Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు హెల్ప్ చేసిన అరుణ్- దొరికిన లొకేషన్- శివకి డ్రగ్స్ ఇంజక్షన్, కేసు- గుణ పగ
Gunde Ninda Gudi Gantalu Serial August 25th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 25వ తేది ఎపిసోడ్‌లో బాలుకు శివ కనిపించట్లేదని సుమతి కాల్ చేసి చెబుతుంది. శివ డెలివరి ఇచ్చిన హోటల్‌కు వెళ్లి సీసీటీవీ చూస్తారు. శివను కట్టేసిన గుణ డ్రగ్స్ ఇంజక్షన్ ఇప్పించి, కేసు పెట్టి జైలుపాలు చేస్తానంటాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కళ్ల ఆరోగ్యం గురించి మీనా చెప్పడంతో ఆపుతావా కళ్ల డాక్టర్ అయ్యేలున్నావ్ అంటాడు బాలు. శివకు ఇవాళ డిగ్రీ పరీక్ష ఉందని మీనా చెబుతుంది. వాడు మారాడు. పాస్ అయి బాగా చదివి మిమ్మల్ని బాగా చూసుకుంటాడని బాలు అంటాడు.

మీనా కన్నీళ్లు
మా నాన్న కూడా ఇదే ఆశపడ్డాడు. కానీ, అంతలోనే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా. శివకు మంచి ఉద్యోగం రావాలని మీనా అంటే.. సుమతి కూడా ఉంది. తనకు మంచి పెళ్లి సంబంధం చూడాలని బాలు అంటాడు. మావయ్యకు కాఫీ ఇవ్వడం మర్చిపోయానని మీనా వెళ్లిపోతుంది. ఇంతలో బాలుకు సుమతి కాల్ చేసి శివ నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాలేదని, చదుకోడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఇంకా రాలేదంటుంది.
ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందంటే చార్జింగ్ లేదేమో అని బాలు అంటాడు. చార్జర్ కూడా తీసుకెళ్లడాని సుమతి చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. నేను చూసుకుంటా. కానీ, మీ అక్కకు చెప్పకని బాలు వెళ్లిపోతాడు. మీనాకు చెప్పకుండా బాలు వెళ్లిపోతాడు. రాజేష్ బైక్‌పై వస్తే గుణ గాడి ఆఫీస్‌కు తీసుకెళ్లు అంటాడు. శివ గురించి చెబుతాడు. గుణ ఆఫీస్‌కు తాళం ఉంటుంది.
దాంతో బాలు మరింత కోపంతో ఊగిపోతాడు. గుణ గాడే ఏదో చేసి ఉంటాడని బాలు అంటాడు. శివను పరీక్ష రాయనని గుణ వార్నింగ్ ఇచ్చింది గుర్తు చేసుకుంటాడు బాలు. అప్పుడే జాగ్రత్తపడాల్సిందని ఫీల్ అవుతాడు. శివ పార్ట్ టైమ్‌లో ఫుడ్ డెలివరి చేస్తుంటాడుగా అని అక్కడికి వెళ్తారు బాలు, రాజేష్. శివ గురించి చెప్పి రాత్రి డెలివరికి వచ్చాడా అని అడుగుతారు.
సీసీటీవీలో శివ కిడ్నాప్ రికార్డ్
నిన్న సాయంత్రం డెలివరీ చేశాడని, గోకవరం బస్టాండ్ పక్కన కాకతీయ రెస్టారెంట్ అని, ఇవాళ ఎగ్జామ్ ఉంది రానని చెప్పాడని వాళ్లు చెబుతారు. దాంతో అక్కడికి బాలు, రాజేష్ వెళ్తారు. అక్కడ శివ బైక్ ఉంటుంది. గురించి రెస్టారెంట్‌లకు వెళ్లి శివ గురించి చెప్పి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు బాలు. కానీ, ఓనర్ మాత్రం పోలీసులతో రమ్మని, ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వలేమంటుంది.
బాలు దండం పెట్టబోతుంటే రాజేష్ ఆపి ఆవిడ వినేలా లేదు గానీ నువ్వు రా అని బయటకు తీసుకెళ్తాడు రాజేష్. అక్కడికే మీనా పూల డెలివరికి వస్తుంది. బాలును చూసి మాట్లాడుతుంది. ఇంతలో శివ బైక్ కనిపించి ఇక్కడ ఉన్నాడేంటీ, ఎగ్జామ్‌కి వెళ్లలేదా ఏంటని కంగారుపడుతుంది మీనా. దాంతో శివ కనిపించట్లేదని బాలు నిజం చెబుతాడు.
