కొండగట్టు అంజన్న దర్శనం ఎంతో భాగ్యం - హీరో అర్జున్

సినీ హీరో అర్జున్‌ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కొండగట్టు అంజన్నను దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Published on: Feb 17, 2026, 07:40:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినీ హీరో అర్జున్ సర్జా తన కుటుంబంతో కలిసి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. సోమవారం కొండగట్టు దేవాలయానికి చేరుకున్న అర్జున్,,, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హీరో అర్జున్
హీరో అర్జున్

ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు అర్జున్ కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తాను నటిస్తున్న కొత్త సినిమా విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. స్వామివారి శేషవస్త్రంతో అర్జున్‌ను సత్కరించి ప్రసాదం అందజేశారు.

అదృష్టంగా భావిస్తున్నాం - హీరో అర్జున్

దర్శనం తర్వాత హీరో అర్జున్‌ మాట్లాడుతూ….. ఏ ప్రాంతంలోనైనా ఆంజనేయ స్వామి దర్శనం తనకు ఎంతో విశేషమన్నారు. “కొండగట్టు టెంపుల్ గురించి ఎంతో విన్నాను. ఎంతో శక్తిమంతుడని తెలుసుకున్నాను. మొదటిసారిగా ఈ కొండగట్టుకు వచ్చాను. ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలని చాలాకాలంగా అనుకుటుంటున్నా. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అందరికి మంచి జరగాలి”అని తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో ఉన్న కోతులకు అర్జున్ స్వయంగా అరటిపండ్లను అందించి భక్తిని చాటుకున్నారు. భక్తులు అర్జున్ కలిసేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఫొటోలు దిగారు.

తన కూతురు ఐశ్వర్య సర్జా నటించిన 'సీతాపయణం' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అర్జున్ జగిత్యాలకు వచ్చారు. పూజల తరువాత జగిత్యాలలోని శ్రీనివాస థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను… అభిమానులను కలిశారు. ఐశ్వర్య సర్జా నటించిన 'సీతా పయణం' ఈనెల 14న విడుదలైన సంగతి తెలిసిందే.

అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ను తెరకు పరిచయం చేశారు. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ కూడా నిర్వహించారు. ఇందులో హీరో అర్జున్ మాట్లాడుతూ… ‘‘సీతా పయనం’ మూవీకి మంచి స్పందన వస్తోందన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More