Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్తాకోడళ్ల సర్వస్వం స్వాహా.. మాతాజీ మాయ.. విద్యకు కొత్త విల్లా.. లవ్ గురు మీనా

Gunde Ninda Gudi Gantalu Serial October 5th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 5 ఎపిసోడ్ లో ప్రభావతి, రోహిణి ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి స్వాహా మాతాజీనే నమ్ముకుంటారు. ఇద్దరూ మునుగుతారు.

Published on: Oct 5, 2026, 07:07:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఇటు ప్రభావతి, రోహిణి ఎపిసోడ్ తోపాటు మురళీ, విద్య లవ్ ట్రాక్ ను కూడా చూపించారు. పైగా విద్య కోసం మురళీ కొత్త విల్లా కొనడం, తమ లవ్ గురులను ఒకరికొకరు పరిచయం చేయాలనుకోవడం ఇందులో చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్తాకోడళ్ల సర్వస్వం స్వాహా.. మాతాజీ మాయ.. విద్యకు కొత్త విల్లా.. లవ్ గురు మీనా
Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్తాకోడళ్ల సర్వస్వం స్వాహా.. మాతాజీ మాయ.. విద్యకు కొత్త విల్లా.. లవ్ గురు మీనా

అత్తపై మండిపడిన రోహిణి..

మనోజ్ కు రోహిణిని వదిలించుకొని కోటీశ్వరురాలితో పెళ్లి చేస్తానని ప్రభావతి చెప్పే సీన్ తో సీరియల్ సోమవారం (అక్టోబర్ 5) ఎపిసోడ్ మొదలైంది. ప్రభావతి వెళ్లిపోయిన తర్వాత కామాక్షి రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఆమె షాక్ లో ఉండిపోతుంది. మొత్తం వినేశావా అని అడుగుతుంది.

అసలు ఆమెది నోరేనా.. అలా ఎలా మాట్లాడుతుంది అని రోహిణి అంటుంది. నువ్వు మాత్రం తక్కువా అని కామాక్షి అనడంతో.. ఇక లాభం లేదు.. నేను కూడా ముల్లును ముల్లుతోనే తీస్తాను.. ఆ మాతాజీ అపాయింట్‌మెంట్ తీసుకొని నాకు చెప్పండి.. మా అత్తను ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు అని చెప్పి రోహిణి వెళ్లిపోతుంది.

విద్య కోసం మురళీ మందస పాలకోవా.. కొత్త విల్లా కూడా..

మరోవైపు విద్య ఇంటికి మురళీ వస్తాడు. ఆమె కోసం మందస నుంచి పాలకోవా తెప్పిస్తాడు. ఆమె ఎంగిలి తింటాడు. ఆ తర్వాత నీకోసం కొత్త విల్లా కొన్నానని, పెళ్లి తర్వాత నువ్వు అందులోనే అడుగు పెట్టాలని చెబుతాడు. దీంతో విద్య ఆశ్చర్యపోతుంది.

అంతేకాదు ఆ విల్లాను చూడటానికి వెళ్దాం.. అక్కడే ఓ వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను.. ఆ వ్యక్తి నా లవ్ గురు.. నీ ప్రేమ దక్కడానికి కారణం అని మురళీ అంటాడు. విద్య కూడా తన లవ్ గురుని పరిచయం చేస్తానని అతనికి చెబుతుంది. తర్వాత మురళీ వెళ్లిపోతాడు.

మీనాకు మురళీని పరిచయం చేస్తానన్న విద్య..

వెంటనే మీనాకు ఫోన్ చేసి పిలిపిస్తుంది విద్య. మురళీ వచ్చి వెళ్లిన విషయం చెబుతుంది. తన కోసం విల్లా కొన్నాడని, అది చూడటానికి వెళ్తున్నానని అంటుంది. దీంతో మీనా సంతోషిస్తుంది. అప్పుడే నిన్ను అతనికి పరిచయం చేయాలనుకుంటున్నానని చెబుతుంది. నువ్వే నా లవ్ గురు.. నీ వల్లే అతడు నాకు దొరికాడు.. రేపు కచ్చితంగా నువ్వు రావాలి అని అంటుంది. సరే అన్న మీనా.. రోహిణిని కూడా తీసుకురమ్మని అడుగుతుంది.

