నేను పక్కా వెజిటేరియన్.. సౌత్ ఇండియన్ ఫుడ్ తింటాను.. ఉపవాసం ఉంటాను: 77 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉండటంపై హేమా మాలిని

తమిళనాడు అయ్యంగార్ వర్గానికి చెందిన హేమా మాలిని 77 వయసులోనూ ఇంకా ఫిట్ గా ఉండటం వెనుక సీక్రెట్ ఏంటో చెప్పింది. తాను కేవలం వెజిటేరియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ తింటానని, ఉపవాసం ఉంటానని చెప్పడం విశేషం.

Published on: Oct 16, 2025, 15:45:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డ్రీమ్ గర్ల్ హేమ మాలిని గురువారం (అక్టోబర్ 16) 77 ఏళ్లు పూర్తి చేసుకొని 78వ ఏట అడుగుపెట్టింది. ఇప్పటికీ ఆమె ఎంతో ఫిట్‌గా కనిపిస్తోంది. తన అద్భుతమైన ఫిట్‌నెస్ రొటీన్‌లో యోగా, డ్యాన్సింగ్, మెడిటేషన్, బ్యాలెన్స్‌డ్ డైట్, రెగ్యులర్‌గా ఉపవాసం ఉండటం లాంటివి ఉంటాయి. తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో 2008 ఫిబ్రవరిలో 'ది టెలిగ్రాఫ్'‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హేమా మాలిని వెల్లడించింది.

నేను పక్కా వెజిటేరియన్.. సౌత్ ఇండియన్ ఫుడ్ తింటాను.. ఉపవాసం ఉంటాను: 77 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉండటంపై హేమా మాలిని (File Photo: AFP)
నేను పక్కా వెజిటేరియన్.. సౌత్ ఇండియన్ ఫుడ్ తింటాను.. ఉపవాసం ఉంటాను: 77 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉండటంపై హేమా మాలిని (File Photo: AFP)

సోమ, శుక్రవారాల్లో ఉపవాసం

హేమా మాలిని బాలీవుడ్ ను ఏలినా.. ఆమె తమిళనాడుకు చెందిన అయ్యంగార్ కుటుంబం నుంచి వచ్చిన విషయం తెలిసిందే. తాను ప్రతి సోమవారం, శుక్రవారం ఉపవాసం ఉంటానని ఆమె చెప్పింది. ఇక బ్రేక్ ఫాస్ట్, భోజనం గురించి అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పింది.

“ఉదయాన్నే నేను తాగేది ఒక కప్పు టీ. రోజుకి రెండే కప్పుల టీ తాగుతాను. నా టీ కోసం పాలను ముందుగానే కుంకుమపువ్వు వేసి మరిగిస్తారు. టీతో పాటు కరకరలాడే మేరీ బిస్కెట్లు తింటాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీలు తింటాను. వడల లాంటి ఫ్రైడ్ ఐటమ్స్‌కి దూరంగా ఉంటాను. ఆదివారాల్లో సాదా పెరుగుతో పనీర్ పరాఠా తింటాను. నేను సోమవారాలు శివుడి కోసం, శుక్రవారాలు అమ్మవారు దుర్గ లేదా లక్ష్మి కోసం ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉన్నప్పుడు ఉప్పులేని రెండు చిన్న పనీర్ ముక్కలు, అరటిపండ్లు, ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటాను” అని హేమ తెలిపింది.

నాన్ వెజ్ తినను..

తనకు సౌత్ ఇండియన్, గుజరాతీ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా కడీ, రసం అంటే మరీ ఇష్టమని హేమా మాలిని చెప్పింది. అన్నంతో పాటు చపాతీలు, చపాతీలతో పాటు అన్నం అస్సలు తిననని కూడా ఆమె స్పష్టం చేసింది.

“నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు నా లంచ్ ఇంటి నుంచే తీసుకెళ్తాను. మా ఇంట్లో వంట చేసే అతను తన స్టైల్‌లో వంట చేస్తాడు. కానీ మాకు సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం రసం చేస్తాడు. నేను ఉపవాసం ఉన్నప్పుడు ఒక గిన్నెడు ఫ్రూట్ సలాడ్, ఉప్పు లేకుండా ఉడకబెట్టిన కొన్ని కూరగాయలు తింటాను. నేను సాయంత్రం 6.30 వరకే ఉపవాసం ఉంటాను.

నాకు సౌత్ ఇండియన్, గుజరాతీ కడీలు తినడమంటే చాలా ఇష్టం. మా అన్నయ్య భార్య గుజరాతీ. ఆమె ఫస్ట్ క్లాస్‌గా గుజరాతీ వంటలు చేస్తుంది. నేను అన్నం తినేటప్పుడు చపాతీలు తినకుండా, చపాతీలు తినేటప్పుడు అన్నం తినకుండా చాలా పక్కాగా ఉంటాను. నా డైట్ ప్యూర్ వెజిటేరియన్. నేను ఒక సంప్రదాయ అయ్యంగార్ కుటుంబం నుంచి వచ్చాను. అందుకే మేము నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినము” అని హేమ చెప్పింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More