Hanuman Ansh Telugu: తెలుగులోకి రూ.150 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. త్రివిక్రమ్ సమర్పణలో.. రిలీజ్ డేట్ ఇదే

Hanuman Ansh Telugu: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్ అంశ తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ఈ సినిమా రానుండటం విశేషం. మరి ఈ మూవీ విశేషాలు, బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Sep 11, 2026, 17:18:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hanuman Ansh Telugu: కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర రూ. 153 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన బాలీవుడ్ డివైన్ బ్లాక్‌బస్టర్ 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ అసాధారణమైన డివోషనల్ సినిమాను టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Hanuman Ansh Telugu: తెలుగులోకి రూ.150 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. త్రివిక్రమ్ సమర్పణలో.. రిలీజ్ డేట్ ఇదే
Hanuman Ansh Telugu: తెలుగులోకి రూ.150 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. త్రివిక్రమ్ సమర్పణలో.. రిలీజ్ డేట్ ఇదే

విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలిచే ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రేంజ్‌లో వసూళ్ల సునామీ సృష్టించింది. ట్రేడ్ పండితులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తూ వారం వారం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది.

రంగంలోకి దిగిన త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

ఉత్తరాదిన సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కులను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఆయన సతీమణి సాయి సౌజన్య నేతృత్వంలోని 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ రూపొందించారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించిన వార్తలు రాగా, తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా మోషన్ పోస్టర్ షేర్ చేస్తూ సెప్టెంబర్ 18న రిలీజ్ ఖరారు చేసినట్లు ప్రకటించింది. త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్ తోడవ్వడంతో తెలుగు చిత్రసీమలో ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.

నీమ్ కరోలి బాబా డివైన్ జర్నీ.. అసలు కథేంటంటే?

కైంచీ ధామ్ (ఉత్తరాఖండ్) కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నీమ్ కరోలి బాబా జీవితంలోని కీలక ఘట్టాలు, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, జూలియా రాబర్ట్స్ లాంటి గ్లోబల్ సెలబ్రిటీలు సైతం పూజించే ఈ ఆధ్యాత్మిక గురువు జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించారు.

లక్ష్మీ నారాయణ్ శర్మ అనే చిన్న కుర్రాడు హనుమంతుడిపై ఉన్న అపారమైన భక్తితో దైవాన్ని వెతుక్కుంటూ వెళ్లి నీమ్ కరోలి బాబాగా ఎలా మారాడు అనేది దర్శకుడు విశాల్ చతుర్వేది గుండెలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. ఈ సినిమాలో శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో జీవించగా, చందన్ ఆనంద్, నిఖిల్ దూబే, ఉదయ్‌సింహ రాజ్‌పుత్, పూర్ణిమ తివారి కీలక పాత్రల్లో మెరిసారు.

2 కోట్ల బడ్జెట్.. 150 కోట్లకు పైగా వసూళ్లు

స్వయంభూ మీడియా నెట్‌వర్క్ నిర్మించిన ఈ చిత్రం ఎటువంటి అట్టహాసాలు, పెద్ద నటీనటులు లేకుండా కేవలం బలమైన కంటెంట్, భక్తిరస భావనలతో థియేటర్లలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. రోజురోజుకూ కేవలం మౌత్ టాక్ ద్వారా పెరిగి థియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతూ వెళ్లడం విశేషం.

విశాల్ చతుర్వేది రాసిన 'డివైన్ డిటూర్' పుస్తకం ఆధారంగా మూడు భాగాల ట్రైలజీగా రానున్న ఈ ఫ్రాంచైజీలో 'హనుమాన్ అంశ' మొదటి భాగంగా ప్రేక్షకులను అలరిస్తోంది. సెప్టెంబర్ 18న తెలుగులో విడుదలవుతున్న ఈ సినిమా ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More