Highest Paid Indian Actor Remuneration:

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల పారితోషికాల రేంజ్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 90స్ కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు.
మూడు దశబ్దాలుగా
అప్పటి నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌లలో హీరోల ఫీజులు పెరుగుతూనే వచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో బాలీవుడ్ ఖాన్ల హవానే ఎక్కువగా నడిచింది. అయితే, ఇటీవలి కాలంలో దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రాల జోరుతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తూ బాలీవుడ్ ప్రముఖులను సైతం వెనక్కి నెడుతున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరో ఒకరు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటుడిగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.
'పుష్ప 2' తో సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' ద్వారా భారతీయ సినిమా చరిత్రలోనే ఒకే మూవీకి అత్యధిక వసూళ్లు అందుకున్న నటుడిగా రికార్డు నెలకొల్పారు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ముందస్తు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా (ప్రాఫిట్ షేర్) ఒప్పందం చేసుకున్నారు.
ఈ లాభాల వాటాయే ఆయనను సీనియర్ సూపర్ స్టార్ల కంటే చాలా ముందంజలో నిలబెట్టింది. 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్లకు పైగా వసూలు చేసి, దాదాపు రూ. 600 కోట్లకు పైగా నికర లాభాలను ఆర్జించింది. ఈ లాభాల్లో అల్లు అర్జున్ సింహభాగాన్ని దక్కించుకున్నారు.
300 కోట్లకుపైగానే
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ముందస్తు ఫీజు, లాభాల వాటా అన్నీ కలుపుకుని ఈ సినిమాకు అల్లు అర్జున్ అందుకున్న మొత్తం రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ మొత్తం ఎన్నో భారీ భారతీయ చిత్రాల బడ్జెట్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఉదాహరణకు ఒకప్పుడు దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 'బాహుబలి 2' చిత్ర టోటల్ బడ్జెట్ రూ. 250 కోట్ల లోపే కావడం విశేషం.
ఖాన్లు, రజినీకాంత్‌లను సైతం వెనక్కి నెట్టి..
{{/usCountry}}ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ముందస్తు ఫీజు, లాభాల వాటా అన్నీ కలుపుకుని ఈ సినిమాకు అల్లు అర్జున్ అందుకున్న మొత్తం రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ మొత్తం ఎన్నో భారీ భారతీయ చిత్రాల బడ్జెట్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఉదాహరణకు ఒకప్పుడు దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 'బాహుబలి 2' చిత్ర టోటల్ బడ్జెట్ రూ. 250 కోట్ల లోపే కావడం విశేషం.
ఖాన్లు, రజినీకాంత్‌లను సైతం వెనక్కి నెట్టి..
{{/usCountry}}గతంలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్‌ల కాలం తర్వాత మిడ్-90స్ నుంచి బాలీవుడ్‌ను శాసిస్తున్న షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్లు వరుస విజయాలతో తమ రెమ్యూనరేషన్స్ భారీగా పెంచుకుంటూ వచ్చారు.
లీడ్ హీరోలలో మొదటిసారి లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని షారుఖ్ ఖాన్ ప్రారంభించగా, రూ. 100 కోట్ల క్లబ్ మార్కును అమీర్ ఖాన్ దాటేశారు. 2010 చివరి నాటికి ఈ ముగ్గురు ఖాన్లు సినిమాకు రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసే స్థాయికి చేరారు. 2023లో వచ్చిన 'పఠాన్', 'జవాన్' చిత్రాల విజయాలతో షారుఖ్ ఖాన్ తన పారితోషికాన్ని రూ. 200 కోట్లకు పైగా పెంచేశారు.
70 ఏళ్ల వయసులో
అయితే, ఈ బాలీవుడ్ రికార్డులను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బద్దలు కొట్టారు. తన 70 ఏళ్ల వయసులోనూ 'జైలర్' సినిమా సాధించిన రికార్డ్ కలెక్షన్ల కారణంగా ఆయన రూ. 250 కోట్లకు పైగా పారితోషికం అందుకుని ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. కానీ, ఆ రికార్డు ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని నెలల వ్యవధిలోనే అల్లు అర్జున్ రూ. 300 కోట్ల మార్కుతో రజినీకాంత్ రికార్డును కూడా దాటేశారు.
అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏంటి?
గత ఐదేళ్ల కాలంలో అల్లు అర్జున్ కేవలం 'పుష్ప' సిరీస్ చిత్రాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. పుష్ప జోరు తర్వాత ఆయన నటించనున్న తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
దీపికా పదుకొణె హీరోయిన్‌గా
స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రానున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'రాకా'లో అల్లు అర్జున్ నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్-ఇండియా చిత్రం రాకా 2027 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.