Gunde Ninda Gudi Gantalu Today Episode: తాయత్తు మహిమ.. శృతి ప్రెగ్నెంట్.. కడుపు చూసి రవి షాక్.. మీనా నడుము వదలని బాలు
Gunde Ninda Gudi Gantalu Serial October 7th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 7 ఎపిసోడ్ లో తాయత్తు మహిమతో ఇటు శృతి ప్రెగ్నెంట్ అయిపోగా.. అటు మీనా నడుమును చూసి ఆమెపై పడిపోతుంటాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం ప్రభావతి, రోహిణి తాయత్తులు.. వాటిని వాడుకొని శృతి, బాలు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోవడం, అటు మనోజ్ రెండు తాయత్తులతో పిచ్చివాడిలా ప్రవర్తించడంలాంటి సీన్లను చూడొచ్చు.

రొమాంటిక్ మూడ్‌లో బాలు.. తాయత్తు పీకి పారేసిన మీనా
ప్రభావతి తెచ్చిన తాయత్తు కట్టుకొని మీనా మీనా అని పాట పాడుతూ ఆమెపై బాలు పడే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. మల్లెపూలు చుట్టుకొని, మీనాపై పూలు చల్లుతూ బాలు పూర్తిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతాడు. మీనా కూడా అతనితో రొమాన్స్ మొదలు పెడుతుంది.
చివరికి అతనికి చేతికి ఉన్న తాయత్తు చూస్తుంది. దీనివల్లేనా ఇదంతా అని అడుగుతుంది. ఇది కట్టుకుంటే పిల్లలు పుడతారని అమ్మ చెప్పిందిగా.. మనం అర్జెంటుగా ఓ క్రికెట్ టీమ్ ను కనేయాలని అంటాడు. దీంతో మీనా అతని చేతికి ఉన్న తాయత్తును పీకి పారేస్తుంది. అప్పుడే కిందికి దిగుతున్న శృతి చేతుల్లో ఆ తాయత్తు పడుతుంది.
తాయత్తు కట్టుకొని శృతి ప్రెగ్నెంట్.. రవిని ఆట పట్టించి..
ఆ తాయత్తు పట్టుకోగానే శృతికి కూడా పిల్లల ఆలోచన వస్తుంది. దీనిని రవికి కట్టి ఓ ఆటాడుకోవాలని అనుకుంటుంది. వెంటనే తాయత్తు తీసుకొని రవి దగ్గరికి వెళ్తుంది. ఇది కట్టుకో.. మీ అమ్మతోపాటు నువ్వు కూడా దీనిని కట్టుకుంటే పిల్లలు పుడతారని అన్నావు కదా.. మనం తల్లిదండ్రులవుదాం అని అంటుంది. కానీ రవి మాత్రం శృతిని పట్టించుకోకుండా తాయత్తు కట్టుకోనంటూ బాత్రూమ్ లోకి వెళ్తాడు. ఆలోపు శృతి తనకు తాను తాయత్తు కట్టుకుంటుంది. రవి రాగానే శృతి తనకు కడుపు వచ్చిందంటూ చూపిస్తుంది.
ఆ కడుపు చూసి రవి షాక్ తింటాడు. ఈ తాయత్తు పని చేస్తోంది.. నువ్వు, మీ అమ్మ చెప్పినట్లే నాకు కడుపు వచ్చింది.. మనకు అబ్బాయి పుడితే ప్రభాస్, అమ్మాయి పుడితే అనుష్క అని పేరు పెట్టుకుందాం.. నాకు శ్రీమంతం చేయించు.. పుల్లగా తినాలనిపిస్తోంది అని శృతి అనడంతో రవికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఈ కడుపేంటి.. అసలేం జరుగుతోందని అయోమయానికి గురవుతాడు. దీంతో తాను లోపల దాచుకున్న దిండును శృతి బయటకు తీస్తుంది. అది చూసి రవి ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తాయత్తు ఎక్కడుందో అక్కడే పెట్టేయమని రవి అంటాడు.
మనోజ్‌కు ప్రభావతి, రోహిణి తాయత్తులు
మరోవైపు మనోజ్ కు తాయత్తు కట్టే టైమ్ కావడంతో ప్రభావతి హడావిడి చేస్తుంది. తీరా పూజగదిలో చూస్తే అది కనిపించదు. ఎవరు కట్టుకున్నారో, ఎవరి కాపురం కూలిపోతుందో అని టెన్షన్ పడుతుంది. మళ్లీ తాయత్తును మాయం చేశారా అని బాలుని అడిగితే.. తనకు తెలియదని అతడు అంటాడు. ఆలోపు శృతి తాయత్తు పట్టుకొని వస్తుంది. ఆమె చేతుల్లో నుంచి లాక్కొని వెంటనే మనోజ్ కు కట్టేయాలని అనగానే అతడే కిందికి వస్తాడు. మనోజ్ ను మళ్లీ పైకి తీసుకెళ్తుంది.
గదిలోకి తీసుకెళ్లి.. నువ్వు కోటీశ్వరుడివి కాబోతున్నావు.. నీకోసం తాయత్తు తెచ్చానంటూ కడుతుంది. అప్పుడే రోహిణి కూడా మరో తాయత్తుతో వస్తూ.. దానికి విరుగుడు తెచ్చానని అనుకుంటుంది. ప్రభావతి వెళ్లిపోయిన తర్వాత మనోజ్ దగ్గరికి వచ్చి నీకోసం తాయత్తు తెచ్చాననడంతో ఇప్పుడే అమ్మ కట్టింది కదా అని అంటాడు. అది నీ షాపు బాగా నడవడానికి.. నేను తెచ్చింది నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ బిజినెస్‌మ్యాన్ కావడానికి అని చెప్పడంతో మనోజ్ సంతోషంతో అది కూడా కట్టించుకుంటాడు. మీ అమ్మ కట్టిన నెగటివ్ శక్తికి ఇది పాజిటివ్ విరుగుడు అని మనసులో రోహిణి అనుకుంటుంది.
తాయత్తుపై బాలు డౌట్.. మీనా నడుము చూసి టెంప్ట్ అయి..
ఆ తర్వాత ఈ తాయత్తు గురించి బాలు ఆలోచిస్తుంటాడు. గాల్లోకి చూస్తూ తనలో తనే మాట్లాడుకోవడం చూసి మీనా షాక్ తింటుంది. ఏం జరిగిందని అడిగితే.. అసలు ఆ తాయత్తు ఎక్కడిది.. ఎందుకు తెచ్చింది.. మా అమ్మ ఏం చేసినా అందులో ఏదో లోతైన విషయం దాగి ఉంటుంది.. ఈ సమయంలో మనోజ్ గాడికి పిల్లల కోసం తాయత్తు తేవడం ఏంటి.. కుదిరితే ఇద్దరినీ విడతీస్తుంది కదా.. ఇందులో ఏదో మతలబు ఉంది అని బాలు అంటాడు.
మీనా కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తుంది. అయినా ఆ తాయత్తు గోల మనకెందుకు.. ముందు పడుకుందాం అంటూ కిటికీ కర్టెన్లు వేయడానికి వెళ్తుంది. అప్పుడే వెనుక నుంచి బాలు ఆమె నడుమును చూసి టెంప్ట్ అవుతాడు. ఆ తాయత్తు మహిమ తనను ఇంకా వీడటం లేదంటూ మీనాతో మరోసారి రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే బాలుకి ఫోన్ వస్తుంది.
బాలుకి మురళీ ఫోన్.. నువ్వు నా లవ్ గురు అంటూ..
బయటకు వెళ్లి బాలు ఫోన్ మాట్లాడతాడు. మురళీ అతనికి ఫోన్ చేస్తాడు. రేపు ఒక చోటికి రావాలని అంటాడు. ఎందుకు అని అడిగితే తాను విల్లా కొన్నానని, అది నువ్వు చూడాలని చెబుతాడు. దానిని నేను ఎందుకు అని బాలు అంటే.. నువ్వు నా లవ్ గురువి అన్నా.. నీ వల్లే నేను ఓ ఇంటివాడిని కాబోతున్నాను.. అలాంటిది ఇల్లు కొనేటప్పుడు నువ్వు లేకపోతే ఎలా.. నా లవర్ ను కూడా తీసుకొస్తున్నాను.. నువ్వు కూడా వదినను తీసుకొని రా అని మురళీ అంటాడు.
ఆమె ఎందుకని అడిగితే.. మీ ఇద్దరూ కలిసి మా ఇద్దరినీ ఆశీర్వదించాలని అనడంతో.. ఆమె నిన్ను చూస్తేనే మండిపడుతుంది అని బాలు మనసులో అనుకుంటాడు. అటు మీనాను కూడా విద్య రమ్మని చెప్పడంతో ఈ భార్యాభర్తలు విద్య, మురళీని చూసి ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆసక్తి నెలకొంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


