Hanuman Ansh Producer: వసూళ్లు రూ.400 కోట్లు.. అయినా సీక్వెల్ బడ్జెట్ మాత్రం అంతే.. ఎందుకో చెప్పిన ప్రొడ్యూసర్
Hanuman Ansh Producer: హనుమాన్ అంశ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయినా సీక్వెల్ ను కూడా తొలి మూవీ బడ్జెట్ లోనే తీస్తున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు. రూ.400 కోట్లకుపైగా వసూలు చేసినా.. తాము అనవసర ఖర్చులు పెట్టడం ఇష్టం లేదని ఆమె చెప్పడం గమనార్హం.
Hanuman Ansh Producer: కేవలం రూ. 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 414 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన సంచలన మూవీ 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) సీక్వెల్‌పై ప్రొడ్యూసర్ అనుప్రియ నాగర్ ఒక షాకింగ్ విషయం వెల్లడించారు. ఈ సినిమా వందల కోట్లు కొల్లగొట్టినప్పటికీ, రాబోయే పార్ట్ 2 కోసం అనవసరంగా బడ్జెట్ పెంచే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.

రూ. 400 కోట్లొచ్చినా సేమ్ బడ్జెట్.. అసలు కారణం ఇదే
సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయితే.. దాని సీక్వెల్‌కి నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ పెంచి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తారు. అయితే 'హనుమాన్ అంశ్' ప్రొడ్యూసర్ అనుప్రియ నాగర్ మాత్రం పూర్తి భిన్నమైన బాటలో పయనిస్తున్నారు. రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పార్ట్ 2 కోసం విచ్చలవిడిగా రూ. 10 కోట్లు లేదా రూ. 20 కోట్లు ఖర్చు పెడితే కథలోని సోల్ పోతుందని స్పష్టం చేశారు.
అవసరం లేకపోయినా బడ్జెట్ పెంచితే సీన్లలో అనవసరమైన VFX, AI టెక్నాలజీ వాడాల్సి వస్తుందని, అది కథ ఒరిజినాలిటీని దెబ్బతీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు ఇచ్చిన ఆడియెన్స్ ప్రేమను క్యాష్ చేసుకోవడానికి డబ్బులను వృథాగా ఖర్చు చేయలేమని చెప్పారు.
50 రోజులు దాటినా తగ్గని క్రేజ్.. రూ. 10 లక్షల నుంచి రూ. 400 కోట్లకు
ఈ సినిమా సాధించిన విజయం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డు. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు కేవలం రూ. 10 లక్షల వసూళ్లతో చాలా నెమ్మదిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే రెండో వారం నుంచి ఊహించని రేంజ్‌లో పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ఇప్పటికే 50 రోజులకు పైగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ డివోషనల్ బయోపిక్.. ఇండియాలో రూ. 300 కోట్ల నెట్ కలెక్షన్లు దాటేసింది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ. 414 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.
నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా..
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా తొలి జీవిత ఘట్టాల ఆధారంగా రూపొందింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీ నారాయణ్ అనే బాలుడు దేవుడి కోసం ఇల్లు వదిలి వెళ్లి, ఉత్తర భారతదేశమంతటా ఆధ్యాత్మిక ప్రయాణం చేసి 'నీమ్ కరోలీ బాబా'గా ఎలా మారారనేది చిత్రంలో అత్యంత భావోద్వేగభరితంగా చూపించారు.
ఈ సినిమాలో శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో జీవించగా, అనిల్ రస్తోగి, పూర్ణిమ తివారి, సుగంధ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. విజువల్ టెక్స్చర్, పిరియడ్ అట్మాస్ఫియర్ ప్రేక్షకులను 1940ల నాటి ప్రాచీన భారతదేశ వాతావరణానికి తీసుకెళ్లాయి.
సోనీ లివ్‌లో నెట్‌వర్క్ వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్
ఈ సినిమా బాక్సాఫీస్ విజయాన్ని చూసి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) అలాగే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ కూడా రంగంలోకి దిగాయి. నీమ్ కరోలీ బాబా జీవితంలో జరిగిన అద్భుతాలు, ఆయన భక్తుల అనుభవాల ఆధారంగా ఒక భారీ వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేశాయి.
దీనికి సంబంధించిన ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆడియెన్స్‌ను మంత్రముగ్ధులను చేసిన బాబా జీవిత విశేషాలను త్వరలోనే పూర్తిస్థాయి సిరీస్‌గా డిజిటల్ స్క్రీన్‌పైకి తీసుకురాబోతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