గుణ కిడ్నాప్ చేసి ఉంటాడేమో అని బాలు చెబుతాడు. ఓనర్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లేదని బాలు అంటే.. ఆవిడ నాకు తెలుసు అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. హోటల్ ఓనర్‌కి పూలు ఇచ్చి శివ తన తమ్ముడే అని చెబుతుంది. దాంతో ఓనర్ సీసీటీవీ ఫుటేజ్ చూపించేందుకు ఒప్పుకుంటుంది. సీసీటీవీ ఫుటేజ్‌లో శివను కిడ్నాప్ చేసింది కనిపిస్తుంది.
అరుణ్ సహాయం తీసుకున్న సుమతి
కారు నెంబర్ నోట్ చేసుకుని వెళ్తారు. శివ తన దగ్గర పనిచేయట్లేదని గుణకు కోపం అంతే, దానికే ఇలా కిడ్నాప్ చేశాడని మీనాకు సర్దిచెప్పుతాడు బాలు. ఎగ్జామ్ టైమ్ అవుతుందని మీనా అంటుంది. సైబర్ క్రైమ్‌కు వెళ్లి శివ నెంబర్ ఇచ్చి చివరిగా ఎక్కడ లొకేట్ అయిందో తెలుసుకుంటామని బాలు అంటాడు. మీనాను ఇంటికెళ్లమని బాలు, రాజేష్ వెళ్తారు.
మరోవైపు సుమతి ఇప్పడు ఏం చేయడం అని కంగారుపడుతుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్‌కు కాల్ చేసి శివ గురించి చెబుతుంది సుమతి. శివకు ఇవాళే డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్. ఇది రాయకపోతే వాడి చదువు పూర్తి కాదు, ఉద్యోగం రాదు. మా అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు. గుణ దగ్గర ఇంతకుముందు శివ పనిచేసేవాడని, మానేశాకా మళ్లీ వర్క్ చేయమని ఇబ్బందిపెట్టేవాడని, నాకు అతని మీదే అనుమానంగా ఉందని సుమతి చెబుతుంది.
శివ నెంబర్ పంపించమని అరుణ్ అడుగుతాడు. సుమతి పంపిస్తుంది. మరోవైపు పోలీసుల దగ్గరకు వెళ్లి శివ గురించి జరిగింది మొత్తం చెబుతాడు బాలు. ముందు మీ లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చాక మీరు అడిగిన వివరాలు ఇస్తామని పోలీస్ అంటాడు. ఇంతలో అతనికి కాల్ వస్తుంది. రేయ్ నువ్వు అడిగిన లొకేషన్ వివరాలు తెలిశాయి. అడ్రస్ రాసుకో అని చెబుతాడు.
బాలుకు హెల్ప్ చేసిన అరుణ్
ఫ్రెండ్స్ ఉంటే ఎంత ఈజీగా కనుక్కుంటున్నారో అని బాలు అంటాడు. ఇద్దరు వెళ్లిపోతారు. సుమతికి అరుణ్ కాల్ చేసి అడ్రస్ చెబుతాడు. అక్కడికి వెళ్లి చూస్తానంటే వద్దని, తన బావ బాలును పంపిస్తానని చెబుతుంది సుమతి. దాంతో సుమతికి అరుణ్ లొకేషన్ సెండ్ చేస్తాడు. బాలుకు సుమతి కాల్ చేసి సెల్ ఫోన్ సిగ్నల్స్ బట్టి శివ ఉండే లొకేషన్ తెలిసిందని చెబుతుంది.
దాంతో బాలు షాక్ అవుతాడు. బాలుకు సుమతి లొకేషన్ పంపిస్తుంది. అంటే తనకు తెలియకుండానే బాలుకు అరుణ్ హెల్ప్ చేస్తాడు. మరోవైపు గుణను తిట్టుకుంటూ శివ గురించి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు శివను కట్టేసి ఉంచుతాడు గుణ. శివకు డ్రగ్స్ ఇంజెక్షన్ ఇస్తుంటాడు. నువ్వు తీసుకోవడం కాకుండానే కాలేజీలో స్టూడెంట్స్‌కు అమ్ముతున్నావని కేసు పెట్టిస్తానని గుణ బెదిరిస్తాడు.
శివకు డ్రగ్స్ ఇంజెక్షన్, కేసు
శివ బాడీలోకి ఇంజెక్షన్‌తో డ్సగ్స్ పంపిస్తాడు గుణ. మరోవైపు బామ్మర్ది శివ లొకేషన్ దొరకడంతో రాజేష్ బైక్‌పై బాలు వస్తుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


