Hyd e Champions: క్రీడా రంగంలో సాధించిన చరిత్రాత్మక విజయాల సంబరాలు ఇప్పుడు కేవలం స్టేడియాలకో, డ్రెస్సింగ్ రూమ్‌లకో మాత్రమే పరిమితం కావడం లేదు. సరికొత్త క్రీడా సంస్కృతికి అద్దం పడుతూ, ప్రతిష్టాత్మకమైన తొలి టీజీ20 లీగ్ విజేతలు 'హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్' తమ టైటిల్ గెలుపు సంబరాలను ప్రపంచ ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో వైభవంగా జరుపుకొన్నారు. క్రికెట్ ఘనత, సినీ ప్రపంచం, అద్భుతమైన వినోదం ఒకే వేదికపై చేరి ఈ సంబరాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ ఛాంపియన్స్ కు టైటిల్

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను సరికొత్త మలుపు తిప్పుతూ ప్రారంభమైన ప్రీమియర్ టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో తొలి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ విక్టరీ సెలబ్రేషన్స్ భారతదేశంలో మారుతున్న క్రీడా వేడుకల ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. నేడు క్రీడా విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఐకానిక్ పర్యాటక ప్రాంతాలు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి.
గ్రాండ్ వెల్ కమ్
ఫిల్మ్ సిటీకి చేరుకున్న హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఆటగాళ్లకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ పద్ధతిలో గ్రాండ్ వెల్ కమ్ లభించింది. అనంతరం ఆటగాళ్లు రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణలను వీక్షించారు. ఈ వేడుకలో భాగంగా ఛాంపియన్ టీమ్ సభ్యులు అభిమానులతో ముచ్చటించారు. ఫిల్మ్ సిటీలోని ఐకానిక్ లొకేషన్ల బ్యాక్‌డ్రాప్‌లో ఛాంపియన్ ట్రోఫీతో ఫోటోలు దిగారు.
ఘన సన్మానం
అనంతరం జట్టు సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మేనేజ్‌మెంట్ ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ ఫిల్మ్ సిటీకి వచ్చిన సాధారణ సందర్శకులకు సైతం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. తమకు ఇష్టమైన ఆటగాళ్లను దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు ఛాన్స్ దొరికింది. ప్లేయర్లు కూడా ఈ సమయాన్ని బాగా ఎంజాయ్ చేశారు. బాడీ అండ్ మైండ్ రిఫ్రెష్ చేసుకున్నారు.
కుటుంబంలో ఒకరిగా
"హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టును విజయపథంలో నడిపించి, తొలి టీజీ20 టైటిల్ను అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. టోర్నమెంట్ అంతటా జట్టు యాజమాన్యం మాకు అందించిన అచంచలమైన మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడనై ఉంటా.
{{/usCountry}}"హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టును విజయపథంలో నడిపించి, తొలి టీజీ20 టైటిల్ను అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. టోర్నమెంట్ అంతటా జట్టు యాజమాన్యం మాకు అందించిన అచంచలమైన మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడనై ఉంటా.
{{/usCountry}}మా విజయ సంబరాలకు ఆతిథ్యం ఇచ్చి, మమ్మల్ని రామోజీ కుటుంబంలో ఒకరిగా భాగం చేసిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశాడు.