...
...
Next Story

Diamonds Bra: బ్రా ఖరీదు రూ.474 కోట్లు.. 4410 డైమండ్లు.. హాలీవుడ్ మోడల్ సంచలనం.. విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్‌ షో

Diamonds Bra: ప్రసిద్ధ హాలీవుడ్ మోడల్, బ్యూటీ వ్యాపారవేత్త కైలీ జెన్నర్ విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో ర్యాంప్‌పై సంచలనం సృష్టించింది. ఏకంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు ₹415 కోట్లు) విలువ చేసే, 4,410 సహజ వజ్రాలతో రూపొందించిన 'ఫాంటసీ బ్రా' ధరించి కనిపించింది.

Published on: Oct 19, 2026, 18:01:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Diamonds Bra: అంతర్జాతీయ ఫ్యాషన్ రంగాన్ని ప్రముఖ గ్లోబల్ బ్యూటీ ఐకాన్, బిజినెస్ ఉమెన్ కైలీ జెన్నర్ (Kylie Jenner) మరోసారి తన గ్లామర్‌తో ఊపేసింది. ప్రఖ్యాత గ్లోబల్ ల్యాంగరీ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్ (Victoria's Secret) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ర్యాంప్‌పై తొలిసారి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో ఆమె ధరించిన డైమండ్ స్టడెడ్ 'ఫాంటసీ బ్రా' (Fantasy Bra) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Diamonds Bra: బ్రా ఖరీదు రూ.474 కోట్లు.. 4410 డైమండ్లు.. హాలీవుడ్ మోడల్ సంచలనం.. విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్‌ షో
Diamonds Bra: బ్రా ఖరీదు రూ.474 కోట్లు.. 4410 డైమండ్లు.. హాలీవుడ్ మోడల్ సంచలనం.. విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్‌ షో

ఏకంగా 50 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు ₹474 కోట్లు) విలువ చేసే అత్యంత ఖరీదైన 'ఫాంటసీ బ్రా'తో కైలీ ర్యాంప్‌పై మెరుపులు మెరిపించింది. ఇప్పటివరకు విక్టోరియా సీక్రెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బ్రా కంటే ఇది 35 మిలియన్ డాలర్లు ఎక్కువ కావడం విశేషం.

4,410 వజ్రాలు.. 1,000 గంటల శ్రమ

ప్రఖ్యాత హై-ఎండ్ జ్యువెలరీ డిజైనర్ జాకబ్ అండ్ కో (Jacob & Co) భాగస్వామ్యంతో ఈ అద్భుతమైన ఫాంటసీ బ్రాని డిజైన్ చేశారు. దీని మేకింగ్ వెనుక ఉన్న వివరాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ బ్రా తయారీలో ఏకంగా 4,410 సహజమైన వజ్రాలను అత్యంత విలాసవంతంగా అమర్చారు. బ్రా మధ్య భాగంలో మెరిసిపోయే 75.54 క్యారెట్ల అరుదైన 'వివిడ్ యెల్లో డైమండ్' (Vivid Yellow Diamond) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ అత్యంత ఖరీదైన బ్రాను తయారు చేయడానికి 15 మంది అత్యుత్తమ హస్తకళాకారులు దాదాపు 1,000 గంటలకు పైగా నిరంతరం శ్రమించారు. ప్లాటినం, బంగారం, వేలాది వజ్రాలతో నిండి ఉన్నప్పటికీ, ఈ కాస్ట్యూమ్ బరువు కేవలం 1.8 కేజీలు (4 పౌండ్లు) మాత్రమే ఉండటం గమనార్హం.

ర్యాంప్‌పై దేవకన్యలా..

విక్టోరియా సీక్రెట్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ఆడమ్ సెల్మాన్ (Adam Selman) ఓగ్ (Vogue) మ్యాగజైన్‌తో మాట్లాడుతూ కైలీ ఎంపిక వెనుక ఉన్న ముఖ్య వ్యూహాన్ని వెల్లడించారు. "అభిమానులు ఎప్పటినుంచో ఐకానిక్ 'ఫాంటసీ బ్రా' పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని పబ్లిక్‌లోకి బలంగా తీసుకెళ్లడానికి గ్లోబల్ పాప్ కల్చర్‌లో విపరీతమైన ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న ప్రభావవంతమైన వ్యక్తి కావాలనుకున్నాం. కైలీ కేవలం ఫ్యాషన్ లేదా టీవీకి మాత్రమే పరిమితం కాలేదు, ఆమె సొంతంగా ఒక కల్చర్‌ను క్రియేట్ చేసింది" అని ఆయన కొనియాడారు.

ప్రపంచ స్థాయి సూపర్‌మోడల్స్ సందడి

ఈ గ్రాండ్ ఈవెంట్‌లో కైలీ జెన్నర్‌తో పాటు విక్టోరియా సీక్రెట్ దిగ్గజ మోడల్స్ అడ్రియానా లిమా, అలెస్సాండ్రా అంబ్రోసియో, కాండిస్ స్వాన్‌పోల్, బెహాటి ప్రిన్స్‌లూ, బార్బరా పాల్వినోలతో పాటు నేటితరం సూపర్‌మోడల్స్ గిగి హదీద్, బెల్లా హదీద్, ఇరినా షేక్, అనోక్ యాయ్, పలోమా ఎల్సెస్సర్లు సందడి చేశారు. ఏది ఏమైనా, కైలీ ధరించిన ఈ రూ.474 కోట్ల డైమండ్ బ్రా ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ ముచ్చటగా మారింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks