Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి కక్కుర్తి.. బోల్తా కొట్టించిన లాయర్.. ఇంటికి తిరిగొచ్చిన శివ..
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 2 ఎపిసోడ్ లో ప్రభావతి కక్కుర్తి తెలుసుకున్న బాలు లాయర్ ఆమెను బోల్తా కొట్టిస్తాడు. దీంతో శివ మళ్లీ ఎలాంటి కేసు లేకుండా ఇంటికి వస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సత్యం చెప్పినా వినని ప్రభావతి.. డబ్బుకు మాత్రం పడిపోతుంది. బాలు లాయర్ మాటలతో బోల్తా కొట్టించి కేసు వాపసు తీసుకునేలా చేస్తాడు. దీంతో శివ ఇంటికి వస్తాడు.

పట్టు వీడని ప్రభావతి, సత్యం.. బతిమాలిన రోహిణి, మనోజ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (ఏప్రిల్ 2) ఎపిసోడ్ సత్యం అడిగిన మాటకు ప్రభావతి నో చెప్పే సీన్ తో మొదలవుతుంది. అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటూ సత్యం వెళ్లిపోతాడు. ఇద్దరూ పట్టు వీడరు. అప్పుడే మనోజ్, రోహిణి అక్కడికి వస్తారు. శివపై కేసును వెనక్కి తీసుకోవద్దని వాళ్లు కూడా చెబుతారు.
అయితే ఇంటికి రమ్మని బతిమాలుతారు. రోహిణి నటిస్తూ మీరు లేకపోతే ఆ ఇంట్లో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని అంటుంది. ఆ బాలు, మీనాలను ఇంట్లో నుంచి పంపించేస్తానని మరోసారి ప్రభావతి చెబుతుంది. అయితే తాను లేకుండా బాలు జోలికి వెళ్లొద్దని కొడుకుకు స్పష్టం చేస్తుంది.
కొడుకు, కోడలే కావాలని చెప్పిన సత్యం
ఇటు ఇంట్లో అపార్థం చేసుకున్నందుకు మీనాకు రవి, శృతి క్షమాపణ చెబుతారు. అప్పుడే సత్యం తిరిగి ఇంటికి వస్తాడు. అమ్మ ఒప్పుకుందా అని బాలు అడుగుతాడు. నాన్న ముఖం చూస్తే తెలియడం లేదా ఒప్పుకోలేదని అని రవి అంటాడు. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తే ఒప్పుకుంటా అని అంటోంది.. అవసరం లేదని చెప్పాను.. నేను ఉండగా మీరు ఎక్కడికీ వెళ్లరు.. నాకు కొడుకు, కోడలే ముఖ్యం అని సత్యం తేల్చి చెబుతాడు. శివ సంగతి ఏం చేయాలో లాయర్ ను అడిగి వస్తామని బాలు, మీనా వెళ్తారు.
5 లక్షలు ఖర్చవుతుందన్న లాయర్..
జరిగిన విషయం లాయర్ కు చెబుతారు. అలా అయితే రూ.5 లక్షలు ఖర్చవుతాయని లాయర్ అంటాడు. దీంతో చేసేది లేక బాలు, మీనా ఆ డబ్బు కోసం నానా తిప్పలు పడతారు. ఓ చోట రూ.2 లక్షలు అప్పు చేస్తాడు బాలు. రాజేష్, పార్వతి, సత్యం కూడా తమకు తోచినంత సాయం చేస్తారు. దీంతో మొత్తం రూ.4.5 లక్షలు అవుతుంది. ఆ డబ్బును లాయర్ కు ఇస్తారు. సరే.. ఈ డబ్బుతోనే తాను చేయగలిగింది చేస్తాను.. మీ అమ్మతో కేసు వాపసు తీసుకునేలా చేస్తానని లాయర్ అంటాడు.
ప్రభావతిని బోల్తా కొట్టించిన బాలు లాయర్
ప్రభావతి డబ్బు మనిషి అని లాయర్ అసిస్టెంట్ అతనితో చెబుతాడు. అలా అయితే తమ పని ఇంకా సులువు అవుతుందని, ఆమె దగ్గరికే వెళ్దామని చెప్పి కామాక్షి ఇంటికి వెళ్తారు. లాయర్ తోనూ ప్రభావతి అలాగే మాట్లాడుతుంది. కేసు వాపసు తీసుకోనని మొండికేస్తుంది. తన పరువు, ప్రతిష్ట మంట కలిశాయి.. తన లక్ష కొట్టేశాడు అంటూ ఏదేదో చెబుతుంది.
కానీ బాలు లాయర్ ఆమెను మాటలతో బోల్తా కొట్టిస్తాడు. అలా అయితే ఐదారేళ్లు కోర్టు చుట్టూ తిరగాలి.. పైగా అతన్ని చెప్పుతో కొట్టడం బస్తీవాళ్లు చూశారు.. దానికి మరో మూడు నెలల జైలు శిక్ష ఖాయం.. ఇదంతా పోయినా శివ తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని వదులుతాడన్న గ్యారెంటీ కూడా లేదు అని లాయర్ భయపెడతాడు.
రూ.2 లక్షలకు కుదిరిన బేరం..
దీంతో ప్రభావతి వెనక్కి తగ్గుతుంది. భయంతో వణికిపోతుంది. చివరికి బాలు లాయర్ ఆమెకు డబ్బు ఆఫర్ చేస్తాడు. రూ.50 వేల నుంచి మొదలు పెడితే చివరికి రూ.2 లక్షలకు బేరం కుదురుతుంది. ఆ డబ్బు తీసుకొని కేసు వాపసు తీసుకోవడానికి ప్రభావతి ఒప్పుకుంటుంది. ఆ డబ్బును కామాక్షి తన వంటింట్లో పప్పుల డబ్బాలో దాచి పెడుతుంది. తాను డబ్బు తీసుకున్న విషయం తన ఇంట్లో వాళ్లెవరికీ తెలియకూడదని కూడా ప్రభావతి షరతు విధిస్తుంది. దానికి లాయర్ సరే అంటాడు.
బాలుకి గుడ్ న్యూస్ చెప్పిన లాయర్
ఆ తర్వాత లాయర్ బాలుకి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెబుతాడు. మీ అమ్మ కేసు వాపసు తీసుకోవడానికి ఒప్పుకుందని, ఇది కేవలం ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పిందని అంటాడు. అది విని బాలు, మీనా, సత్యం సంతోషిస్తారు. అయితే మనోజ్, రోహిణి మాత్రం ఆశ్చర్యపోతారు. అలా ఎలా ఒప్పుకుంది అని అడుగుతారు.
రోహిణి, మనోజ్‌లకు మీనా క్లాస్
అయినా శివలాంటి వాళ్లను జైల్లో వేస్తే బుద్ధి వస్తుందని మనోజ్, రోహిణి అంటారు. దీంతో మీనా వాళ్లకు క్లాస్ పీకుతుంది. మీ నాన్న జైల్లో ఉండి ఎన్ని రోజులు అవుతుంది.. అంత మోసం ఆయన ఏం చేశాడు అని అనడంతో వాళ్లు నోరు మూసుకుంటారు. మీనాకు రవి కూడా తోడవడంతో మనోజ్, రోహిణి ముఖాలు వాడిపోతాయి.
వెంటనే బాలు, మీనా వెళ్లి శివను ఇంటికి తీసుకొస్తారు. అమ్మ కేసు వాపసు తీసుకుందని చెప్పడంతో వాళ్లంతా సంతోషిస్తారు. శివ పశ్చాత్తాపంతో క్షమాపణ చెబుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


