Dasaratha Madhav: అవమానాలను దిగమింగి.. ఐఐటీ నుంచి టాలీవుడ్ దాకా: ఆ నటుడి సలహాతో- కిల్లర్‌గా దశరథ మాధవ్- అసలు ఎవరితను?
Dasaratha Madhav Killer: ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్, లక్షల్లో జీతం వదిలేసి సినీ రంగుల ప్రపంచంలోకి కలల సాధన కోసం అడుగుపెట్టిన మరో యువకుడు దశరథ మాధవ్. ప్రముఖ సీనియర్ నటుడు ఇచ్చిన సలహాతో ఐఐటీ ర్యాంక్ సాధించి ఇప్పుడు కిల్లర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్న దశరథ మాధవ్ గురించి!
IIT Ranker Dasaratha Madhav Acting Debut With Killer: ఒక ఐఐటీ ర్యాంకర్.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్.. ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. ఒకరకంగా చెప్పాలంటే అద్భుతమైన జీవితం.. అవన్నీ తన కలల ఆశయం కోసం వదిలేశారు. ఫలితాన్నిస్తుందా.. ఇవ్వదా? అనే ఆలోచన లేకుండా ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో కష్టపడే రైతులా కష్టపడ్డారు.

కిల్లర్ సినిమాతో నటుడిగా
చివరకు ఆ కష్టం ఫలించే రోజు వచ్చింది. అవమానాలను దిగమింగి.. అందించిన చేతిని ఊతంగా చేసుకుని వెండితెరపైకి అడుగులు వేసిన ఆ వ్యక్తే దశథ మాధవ్. ‘కిల్లర్’ సినిమాతో నటుడిగా తన సినీ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దశరథ... 7వ తరగతిలో రిపబ్లిక్ డే వేడుకకు తమ స్కూలుకు వచ్చిన ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంను కలిసి తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి చెప్పారు. చదువుకుని సినీరంగంలోకి అడుగు పెట్టమని.. అప్పుడే సినీరంగంలో భవిష్యత్ ఉంటుందని ధర్మవరపు సలహా ఇచ్చారు.
నాటుకుపోయిన ధర్మవరపు సలహా
అది మనసులో బాగా నాటుకుపోయింది. అంతే.. పదోతరగతిలో డిస్ట్రింక్షన్‌లో పాసయ్యారు. ఇంటర్ కూడా టాప్ మార్కులతో పాసై.. ఐఐటీ ర్యాంక్ సాధించారు దశరథ. ఆ తరువాత ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సంపాదించారు. ఆ తరువాత మాస్టర్స్ చేసి ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో జాబ్ సంపాదించారు. జాబ్ చేస్తూ డైలీ క్యాబ్‌లో వెళుతున్న తరుణంలో రేడియో మిర్చి వింటూ ఉండేవారు.
అలా రేడియో మిర్చి - ఈటీవీ సౌజన్యంలో నిర్వహించిన వాయిస్ పాషన్ షో గురించి తెలుసుకున్నారు. దీనికి 50 వేల మందిని సెలక్ట్ చేస్తే 15 మంది ఫైనల్‌కు వెళ్లారు. దానిలో ఫస్ట్ వచ్చి టైటిల్ విన్నర్‌గా నిలిచారు దశరథ. యాంకర్ సుమ నిర్వహించిన ఈ జంక్షన్‌కి రావడం.. కామెడీ స్కిట్స్ రైటర్‌గానే కాకుండా.. స్కిట్స్‌లో చేశారు. అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
చిన్న అవకాశమే.. పెద్ద ప్రయాణానికి నాంది!
సినీరంగంలో విజయం సాధించాలంటే తొలి అడుగు ఎంతో కీలకం. ఆ అడుగు ఎంత చిన్నదన్నది కాదు.. దాన్ని ఎంత నమ్మకంతో ముందుకు వేస్తామన్నదే ముఖ్యం. నేడు అగ్రస్థానంలో ఉన్న ఎందరో నటులు చిన్న చిన్న పాత్రలతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారు. అదే స్ఫూర్తితో దశరథ మాధవ్ కూడా తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
‘కిల్లర్’ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తూ, తనలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఎ మాస్టర్ పీస్, ప్రేరణ, బువ్వమ్మ కథలు, భామ సత్యభామ’ వంటి చిత్రాలతో తన సినీ ప్రయాణం ప్రారంభించినా కూడా ‘కిల్లర్’ ముందుగా విడుదల అవుతోంది.
గుప్పెడంత మనసు నటి హీరోయిన్‌గా
దర్శకుడు పూర్వజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అంశాల కలయికతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నటుడిగా కనిపించడమే కాకుండా, లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా దశరథ బాధ్యతలు నిర్వర్తించడం విశేషం.
అంటే ఇది ఆయనకు కేవలం నటనలో తొలి అడుగు మాత్రమే కాదు.. సినిమా నిర్మాణ ప్రక్రియలోనూ తన అనుభవాన్ని చాటుకునే వేదికగా మారింది. తన సినీ కలను సాకారం చేసుకునేందుకు ‘కిల్లర్’ను ఓ కీలకమైన అవకాశంగా మలుచుకుంటున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


