Hanuman Ansh: ఈ సినిమా సక్సెస్ మాకో చెంప పెట్టు.. అసలుసిసలు పాన్ ఇండియా మూవీ అంటే ఇదీ..: ప్రొడ్యూసర్ రవిశంకర్
Hanuman Ansh: హనుమాన్ అంశ్ మూవీ సక్సెస్ తమకో చెంప పెట్టు అని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ అనడం గమనార్హం. కేవలం రూ.2 కోట్ల పెట్టి రూ.400 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా అసలుసిసలు పాన్ ఇండియా ఫిల్మ్ అని అన్నారు.
Hanuman Ansh: మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ (Y. Ravi Shankar) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం రూ.2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాలీవుడ్ డివోషనల్ హిట్ 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) విజయం తమలాంటి ప్రొడ్యూసర్లకు ఒక రకమైన చెంపపెట్టు అని ఆయన కుండబద్దలు కొట్టారు.

హోంబలే ఫిల్మ్స్ ప్రెజెంట్స్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
ఈ వారం తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న 'హనుమాన్ అంశ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో మేకర్స్ ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది.
ఈ ప్రెస్ మీట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
"వందల కోట్లు పెడుతున్నాం.. ఫలితం ఉండట్లేదు!" - రవిశంకర్ ఆవేదన
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నాం. కానీ బాక్సాఫీస్ దగ్గర రూపాయి వస్తుందో రాదో గ్యారెంటీ ఉండటం లేదు. ఇలాంటి టైమ్‌లో 'హనుమాన్ అంశ్' కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో వచ్చి రూ. 400 కోట్లు వసూలు చేయడం నిజంగా ప్రొడ్యూసర్లు అందరికీ ఒక పెద్ద కనువిప్పు. మాకు చెంప పెట్టులాంటిదే" అని చెప్పారు.
అంతేకాకుండా అసలైన పాన్ ఇండియా సినిమా అంటే ఇదేనని ఆయన అభివర్ణించారు. ఏ భాషలో వీలైతే ఆ భాషలో ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయాలని, ఎంత ఎక్కువ మందికి చేరితే అంత మంచిదని హోంబలే ఫిల్మ్స్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో బురద జల్లుకోవడాలు, ఏఐతో అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం అని చెప్పారు. మొన్న ఇరుముడి, ఇప్పుడీ హనుమాన్ అంశ్ సినిమాలకు ఆ దేవుడే అండగా నిలిచి బ్లాక్‌బస్టర్ చేస్తున్నాడేమో అని కూడా అన్నారు.
కంటెంట్ ఈజ్ కింగ్.. భారీ బడ్జెట్లు ఇక వర్కవుట్ కావు
గత కొంతకాలంగా కేవలం భారీ బడ్జెట్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకుని వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే సరైన ఎమోషన్, పవర్ ఫుల్ కంటెంట్ లేకపోతే ఆడియన్స్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భక్తి, దైవత్వంతో కూడిన పవర్ ఫుల్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'హనుమాన్ అంశ్' సాధించిన ఈ సంచలన విజయం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రొడ్యూసర్లకు ఒక హెచ్చరికలా మారింది. భారీ బడ్జెట్‌లు పెట్టడం కంటే కంటెంట్‌పై ఫోకస్ పెడితేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాలు మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని ఈ మూవీ మరోసారి నిరూపించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


