Allu Arjun Forbes: చీర కట్టుకొని నటించడమే ఆల్ఫా.. పుష్పతో ఇండియన్ సినిమా నెక్ట్స్ లెవెల్: అల్లు అర్జున్ సంచలన కామెంట్స్
Allu Arjun Forbes: ప్రతిష్టాత్మక 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) మ్యాగజైన్ కవర్ స్టోరీ ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సూపర్ స్టార్‌డమ్, బాక్సాఫీస్ ఒత్తిడి, సినిమాల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప' సినిమాలో చీర కట్టడం గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Forbes: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో సాధిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప: ది రైజ్', పుష్ప 2 సినిమాలు ఇచ్చిన అద్భుత విజయం తర్వాత ఆయన పాన్-ఇండియా దాటి గ్లోబల్ ఐకాన్‌గా అవతరించారు.

తాజాగా ప్రతిష్టాత్మక 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) మ్యాగజైన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన సినీ ప్రయాణం, బాక్సాఫీస్ ఒత్తిడి, నేటి ప్రేక్షకుల అభిరుచిపై పలు సెన్సేషనల్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన ముఖ్యమైన విషయాలను తన ఇన్‌స్టాలో బన్నీ షేర్ చేశారు. సగటు కంటెంట్‌ను ఇప్పుడు జనాలు ఏమాత్రం ఆదరించరని, గొప్ప సినిమా ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు అవే వస్తాయని బలంగా చెప్పారు.
“నేను చేసిన అత్యంత 'ఆల్ఫా' పని అదే!”
'పుష్ప 2' (Pushpa 2: The Rule) ప్రమోషనల్ కంటెంట్‌లో అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో చీర కట్టుకుని, నీలం రంగు కాళికా దేవి అవతారంలో కనిపించిన రచ్చను ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పటికీ మరచిపోలేరు. దీనిపై ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా స్పందించిన బన్నీ.. "నా జీవితంలో నేను చేసిన అత్యంత 'ఆల్ఫా' (Alpha) పని ఏంటంటే.. సినిమాలో ఒక స్త్రీ రూపం ధరించి నటించడమే" అని పేర్కొన్నారు.
ఒక మాస్ రగ్గడ్ హీరోగా ఉంటూ అంతటి సవాలుతో కూడిన స్త్రీ అవతారాన్ని అత్యంత ధైర్యంతో చేసి మెప్పించడంపై ఆయన వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
“ఒత్తిడి అనేది ఒక ఆశీర్వాదం”
భారీ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు, కోట్ల మంది అంచనాలు మోస్తున్నప్పుడు వచ్చే ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. "ఒత్తిడి (Pressure) అనేది అరుదుగా దొరికే ఒక గొప్ప ప్రివిలెజ్. దేశంలో చాలా కొద్దిమందికి మాత్రమే అలాంటి బాధ్యత, ఒత్తిడి మోసే అవకాశం లభిస్తుంది. కాబట్టి నా దృష్టిలో ప్రెజర్ అనేది ఒక అదృష్టం. దానిని నేను ఎంతో సానుకూలంగా ఆహ్వానిస్తాను" అని అల్లు అర్జున్ చెప్పారు.
“సగటు కంటెంట్ ఇకపై చెల్లదు”
ప్రస్తుత సినిమా వ్యాపారం, బాక్సాఫీస్ సునామీపై స్పందిస్తూ.. "ఇప్పుడున్న కాలంలో యావరేజ్ కంటెంట్ ఎంతమాత్రం నిలబడదు. ప్రేక్షకులు చాలా స్పష్టంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించడమే. ఒక గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తే, మిగిలిన బాక్సాఫీస్ లెక్కలన్నీ అవే చూసుకుంటాయి" అని నొక్కి చెప్పారు.
అంతేకాకుండా 'పుష్ప' సాధించిన విజయం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా తనను నిరంతరం ప్రేరేపిస్తోందని వెల్లడించారు. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోర్బ్స్ ఇంటర్వ్యూ కోట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


