పడిపోతాడు. ఎందుకు తాగొచ్చారని మీనా అనుకుంటుంది.
సంపాదిస్తున్నావని పొగరా..
బాలు డిపాజిట్ డబ్బు ఇస్తాడు. నేను తాగుబోతుల డబ్బు తీసుకోను అని మీనా అంటుంది. తీసుకోను. అవసరమైతే ఆర్డర్ అయిన వదులుకుంటా కానీ తీసుకోను అని మీనా అంటుంది. అరుణ్ వల్లే తాగాను అని జరిగింది అంతా చెబుతాడు బాలు. అది అతని డ్యూటీ చేస్తున్నారు. అలాంటివాళ్లని గౌరవించాల్సిందిపోయింది కనబడిన ప్రతిసారి గొడవ పెట్టుకోకూడదు అని మీనా అంటుంది.
బాలు, మీనా ఇద్దరు గొడవ పడతారు. ఇప్పుడేంటీ రభస. ఎవడో గొప్పోడు నేను తాగుబోతుని, రౌడీనీ, గుండాని, గొడవలు పెట్టుకునే జులాయిని అని బాలు అంటాడు. మీకు మీరే ఇన్ని పేర్లు పెట్టుకుంటారనుకోలేదని మీనా అంటుంది. ఏయ్ ఏంటే నువ్వు కూడా సంపాదిస్తున్నావని పొగరా.. నీకు.. నేను కూడా సంపాదించాను. ఇదిగో 50 వేలు, ఇదిగో రెండు వేలు, ఇదిగో 500 అని 52 వేల 500 రూపాయలు పూలల్లో పెట్టి ఇస్తాడు బాలు.
తాగుబోతుల డబ్బు వద్దంటుంది మీనా. నీకో దండం అని పెట్టి వెళ్లిపోతాడు బాలు. మరుసటి రోజు ఉదయం సుమతిని అరుణ్ కలిసి చాక్లెట్ ఇస్తాడు. మీనా ఆర్డర్, డిపాజిట్ గురించి చెబుతుంది సుమతి. మొత్తం 5 లక్షల డిపాజిట్ కావాలని సుమతి చెబుతుంది. ఇప్పుడు మీ అక్క దగ్గర ఎంత ఉందని అరుణ్ అడిగితే.. అక్క, బావ దగ్గర కలిపి 2 లక్షలు అంటుంది సుమతి.
నీకు కాబోయే భర్త ఇస్తాడుగా
అయితే సమస్య తీరిపోయినట్లే. మిగతా 3 లక్షలు నీ పియాన్సీ ఇస్తాడుగా అని అరుణ్ అంటే.. దేవుడా ఇంతకంటే అవమానం ఇంకా ఉంటుంద. అది నేనే అని అరుణ్ అంటాడు. వద్దద్దు.. మీ దగ్గర డబ్బులు తీసుకోవడం వద్దు. ఎవరి దగ్గరైనా అప్పుకు అడిగి ఇవ్వండని సుమతి అంటుంది. నేను అప్పు అడిగిన వాళ్లకు లంచం అడిగినట్లు అవుతుంది. నేను డబ్బు తీసుకుంటే వాళ్లు అడిగిన పని చేయాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదని అరుణ్ అంటాడు.
అయితే, ఇంకోచోట ట్రై చేద్దామని సుమతి అంటాడు. నా దగ్గరే తీసుకోండి. వడ్డీ లేని రుణమే. నాకు అవసరం అయితే నువ్వు ఇవ్వవా అని అరుణ్ అంటే.. ప్రాణమైనా ఇస్తానని సుమతి అంటుంది. అరుణ్ చాలాసేపు బతిమిలాడటంతో సుమతి ఒప్పుకుంటుంది. బ్యాంక్‌కు వెళ్లి అరుణ్ డబ్బు డ్రా చేసుకుని తీసుకొస్తానంటాడు.
బావ లాగే అరుణ్‌ది కూడా చాలా మంచి మనసు. పెళ్లయ్యాక తోడళ్లుల్లు కాస్తా అన్నదమ్ములు అవుతారేమో అని సుమతి అనుకుంటుంది. మరోవైపు తలపట్టుకుని మీనా కాఫీ అని అడుగుతాడు బాలు. ప్లాస్క్‌లో తీసుకొస్తుంది మీనా. బాలుపై సెటైర్లు వేస్తుంది మీనా. నువ్వు ఇలాగే మాట్లాడితే నీ రక్తం తాగుతా అని మీనా పీక పట్టుకుంటాడు బాలు.
