మళ్లీ మనం హాగ్వార్ట్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టే టైమ్ వచ్చేసింది. జేకే రౌలింగ్ రాసిన సూపర్ హిట్ బుక్ సిరీస్ హ్యారీ పోటర్ ఆధారంగా రాబోతున్న కొత్త వెబ్ సిరీస్ టీజర్‌ను హెచ్‌బీవో రిలీజ్ చేసింది. హ్యారీ పోటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్ బుక్ ఆధారంగా వస్తున్న ఈ ఫస్ట్ సీజన్‌లో, ఆ మ్యాజికల్ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్న కొత్త కాస్ట్‌ను పరిచయం చేశారు. హాగ్వార్ట్స్‌లో హ్యారీ జర్నీ ఎలా మొదలైంది అనేది సరికొత్త లుక్‌తో మన ముందుకు తీసుకురాబోతున్నారు.
హ్యారీ పోటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్ టీజర్

డర్స్లీ ఫ్యామిలీతో కలిసి ఉంటున్న చిన్నప్పటి హ్యారీ పోటర్ రోల్ చేసిన డొమినిక్ మెక్‌లాఫ్లిన్ తో ఈ వెబ్ సిరీస్ టీజర్ మొదలవుతుంది. హ్యారీ జీవితాన్ని మార్చేసే ఆ లెటర్ రావడానికి ముందు, అతని కజిన్ డడ్లీ అతన్ని ఎలా హేళన చేసేవాడు, ఆంట్ పెట్యూనియా అతన్ని ఎలా తక్కువ చేసి మాట్లాడేది అనేది ఒక మాంటేజ్‌లో చూపించారు.
ఆ తర్వాత హాగ్వార్ట్స్ గేమ్‌కీపర్ హాగ్రిడ్‌గా నిక్ ఫ్రాస్ట్ ఎంట్రీ ఇచ్చి, హ్యారీని ఆ మ్యాజిక్ స్కూల్‌కు తీసుకెళ్తాడు. అక్కడ హ్యారీకి తన టీచర్స్, జాన్ లిత్‌గో ప్లే చేసిన హెడ్‌మాస్టర్ ఆల్బస్ డంబుల్‌డోర్ తో పాటు, తన లైఫ్‌లాంగ్ ఫ్రెండ్స్ అయిన అలస్దైర్ స్టౌట్ ప్లే చేసిన రాన్ వీస్లీ, అరబెల్లా స్టాంటన్ ప్లే చేసిన హెర్మియోన్ గ్రేంజర్ ల పరిచయం జరుగుతుంది.
ఫ్యాన్స్ రియాక్షన్స్.. స్నేప్ క్యారెక్టర్‌పై ట్రోల్స్
ఈ షో టీజర్‌పై ఫ్యాన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ఒరిజినల్ బుక్స్‌కు ఇచ్చిన రెస్పెక్ట్, అక్యూరసీ చూసి కొందరు ఆనందపడిపోతుంటే, ఇంకొందరు మాత్రం క్యాస్టింగ్ ఛాయిస్‌లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌లో డడ్లీ ఎగతాళి చేస్తుంటే హ్యారీ పైకప్పు మీద పడిపోయే సీన్ పక్కాగా బుక్ ఫ్యాన్స్ కోసమే తీశారు అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈ సిరీస్ రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల, రౌలింగ్ బుక్స్‌లో ఉన్న చాలా విషయాలను స్క్రీన్ మీద చూపించడానికి మేకర్స్‌కు మంచి ఛాన్స్ దొరికిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఊహించిన దానికంటే వాళ్లు చాలా ఎక్కువ చూపించారు, సెట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి అని ఇంకొకరు కామెంట్ చేశారు.
{{/usCountry}}ఈ సిరీస్ రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల, రౌలింగ్ బుక్స్‌లో ఉన్న చాలా విషయాలను స్క్రీన్ మీద చూపించడానికి మేకర్స్‌కు మంచి ఛాన్స్ దొరికిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఊహించిన దానికంటే వాళ్లు చాలా ఎక్కువ చూపించారు, సెట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి అని ఇంకొకరు కామెంట్ చేశారు.
{{/usCountry}}కానీ అందరూ హ్యాపీగా లేరు. బుక్‌ను వేరే ఫాంట్‌లో చదివినట్లు ఉంది అని ఒకరు సెటైర్ వేయగా.. ఒక ట్రైలర్ చూసి నాకు ఇన్ని మిక్స్‌డ్ ఫీలింగ్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని మరొకరు రాసుకొచ్చారు. ముఖ్యంగా పోషన్స్ మాస్టర్ సెవెరస్ స్నేప్ క్యారెక్టర్‌కు పాపా ఎస్సీడును తీసుకోవడంపై చాలా విమర్శలు, సెటైర్లు వస్తున్నాయి. ఈ షోలో ఆ క్యారెక్టర్ జాతిని నల్లజాతీయుడిగా అంటే బ్లాక్ పర్సన్‌గా మార్చేశారు. ఈ సిరీస్‌లో నటించినందుకు తనపై రేసిస్ట్ దాడులు జరిగాయని ఆ యాక్టర్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ క్రిస్మస్ 2026 కానుకగా హెచ్‌బీవో మ్యాక్స్‌లో రిలీజ్ కాబోతోంది.
హ్యారీ పోటర్ రీబూట్ సిరీస్ డీటెయిల్స్ ఇవే..
నిజానికి హ్యారీ పోటర్ బుక్స్‌ను బేస్ చేసుకుని 2001 నుంచి 2011 మధ్యలో ఏకంగా ఎనిమిది సినిమాలు వచ్చాయి. డేనియల్ రాడ్‌క్లిఫ్ మెయిన్ లీడ్‌గా నటించిన ఆ సక్సెస్‌ఫుల్ సినిమాలు.. రూపెర్ట్ గ్రింట్, ఎమ్మా వాట్సన్ లాంటి వాళ్ల కెరీర్‌ను కూడా మార్చేశాయి.
అయితే ఇప్పుడు వస్తున్న ఈ కొత్త రీబూట్ సిరీస్.. ఆ సినిమాల కంటే ఇంకా పక్కాగా బుక్స్‌ను ఫాలో అవుతూ, ఒరిజినల్ బుక్ సిరీస్‌లో ఉన్న చాలా విషయాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. యూకేలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లీవ్‌స్‌డెన్‌లో ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో చాలామంది స్టార్లు నటిస్తున్నారు.