Sri Gouri Priya: మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్లు అయింది.. ఎమోషనల్ అయిన హీరోయిన్ గౌరి ప్రియ.. వీడియో వైరల్

Sri Gouri Priya: అటు తమిళంలో, ఇటు తెలుగులో క్రేజీ మూవీస్ తో దూసుకెళ్లిపోతుంది హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ. ఈ తెలుగమ్మాయి ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం నుంచి ఓ సాంగ్ రిలీజ్ సందర్భంగా గౌరి ప్రియ చేసిన ఎమోషనల్ కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: May 26, 2026, 10:52:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sri Gouri Priya: తెలుగులో ఒక్కో సినిమా చేస్తూ కెరీర్ ను నిర్మించుకుంటోంది హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ. మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, హ్యాపీ రాజ్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ చేస్తోంది. ఈ మూవీ నుంచి ‘వదలనే’ అనే సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు.

వైరల్ గా శ్రీ గౌరి ప్రియ ఎమోషనల్ కామెంట్లు (instagram-srigouripriya)
వైరల్ గా శ్రీ గౌరి ప్రియ ఎమోషనల్ కామెంట్లు (instagram-srigouripriya)

శ్రీ గౌరి ప్రియ ఎమోషనల్

సోమవారం (మే 25) రాత్రి ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ నుంచి ‘వదలనే’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పక్కన తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ వదలనే సాంగ్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా తల్లిని గుర్తు చేసుకుంటూ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

3 ఇయర్స్

వదలనే సాంగ్ లాంఛ్ ఈవెంట్లో యాంకర్ స్రవంతి చొక్కాారపు అక్కడికి వచ్చిన సెలబ్రిటీలను ప్రశ్నలు అడిగింది. ఈ వదలనే సాంగ్ లిరిక్స్ ను ఎవరికి అంకితం చేస్తారని ఒక్కొక్కరిని అడిగింది. ఈ క్రమంలోనే శ్రీ గౌరి ప్రియను కూడా ఇదే ప్రశ్న అడిగింది.

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నిజంగా చెప్పాలంటే మా అమ్మ నన్ను వదిలేసి మూడేళ్లయింది. కానీ తను నన్ను అస్సలు వదల్లేదు, నేను తనను వదలను. ఈ విషయం తనకు తెలుసు, నాకు తెలుసు. ఈ లైన్స్ మా అమ్మకే డెడికేట్ చేస్తున్నా’’ అని గౌరి ప్రియ చెప్పింది.

శ్రీ గౌరి ప్రియ గురించి

తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ తమిళంలో, తెలుగులో సినిమాలు చేస్తోంది. మెయిల్, మోడర్న్ లవ్ చెన్నై, మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, లవర్, హ్యాపీ రాజ్ తదితర సినిమాల్లో ప్రియ నటించింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మూవీ చేస్తోంది. ఆమె చేతిలో ఇప్పుడు ‘వీసా- వింటారా సరదాగా’, ‘బ్రో కోడ్’ అనే సినిమాలు కూడా ఉన్నాయి.

క్యాన్సర్ తో

శ్రీ గౌరి ప్రియ తల్లి వసుంధర మూడేళ్ల క్రితం చనిపోయారు. ఆమె క్యాన్సర్ తో కన్నుమూశారు. అమ్మ అంటే గౌరి ప్రియకు చాలా ఇష్టం. ఆమెతో ఓ ఫ్రెండ్ లాగా ఉండేది. అందుకే తల్లి కన్నుమూసిన సమయంలో గౌరి ప్రియ చాలా డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత కోలుకుని మళ్లీ మూవీస్ పై ఫోకస్ పెట్టింది.

చెన్నై లవ్ స్టోరీ

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ‘గురుతుందా’ అనే పాటకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. చెన్నై లవ్ స్టోరీ సినిమాకు రవి నంబూరి డైరెక్టర్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More