కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తేవాలన్నారు.

Published on: Jan 7, 2026, 15:08:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీటీడీలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు.

టీటీడీ సమావేశం
టీటీడీ సమావేశం

ఈ సందర్భంగా ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. అమరావతి వేంకటపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎస్వీ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టీటీడీ కల్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5 వేల భజన మందిరాలను, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఉపమాకలోని ఎస్వీ ఆలయం, కరీంనగర్‌లోని శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, అనంతవరం ఎస్వీ ఆలయం, కుప్పంలో నిర్మించనున్న ఆలయాలు, నవీ ముంబైలోని ఎస్వీ ఆలయం, ముంబైలోని భాంద్రా, కర్నాటకలోని బెల్గావిలోని ఎస్వీ ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పీఏసీ తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు బీఆర్ నాయుడు.

అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం సమీపంలో పలు అభివృద్ధి పనులు, 108 అడుగుల జాంబవంతుడు విగ్రహ ఏర్పాటు తదితర పనులతో పాటు టీటీడీలో జరుగుతున్న పనులను సకాలంలో, జరుగనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారు. అలిపిరిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న బేస్ క్యాంప్‌నకు డిజైన్‌లను తయారు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఇంజినీరింగ్ పనులను గడవులోపు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.

వచ్చే వేసవి సమయానికి భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాం, క్యూలైన్లు, రహదారులు, తాగునీరు తదితర సౌకర్యాలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఎం. శాంతారామ్. పనబాక లక్ష్మీ, ఎస్.నరేష్ కుమార్ హాజరయ్యారు. నన్నపనేని సదాశివరావు వర్చువల్ ద్వారా, జేఈవో వి. వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ ఎస్ఏవో ఓ బాలాజీ, సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈ శ్రీ మనోహరం, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More