OTT Horror Thriller: అమరత్వం కోసం గర్భవతి నరబలి.. ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్ హారర్ థ్రిల్లర్
OTT Horror Thriller: ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం పోలీస్ కంప్లైంట్ అనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Horror Thriller: వరలక్ష్మి శరత్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర కాంబినేషన్‌లో తెరకెక్కిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ 'పోలీస్ కంప్లైంట్' (Police Complaint) డిజిటల్ లవర్స్‌ని ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

క్షుద్రపూజలు, పొలిటికల్ కరప్షన్, డార్క్ మాజిక్ నేపథ్యంతో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా మొదటి ఫ్రేమ్ నుంచే వీక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతోంది.
అమరత్వం కోసం నరబలి.. కోల్డ్ కేస్ వెనుక దిగ్భ్రాంతికర నిజాలు
ఈ సినిమా కథాంశం అత్యంత భయంకరమైన, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగుతుంది. మహంకాళి అనే ఒక ప్రమాదకరమైన మాంత్రికుడు అమరత్వం (Immortality) సాధించడం కోసం ఒక గర్భవతిని అత్యంత దారుణంగా హత్య చేస్తాడు.
ఈ ఘోరమైన నరబలిని కప్పిపుచ్చేందుకు ఒక అవినీతి డాక్టర్, లంచగొండి పోలీస్ ఆఫీసర్‌తో కలిసి దానిని పరువు హత్యగా చిత్రీకరిస్తారు. ఏళ్ల తరబడి మూసివేసిన ఈ డార్క్ కోల్డ్ కేస్‌ను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ తిరిగి రీ-ఓపెన్ చేయడంతో అసలు విచారణ మొదలవుతుంది.
సూపర్ కాప్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ విలక్షణ నటన
సస్పెన్స్ డ్రామాలు, పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేయడంలో వరలక్ష్మి శరత్‌కుమార్ స్టైలే వేరు. 'క్రాక్', 'వీరసింహారెడ్డి', 'హనుమాన్' సినిమాల్లో తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో అలరించిన వరలక్ష్మి.. ఈ సినిమాలో నేరస్థుల గుండెల్లో నిద్రపోయే ఇంటెన్స్ సూపర్‌కాప్‌గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
వ్యవస్థలో ఉన్న లంచగొండితనం, పొలిటికల్ ప్రెజర్, డార్క్ పవర్ ను తట్టుకుంటూ ఆమె చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ థ్రిల్ కలిగిస్తాయి. మరోవైపు నాచురల్ స్టార్‌గా పేరొందిన నవీన్ చంద్ర తన ఇంటెన్స్ యాక్టింగ్‌తో కథకు పెద్ద అసెట్‌గా నిలిచారు.
హాలీవుడ్ రేంజ్ బీజీఎమ్.. నెక్స్ట్ లెవెల్ హారర్ ఎలిమెంట్స్
డైరెక్టర్ ఎంచుకున్న డార్క్ థీమ్, క్షుద్ర పూజల సీక్వెన్స్‌కి తగ్గట్టుగా సాగే సినిమాటోగ్రఫీ, మైండ్ బ్లాకింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ థ్రిల్లర్‌కు ప్రాణం పోశాయి. ప్రతి సన్నివేశంలోనూ విజువల్స్ చాలా నేచురల్‌గా, భయం కలిగించేలా డిజైన్ చేశారు.
ఈ వీకెండ్ లో డిజిటల్ స్క్రీన్లపై మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే థ్రిల్లర్ లవర్స్‌కి 'పోలీస్ కంప్లైంట్' బెస్ట్ ఛాయిస్‌గా మారనుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ లిస్ట్‌లో ఈ సినిమా టాప్‌లో దూసుకుపోతోంది.
జూన్ 12న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి రావడంతో ఈ వీకెంట్ ఇంట్లో కూర్చొనే ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


