Hanuman Ansh Producer: ఇండియన్ సినీ ఇండస్ట్రీని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తూ, అతి చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామా 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలమైండ్ బ్లాంక్ చేసింది.
అతిపెద్ద హిట్

తక్కువ థియేటర్లలో పరిమితంగా విడుదలైన ఈ చిన్న సినిమా ‘హనుమాన్ అంశ’ పబ్లిక్ మౌత్ టాక్ తో పాపులర్ అయింది. ప్రేక్షకుల ఆదరణతో దేశవ్యాప్త బ్లాక్‌బస్టర్‌గా అవతరించి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అతిపెద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇంత డబ్బు ఏం చేయాలో తెలియడం లేదంటూ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ప్రొడ్యూసర్ కామెంట్లు
హనుమాన్ అంశ సినిమా ఊహించని విజయం కంటే కూడా, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన 21 ఏళ్ల యంగ్ ప్రొడ్యూసర్ అనుప్రియ నాగర్ (Anupriya Nagar) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను దోచుకుంటున్నాయి. ఇంతటి చిన్న వయసులోనే వందల కోట్ల లాభాలు రావడంపై ఆమె వినయంగా స్పందించింది.
డబ్బు ఏం చేయాలో?
"నా వయస్సు కేవలం 21 సంవత్సరాలు. నా జీవితంలో ఇంతటి భారీ సంపదను ఎప్పుడూ చూడలేదు, హ్యాండిల్ చేయలేదు. ఇంత డబ్బును ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఈ లాభాల్లో అత్యధిక భాగాన్ని పేద పిల్లల చదువు, వైద్యం, చారిటీ కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాను" అని అనుప్రియ మంచి మనసు చాటుకుంది.
కొద్దిపాటి విజయానికే అహంకారం ప్రదర్శించే నేటి సినీ వాతావరణంలో, రూ. 200 కోట్లకు పైగా లాభాలు వచ్చినా ఆమె చూపిన మానవత్వంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
దేవుడి కాన్సెప్ట్ మ్యాజిక్
{{/usCountry}}కొద్దిపాటి విజయానికే అహంకారం ప్రదర్శించే నేటి సినీ వాతావరణంలో, రూ. 200 కోట్లకు పైగా లాభాలు వచ్చినా ఆమె చూపిన మానవత్వంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
దేవుడి కాన్సెప్ట్ మ్యాజిక్
{{/usCountry}}ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో పెట్టిన పెట్టుబడికి ఏకంగా 118 రెట్లకు పైగా లాభాలు రాబట్టిన సినిమాలు అత్యంత అరుదు. గతంలో వచ్చిన కాంతార, కార్తికేయ 2, హనుమాన్ చిత్రాల బాటలోనే 'హనుమాన్ అంశ' కూడా సనాతన ధర్మం, భక్తి ఎలిమెంట్స్‌కు బలమైన కథనాన్ని జోడించి రూ. 2 కోట్ల పరిమిత వ్యయంతోనే నిర్మితమైంది. స్టార్ కాస్టింగ్ లేకపోయినా, ఎమోషన్, నేటివిటీ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇది నిరూపించింది.
యంగ్ ప్రొడ్యూసర్లు
సాధారణంగా భారీ లాభాలు వచ్చిన వెంటనే హంగామా చేయడం లేదా తదుపరి భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం జరుగుతుంది. కానీ, 21 ఏళ్ల వయసులోనే వచ్చిన అనూహ్య సంపదను సామాజిక సేవకు వినియోగిస్తానని ప్రకటించడం ద్వారా అనుప్రియ తన బ్రాండ్ ఇమేజ్‌ను వ్యాపార పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారనే టాక్ వినిపిస్తోంది.
ఓటీటీ కోసం డిమాండ్
బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లాకింగ్ సక్సెస్ సాధించిన హనుమాన్ అంశ చిత్రం రైట్స్ గురించి డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం ప్రధాన డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ప్రముఖ శాటిలైట్ ఛానెళ్లు భారీ ఫ్యాన్సీ ఆఫర్లతో పోటీపడుతున్నాయి. థియేటర్లలో సాధించిన ఈ అనూహ్య విజయం, త్వరలో రాబోయే దీని ఓటీటీ ప్రసారానికి, డిజిటల్ వ్యూయర్‌షిప్‌కు మరింత మైలేజ్ ఇస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.