ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సూపర్ హిట్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ రెండో సీజన్.. ఎలా ఉందంటే?
హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ తొలి సీజన్ చాలా బాగా ఆకట్టుకుంది. తాజాగా శుక్రవారం (జనవరి 9) రెండో సీజన్ కూడా రిలీజైంది. మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంది? తొలి సీజన్ లాగే ఇదీ ఆకట్టుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూడండి.
ఓటీటీలోకి శుక్రవారం (జనవరి 9) వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2. గతంలో వచ్చిన తొలి సీజన్ కు ఇది సీక్వెల్. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ రెండో సీజన్ ఎలా ఉంది? ఇందులో ఏం చూపించారు అనేది ఇక్కడ చూడండి.

వెబ్ సిరీస్: ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2
ప్లాట్‌ఫామ్: సోనీ లివ్ (Sony LIV)
నటీనటులు: సిద్దాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా తదితరులు.
క్రియేటర్: నిఖిల్ అద్వానీ
బ్రిటీష్ రాజ కుటుంబంపై వచ్చిన 'ది క్రౌన్' (The Crown) సిరీస్‌తో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ను తరచుగా పోలుస్తుంటారు. కానీ భారత దేశ చరిత్రను డీల్ చేయడం చాలా కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ నాయకులను కొందరు దేవుళ్లుగా కొలుస్తారు.. మరికొందరు విలన్లుగా చూస్తారు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని బ్యాలెన్స్ చేస్తూ నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన రెండో సీజన్ ఎలా ఉందో చూద్దాం.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ కథేంటి?
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2 సరిగ్గా 1947లో మొదలవుతుంది. బ్రిటిషర్లు హడావిడిగా ఇండియాను వదిలి వెళ్లాలనుకునే సమయం అది. బౌండరీ కమిషన్ ఏర్పాటు, నెహ్రూ-జిన్నాల మధ్య ఇగో గొడవలు, సర్దార్ పటేల్, వి.పి. మీనన్ కలిసి 562 సంస్థానాలను (ముఖ్యంగా జునాగఢ్, కశ్మీర్) ఇండియాలో ఎలా విలీనం చేశారు అనే అంశాలను చూపించారు.
విభజన సమయంలో నెహ్రూ, గాంధీల మధ్య పెరిగిన దూరం, మత అల్లర్లు, 1947 కశ్మీర్ యుద్ధం, గాంధీ హత్య వంటి అత్యంత కీలకమైన, ఎమోషనల్ సంఘటనల చుట్టూ ఈ సీజన్ తిరుగుతుంది.
సీజన్ 2లో ఆకట్టుకున్నవి ఇవి
'గదర్' సినిమాల్లాగా ఇందులో దేశభక్తి లౌడ్‌గా, అరుపులతో ఉండదు. చాలా సైలెంట్‌గా, ఎమోషనల్‌గా గుండెకు తాకుతుంది. దీన్ని ఒక హిస్టారికల్ డాక్యుమెంటరీలా కాకుండా, మనుషుల మధ్య జరిగే డ్రామాలా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
కశ్మీర్ తన ఇల్లు కాబట్టి అది కావాలని పట్టుబట్టే నెహ్రూ.. జిన్నా ప్రవర్తనతో విసిగిపోయిన పటేల్.. తన శిష్యులు (నెహ్రూ, పటేల్) తన మాట వినట్లేదని బాధపడే గాంధీ.. ఇలా వాళ్ళను కేవలం నాయకులుగా కాకుండా, మనలాంటి మనుషులుగా, వాళ్ళ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించారు. మనం చరిత్ర పుస్తకాల్లో చదివిన గదులు, సంభాషణలు, ఆ బ్లాక్ అండ్ వైట్ బొమ్మలకు ఈ సిరీస్ ప్రాణం పోసింది.
మైనస్ పాయింట్స్ ఇవీ..
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2లో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. మన నాయకులను హీరోలుగా చూపించడం ఓకే.. కానీ అవతలి వాళ్లను మరీ కామెడీగా చూపించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. జిన్నాను కేవలం కుట్రలు చేసే ఒక మోసకారిగా చూపించారు. కశ్మీర్ రాజు హరి సింగ్‌ను ఒక జోకర్‌లా మార్చేశారు. మన వాళ్లను డీటైల్డ్ గా చూపించి, మిగతా వాళ్లను విలన్లుగా ఫిక్స్ చేయడం వల్ల కథలో ఉండాల్సిన డెప్త్ కొంచెం తగ్గింది.
మొత్తంగా కొన్ని పక్షపాతాలు ఉన్నప్పటికీ.. 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2' ఒక అద్భుతమైన ప్రయత్నం. విభజన నాటి పరిస్థితులను, కశ్మీర్ సమస్యను, గాంధీ హత్య వెనుక ఉన్న ఎమోషన్‌ను చాలా సెన్సిటివ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించారు. హిస్టరీని ఇష్టపడేవారు కచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