నలుగురిలో నన్ను అవమానిస్తున్నావ్
రక్తం తాగితే ఇంకా ఎక్కువ కిక్కు ఇస్తుందా అని మీనా అంటుంది. ఇంతలో రవి, శ్రుతి వస్తారు. శ్రుతి కాఫీ తాగుతుంది. రాత్రి జరిగిన గొడవ గురించి రవి అడిగితే.. బాలు తాగొచ్చిన విషయం బయటపడుతుంది. పోలీస్‌తో వాదించడానికే తాగాను అని బాలు అంటాడు. తాగడం మానేసినట్లే ఉంటారు. కానీ, ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఆలోచిస్తున్నారు అని మీనా అంటుంది.
తన బాధ చెప్పుకుంటాడు బాలు. నా బేరం పోగొట్టాడని చెబుతాడు బాలు. నువ్వు గొడవ పడితే నీ భార్యగా మీనాకు అవమానమేగా అని శ్రుతి అంటుంది. బాలుకు మీనా చివాట్లు పెడుతుంది. నలుగురిలో నన్ను అవమానిస్తున్నావుగా అని బాలు అంటాడు. ఇక్కడ ఇద్దరేగా ఉన్నారు. తప్పు చేస్తే కన్నతల్లిని అయినా క్షమించను అని మీనా అంటుంది.
బాలు చెప్పిందే మళ్లీ చెబుతాడు. బాలు తీసుకొచ్చిన డబ్బు మీనా తీసుకుని వడ్డీ కూడా ఇస్తానంటుంది. ఇంతలో మీనాకు కాల్ చేసి వెంటనే హాస్పిటల్‌కు రమ్మంటుంది మీనా. సరేనంటుంది. ఎక్కడికి అని బాలు అడిగితే.. వెళ్లొచ్చి చెబుతాను అని పట్టించుకోకుండా వెళ్తుంది మీనా. నిన్ను మీనా ఇగ్నోర్ చేస్తుంది. ఇంకోసారి మీనాను బాధపెట్టకు అని బాలుతో శ్రుతి అంటుంది.
3 లక్షలు ఇచ్చిన సుమతి- మీనాకు అరుణ్ సహాయం
హాస్పిటల్‌కు మీనా వెళ్తుంది. డబ్బు రెడీ అయిందా అని సుమతి అడుగుతుంది. రెండు లక్షలు ఉన్నాయని మీనా అంటే.. ఇంకో మూడు లక్షలు ఇదిగే అని సుమతి ఇస్తుంది. ఇంత డబ్బు ఎక్కడిదే అని మీనా అడిగితే.. నాకు కావాల్సిన ఫ్రెండ్ ఉన్నారు. చేబదులు తీసుకున్నాను. త్వరగా డిపాజిట్ ఇవ్వు. లేకుంటే ఆర్డర్ పోతుందని అని సుమతి చెబుతుంది.
మీనా సరేనంటుంది. తర్వాత బాలుకు మీనా ఎన్నిసార్లు కాల్ చేసిన కావాలనే లిఫ్ట్ చేయడు. సత్యం వచ్చి బాలు గురించి అడిగితే.. కాల్ చేస్తాడు. బాలు లిఫ్ట్ చేస్తాడు. కానీ, మీనా మాట్లాడుతుంది. తర్వాత మనోజ్ పడుకుని ఉంటాడు. రోహిణి చూస్తుంటుంది. ఇంతలో ప్రభావతి వచ్చి ఏయ్ ఏం చేస్తున్నావే నా కొడుకుని అని అడుగుతుంది.
రోహిణిపై నిందలు
మనోజ్‌కి జ్వరం వచ్చిందని రోహిణి చెబుతుంది. దాంతో కంగారుపడిపోయిన ప్రభావతి ఇంత ఆలస్యంగానా చెప్పేది. నువ్వు వరలక్ష్మీ వ్రతం చేసుంటే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని రోహిణిని నిందిస్తూ తిడుతుంది అత్త ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