ఆమె ఇప్పుడు వద్దులే అని విద్య అంటే.. ఆమె ఇంకా ఏమైనా సీక్రెట్స్ దాచిందా అని మీనా ప్రశ్నిస్తుంది. చింటు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారకూడదు అనుకున్న విద్య.. అలాంటిదేమీ లేదని అంటుంది. మలేషియా విషయం దాచి పెట్టావ్ కదా అని మీనా అడిగితే.. రోహిణి తన ఫ్రెండ్ అని, ఫ్రెండ్ సీక్రెట్స్ ఎలా చెప్పగలనని విద్య అంటుంది. ఆ తర్వాత మీనా వెళ్లిపోతుంది.

విద్య ఇంటికి రోహిణి.. అత్త టార్చర్ గురించి చెప్పి..

అప్పుడే విద్య ఇంటికి వస్తున్న రోహిణి ఆమెను చూస్తుంది. ఈ మధ్య నా కంటే నీకు మీనానే ఎక్కువైంది కదా అని విద్యను దెప్పిపొడుస్తుంది. అలాంటిదేమీ లేదని, మురళీని పరిచయం చేయాలని చెప్పడానికి తానే పిలిచానని చెబుతుంది. నిన్ను కూడా తీసుకురావాలని మీనానే మనస్ఫూర్తిగా అడిగింది అని విద్య అంటుంది.

మీనా మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది.. నేనే మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకొని మాట్లాడతాను కదా అని రోహిణి అంటుంది. తాను ఏం మాట్లాడినా రోహిణి తప్పుబడుతుండటంతో విద్య సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత తన అత్త టార్చర్ గురించి చెప్పుకుని బాధపడుతుంది రోహిణి. మనోజ్ తో విడదీయాలని చూస్తోందని, అందుకే తాను కూడా ఆమె దారిలోనే వెళ్లాలనుకుంటున్నట్లు చెబుతుంది.

స్వాహా మాతాజీ దగ్గరికి ప్రభావతి, కామాక్షి.. కొడుకు, కోడలు విడిపోవాలని..

మరోవైపు కామాక్షితో కలిసి స్వాహా మాతాజీ దగ్గరికి వెళ్తుంది ప్రభావతి. ఆ స్వాహా మాతాజీ పెద్ద ఫ్రాడ్ అని చూడగానే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. ప్రభావతి, కామాక్షి ముందు కొందరు ఆర్టిస్టులను పెట్టించి వాళ్లతో డ్రామా ఆడిస్తారు. కళ్లు లేని వ్యక్తికి కళ్లు వచ్చినట్లు, కాళ్లు లేని వ్యక్తికి కాళ్లు వచ్చినట్లు స్వాహా మాతాజీ చేస్తుంది. అదంతా చూసిన ప్రభావతి తెగ మురిసిపోతుంది.

స్వాహా మాతాజీకి పడీపడీ దండాలు పెడుతుంది. ఆ తర్వాత తన మనసులో ఉన్న కోరిక చెబుతుంది. తన కోడలు అబద్ధాల కోరు అని, తనను మోసం చేసిందని, తన కొడుకు, కోడలు విడిపోవాలని, ఆ తర్వాత తన కొడుకుకు కోటీశ్వరురాలిని తెచ్చి చేస్తానని అంటుంది.

అది విన్న స్వాహా మాతాజీ అలా చేయడం తప్పు అని చెప్పినా ప్రభావతి వినదు. దీంతో బిందెలో చేయి పెట్టి భార్యాభర్తలను కలిపే తాయత్తు కాకుండా విడగొట్టే తాయత్తు ఇవ్వమని అడుగుతుంది. కింది నుంచి మాతాజీ అసిస్టెంట్.. ఓ తాయత్తు ఆమె చేతిలో పెడతాడు. దానిని ప్రభావతికి ఇస్తుంది.

మనోజ్ తాయత్తు సత్యానికి..

ఆ తాయత్తును ఇంటికి తీసుకొచ్చిన ప్రభావతి.. పూజ గదిలో పెట్టి దానిని ఎవరూ ముట్టుకోకూడదని మీనాకు చెబుతుంది. కానీ ఆమె లేని సమయంలో బాలు ఆ తాయత్తు తీసుకొని.. ఇది నాన్న కోసమే అమ్మ తీసుకొచ్చిందని దానిని అతనికి కట్టడానికి వెళ్తాడు.

అది చూసిన ప్రభావతి పరుగెత్తుకుంటూ వచ్చి.. అది మీ నాన్నకు కాదు అని చెబుతుంది. వీడు మా ఇద్దరినీ విడదీసేలా ఉన్నాడని మనసులో అనుకుంటుంది. మరి ఎవరికి అని బాలు నిలదీస్తే ప్రభావతి బిక్కమొహం వేస్తుంది. అంతటితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More