Bigg Boss 10: ఇది మామూలు బజ్ కాదయ్యో.. బిగ్ బాస్ 10లోకి ఆ హాట్ యాంకర్.. మాటల్లో, ఆటల్లో తోపే.. ఇంతకీ ఆ భామ ఎవరంటే?

Bigg Boss 10: పాపులర్ యాంకర్, నటి వర్షిణి సౌందరరాజన్ బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 10’లో అడుగుపెట్టనున్నట్లు క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ బ్యూటీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందని అంటున్నారు. సీజన్ 10లో సెలబ్రిటీ కోటాలో పాల్గొనేందుకు వర్షిణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

Published on: Aug 11, 2026, 14:18:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: బిగ్ బాస్ రియాలిటీ షో ఫ్యాన్స్ కు కిక్కించే న్యూస్ ఇది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి హాట్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ రాబోతుందని టాక్. తెలుగు బుల్లితెరపై తన గ్లామర్, ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇది మామూలు బజ్ కాదయ్యో.. బిగ్ బాస్ 10లోకి ఆ హాట్ యాంకర్.. మాటల్లో, ఆటల్లో తోపే.. ఇంతకీ ఆ భామ ఎవరంటే? (instagram)
ఇది మామూలు బజ్ కాదయ్యో.. బిగ్ బాస్ 10లోకి ఆ హాట్ యాంకర్.. మాటల్లో, ఆటల్లో తోపే.. ఇంతకీ ఆ భామ ఎవరంటే? (instagram)

బిగ్ బాస్ 10లో వర్షిణి

బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ప్రతి సీజన్ ముందూ ఈ రియాలిటీ షో కంటెస్టెంట్ కోసం వర్షిణి పేరు గట్టిగా వినిపిస్తూనే ఉంది. ప్రతీసారి షో నిర్వాహకులు ఆమెను సంప్రదించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఈ ఆఫర్ కార్యరూపం దాల్చలేదు.

అయితే, రాబోయే 'బిగ్ బాస్ సీజన్ 10' కోసం మేకర్స్ మళ్లీ ఆమెను సంప్రదించగా, ఈసారి సెలబ్రిటీ కోటాలో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు వర్షిణి గ్రీన్ సిగ్న్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

చందమామ కథలు నుంచి

హైదరాబాద్‌లో జన్మించిన వర్షిణి, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె.. జాతీయ అవార్డు పొందిన 'చందమామ కథలు' (2014) చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమాలు & వెబ్ సిరీస్

'లవర్స్', 'నన్ను దోచుకుందువటే', 'జోడీ', సుమంత్ 'మళ్లీ మొదలైంది', గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'శాకుంతలం' వంటి చిత్రాల్లో వర్షిణి సౌందరరాజన్ నటించింది. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'పెళ్లి గోల' వెబ్ సిరీస్‌లో (3 సీజన్లు) అభిజీత్ సరసన తన యాక్టింగ్ తో వర్షిణి అదరగొట్టింది.

బుల్లితెర హవా

టీవీ స్క్రీన్ పైనా వర్షిని సౌందరరాజన్ కు మంచి క్రేజ్ ఉంది. ‘ఢీ’ డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా, 'పటాస్ 2', 'కామెడీ స్టార్స్', 'జబర్దస్త్' వంటి పాపులర్ షోలకు యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించింది. 2017లో 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్' జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది.

ఈ సారి పక్కా

అయితే ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ కు ముందు వర్షిణి సౌందరరాజన్ పేరు వినిపించడం కామన్ అయిపోయింది. దీంతో ఈ సారి కూడా వర్షిణి పేరు వినిపిస్తుందనే టాక్ ఉంది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 10లో మాత్రం వర్షిణి కచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వర్షిణి ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

టీవీ షోలు కానీ, సినిమా లేదా సిరీస్ లు కానీ లేవని అంటున్నారు. అందుకే బిగ్ బాస్ సీజన్ 10 కోసం మేకర్స్ అప్రోచ్ కాగానే వర్షిణి ఓకే చెప్పిందని సమాచారం. ఈ ప్రచారం నిజమై వర్షిణి బిగ్ బాస్ లోకి వస్తే అందంతో పాటు ఆటతోనూ అలరించే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More