Gunde Ninda Gudi Gantalu Today Episode: అరుణ్ దెబ్బతో తప్పతాగిన బాలు- మీనాకు డబ్బు ఇస్తానన్న సుమతి- మీనాతోనూ బాలు గొడవ!
Gunde Ninda Gudi Gantalu Serial September 14th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో బాలు కస్టమర్‌తో వెళ్తుంటే ట్రాఫిక్ పోలీస్ డ్రింకింగ్ టెస్ట్ చేస్తానంటాడు. బాలు తాగలేదని, ఊదనని గొడవ పెట్టుకుంటాడు. దాంతో కస్టమర్ వెళ్లిపోతాడు. ఆ కోపంతో బారులో తప్పతాగుతాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సింగరాజు డబ్బు ఇవ్వననకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో పడిపోతుంది మీనా. ఇంతలో బాలు కాల్ చేస్తాడు. సింగరాజు విషయం చెబుతుంది మీనా.

చాలా గర్వంగా ఛాలెంజ్ చేశా
ఆర్డర్ రాకముందే డిపాజిట్ పెట్టే రిస్క్ చేయలేనని అన్నారని, చింతామణి ముందు చాలా గర్వంగా ఛాలెంజ్ చేశా. నేను చెప్పిన మాట నన్ను ఇబ్బందిపెట్టేలా ఉందని మీనా అంటుంది. ఫైనాన్షియర్‌కు కనిపించేది డబ్బు మాత్రమే. పెట్టినదానికి ఎంత వస్తుందనే చూస్తారు. మనం సాయం చేయమంటాం కానీ వాళ్లు బిజినెస్ అంటారని బాలు అంటాడు.
ఒకసారి ఇంటికెళ్లి మా అమ్మను కలిసి వస్తాను అని మీనా చెబుతుంది. మీనాకు డబ్బు దొరికే అవకాశం చూడమని బాలు అంటాడు. ఇంతలో ఓప్యాసెంజర్ ఫ్యామిలీతో వచ్చి కారు క్లీన్‌గా ఉందో చూస్తాడు. బాలును స్నానం చేశావా అని, చుక్క, ముక్క ముట్టుకున్నావా అని అడుగుతాడు. గుడికి వెళ్తున్నాం కదా. శుచి శుభ్రత పాటిస్తే మంచిది కదా అని అతను అంటాడు.
స్నానం చేశానని, నాలుగు ఇడ్లీలు తిన్నానని, మందు తాగి డ్రైవింగ్ చేయడం నేరమని బాలు అంటాడు. దాంతో వాళ్లు ఎక్కుతారు. దారిలో ట్రాఫిక్ పోలీస్ అరుణ్ ఆపుతాడు. ఇతను తాగి నడుపుతుంటాడు అని బాలును బ్రీత్ అనలైజర్ ఊదమంటాడు. నేను తాగలేదు. తాగనప్పుడు ఎందుకు ఊదాలని బాలు వాదిస్తాడు. ఊదితే దొరికిపోతానని భయమా అని అరుణ్ అంటాడు.
అరుణ్‌తో బాలు గొడవ
ఇతని గురించి నాకు తెలుసు. మీరు వేరే కారు చూసుకోండని అరుణ్ అంటాడు. దాంతో ఆ ఫ్యామిలీ తాగనప్పుడు ఊదొచ్చుగా అంటూ వెళ్లిపోతారు. నా బిజినెస్ పోగొట్టాలని చేశావుగా అని బాలు అంటే.. ఊదమన్నప్పుడు ఊదొచ్చుగా అని అరుణ్ అంటాడు. నా బిజినెస్ పోయేలా చేసింది కాక తప్పు చేయనిదానికి ఊదమంటావా. నేను ఊదను అని బాలు మొండిపట్టు పడతాడు.
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బాలు అంటాడు. ఎందుకయ్యా ఎప్పుడు ఇతనితో గొడవ పడతావ్ అని మరొక కానిస్టేబుల్ అంటాడు. కావాలని చెడు ఉద్దేశంతో ఊదమంటే నేనెందుకు ఊదుతాను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అని బాలు అంటాడు. నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా ఊదమని అడుగుతున్నా. నాకు నీ మీద ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అతను అంటాడు.
ఇలా పద్ధతిగా అడిగితే ఎందుకు ఊదను అని ఊదుతాడు బాలు. తాగలేదని వస్తుంది. నేను నిప్పు. తప్పు ఈ చేయడు బాలు. నా బేరం పోగొట్టారు. టైమ్ వేస్ట్ చేశారు. దారిదోపిడి చేసినట్లు ఏంటీది అని గొడవ పెట్టుకుంటాడు బాలు. ఏంటీ నీ ప్రాబ్లమ్ అని అరుణ్ మీదకు వస్తే.. వదిలేయండి సర్ అని మరొకతను తీసుకెళ్లిపోతాడు. నా అహం మీద గట్టి దెబ్బ కొట్టావ్ అని రాజేష్‌ను రమ్మని కాల్ చేస్తాడు బాలు.
