NTR Trivikram Movie: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కోసం రెండు టైటిల్స్.. గాడ్ ఆఫ్ వార్‌తోపాటు మరో పవర్‌ఫుల్ టైటిల్
NTR Trivikram Movie Title: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం మేకర్స్ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్ అని ఇప్పటికే ప్రచారంలో ఉన్న టైటిల్ ఒకటి కాగా.. దేవసేనాపతి అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు.
NTR Trivikram Movie Title: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌పై ఒక క్రేజీ అప్‌డేట్ లీక్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ కానున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రొడక్షన్ హౌస్ రెండు పవర్‌ఫుల్ టైటిల్స్ రిజిస్టర్ చేయించింది. ఆ టైటిల్స్ వింటేనే నందమూరి ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం ఖాయం.

'గాడ్ ఆఫ్ వార్' వర్సెస్ 'దేవసేనాపతి'.. మైండ్ బ్లోయింగ్ టైటిల్స్
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ 'గాడ్ ఆఫ్ వార్' (God of War) తో పాటు 'దేవసేనాపతి' (Devasenapathi) అనే రెండు క్రేజీ పేర్లను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించింది. గత కొన్ని నెలలుగా 'గాడ్ ఆఫ్ వార్' అనే పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చిన 'దేవసేనాపతి' టైటిల్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇందులో మైథలాజికల్ టచ్‌తో పాటు విపరీతమైన మాస్ అప్పీల్ ఉండటంతో ఈ పేరే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ఫిక్స్ చేసినా బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమే అని చెప్పవచ్చు.
'అరవింద సమేత' మ్యాజిక్ రిపీట్ కాబోతుందా?
గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్టీఆర్‌ను సరికొత్త షేడ్‌లో ప్రెజెంట్ చేసిన త్రివిక్రమ్.. ఈసారి అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్యే ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ షూటింగ్ లో గాయపడ్డారు. దానికి సర్జరీ కూడా జరిగింది. దీంతో 8 వారాల పాటు షూటింగులకు దూరం కానున్నారు. ఆ ప్రభావం డ్రాగన్ తోపాటు త్రివిక్రమ్ మూవీపైనా పడనుంది.
అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు?
ప్రస్తుతానికి ఈ రెండు టైటిల్స్‌లో ఏది ఫైనల్ అవుతుందనే దానిపై మేకర్స్ నుంచి ఎలాంటి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగిన నేపథ్యంలో.. పాన్ ఇండియా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ కాస్టింగ్, క్రూతో పాటు ఆఫీషియల్ టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