5 లక్షలు ఇస్తానన్న సుమతి
పుట్టింటికి వెళ్తుంది మీనా. 5 లక్షల డిపాజిట్ ఆర్డర్ గురించి తల్లి పార్వతికి మీనా చెబుతుంది. కట్టడానికే చేతుల్లో డబ్బులు లేవని మీనా అంటుంది. వాళ్లు అడ్వాన్స్ ఇవ్వాల్సిపోయింది మీరే డిపాజిట్ పెట్టడం ఏంటే అని పార్వతి అంటుంది. పెద్ద పెద్ద కంపెనీల్లో ఇలాగే ఉంటుదట. పని పూర్తయ్యక కట్టిన డబ్బుతో పాటు మొత్తం ఇస్తారంట అని మీనా అంటుంది.
సింగరాజు గురించి కూడా చెబుతుంది మీనా. ఇంతలో సుమతి వస్తుంది. మీనా గురించి పార్వతి చెబుతుంది. ఇప్పుడు ఐదు లక్షలే కదా కావాల్సింది. నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు అని సుమతి అడుగుతుంది. లక్షనర వరకు ఉండొచ్చని మీనా అంటే.. ఇంకా మూడున్నర లక్షలు కావాల్సింది. అవి నేనిస్తాను అని సుమతి అంటుంది.
నా పెళ్లి కోసం అప్పుడో ఇప్పుడో దాచిన డబ్బు ఉంది. అది 3, 4 లక్షల వరకు అవ్వొచ్చు అని సుమతి చెబుతుంది. నాకేం అవసరం వచ్చిన బావ చూసుకుంటాడని సుమతి అంటుంది. నా మనసు ఒప్పుకోవట్లేదని మీనా అంటుంది. నువ్వు ఎంత సాయం చేశావో నేను మర్చిపోలేను. ఇంకేం ఆలోచించకుండా తీసుకో అని సుమతి అంటుంది.
తప్పతాగిన బాలు
పని పూర్తయ్యకా మొత్తం వస్తుందిగా తీసుకో అని పార్వతి అంటుంది. నీ పెళ్లి డబ్బులు వద్దు. నా మనసు ఒప్పుకోవట్లేదు. వేరే చోట ప్రయత్నిస్తాం. ఆఖరి నిమిషం వరకు ట్రై చేస్తా. అప్పుడు దొరక్కుంటే నీ దగ్గరే తీసుకుంటా అని మీనా అంటుంది. మరోవైపు బారులో ఫ్రెండ్స్‌తో బాలు మందు తాగుతూ పోలీసుల దౌర్జన్యం గురించి మాట్లాడుతాడు.
రాజేష్ వస్తాడు. మళ్లీ మందు తాగడం స్టార్ట్ చేశావేంట్రా అని అడుగుతాడు. మందు తాగేలా చేశాడు ఆ పోలీసోడు అని బాలు జరిగింది చెబుతాడు. కస్టమర్స్‌తో వెళ్తుంటే తాగావేమో అని ఊదమన్నాడు. అది వాళ్ల డ్యూటీ. ఊదితే తప్పేంటిరా అని రాజేష్ అంటాడు. ఈ పోలీస్ అడిగితే నాకు ఊదాలనిపించలేదని బాలు అంటాడు.
అన్ని చోట్ల మొండిగా ఉండటం కరెక్ట్ కాదు అని రాజేష్ అంటాడు. ఇప్పుడు అరుణ్ గాడి దగ్గరికి వెళ్లి నేను ఊదుతాను. నువ్వు డ్రైవ్ చేస్తావ్. నేను ఊదుతాను అని బాలు అంటాడు. అనవసరంగా వాళ్లతో గొడవ ఎందుకురా అని రాజేష్ అంటాడు. ఎంత చెప్పిన బాలు వినకుండా రాజేష్‌ను తీసుకెళ్తాడు బాలు. కారులో కూడా బాలు ఏదోటి అరుస్తుంటాడు.
తాగి పోలీసోడితో గొడవ
ఇప్పుడు తప్పతాగావుగా అని రాజేష్ అంటాడు. ఆ పోలీసోడి దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకోవాల్సిందే అని బాలు అంటాడు. బాలు కారు చూసిన అరుణ్ ఆపడు. కారు సీట్లో రాజేష్‌ను చూసి వెళ్లమంటాడు. అందరిని టెస్ట్ చేస్తున్నారుగా నన్ను కూడా చేయండని రాజేష్ అంటాడు. నాకు అనుమానం లేనివాళ్లను టెస్ట్ చేయనని అరుణ్ అంటాడు.
హలో అంటూ బాలు దిగుతాడు. ఇందాక నేను వెళ్తుంటే నా ఇగో మీద దెబ్బ కొట్టావ్. ఇప్పుడు పట్టించుకోవట్లేదేంటీ. ఫుల్లుగా తాగాను. ఇప్పుడు ఊదుతాను అని బాలు గొడవ పెట్టుకుంటాడు. కట్ చేస్తే తాగి తూలుతూ ఇంటికి వెళ్తాడు బాలు. మీనా ముందే సోఫాలో పడిపోతాడు. మీనాకు డబ్బు ఇస్తాడు. నేను తాగుబోతుల డబ్బు తీసుకోను అని మీనా బాలును అవమానిస్తుంది.
మీనాతో బాలు గొడవ
అరుణ్ గురించి చెబుతాడు బాలు. అతని డ్యూటీ చేశారు. ప్రతిసారి ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని మీనా అంటుంది. నువ్వు కూడా సంపాదిస్తున్నావని పొగరా నీకు.. మూడు పెగ్గులు వేస్తే లొల్లి లొల్లి చేస్తారు.. ఛీ అని మీనాతో గొడవ పడతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


