హాలీవుడ్ రేంజ్‌లో గుప్పెడంత మనసు జగతి కిల్లర్ టీజర్- విభిన్న పాత్రల్లో జ్యోతి పూర్వజ్- యాక్షన్, రొమాంటిక్ సీన్స్ అదుర్స్
గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా తెలుగు బుల్లితెర ఆడియెన్స్‌కు ఎంతో దగ్గరైన బ్యూటిపుల్ జ్యోతి పూర్వజ్ ఫీమేల్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ మూవీ కిల్లర్. పూర్వాజ్ దర్శకత్వం వహించిన కిల్లర్ టీజర్ తాజాగా విడుదలైంది. యాక్షన్‌తో అదరగొట్టిన జ్యోతి పూర్వజ్ రొమాంటిక్ సీన్లలో గ్లామర్ ట్రీట్‌తో కట్టిపడేసింది.
తెలుగు బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన పాపులర్ నటి జ్యోతి పూర్వజ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహించడంతోపాటు మరో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ ఇద్దరితోపాటుగా
కిల్లర్ సినిమాలో ఈ ఇద్దరితోపాటు మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిల్లర్ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు.
కిల్లర్ టీజర్ రిలీజ్
ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరించారు. అయితే, త్వరలో ఈ కిల్లర్ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం (ఫిబ్రవరి 22) కిల్లర్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గుప్పెడంత మనసు సీరియల్‌తో అలరించిన జ్యోతి పూర్వజ్ కిల్లర్ మూవీలో విభిన్న పాత్రలు పోషించి అట్రాక్ట్ చేసింది.
విభిన్న అంశాలతో హాలీవుడ్ రేంజ్‌లో
అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేయడంతోపాటు బోల్డ్, రొమాంటిక్ సీన్స్‌తో గ్లామర్ ట్రీట్ అందించింది బ్యూటిఫుల్ జ్యోతి పూర్వాజ్. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, స్పై, రొమాంటిక్ వంటి అంశాలతో కిల్లర్ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్ ఆద్యంతం హాలీవుడ్ తరహాలో ఉంది.
కిల్లర్ టీజర్ లాంచ్ ఈవెంట్
కిల్లర్, వాంపైర్, రోబో, హ్యూమన్ వంటి డిఫరెంట్ షేడ్స్‌లో జ్యోతి పూర్వజ్ కనిపించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే, కిల్లర్ టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిల్లర్ మూవీ యూనిట్ తమ భావాలను వ్యక్త పరిచారు.
అందరికీ నచ్చేలా ఉంటుంది
ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ సీతారామరావు మాట్లాడుతూ.. "కిల్లర్ చిత్రం కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. టీజర్ లాగే సినిమాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం" అని అన్నారు.
బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్‌తో
లైన్ ప్రొడ్యూసర్ దశరథ మాధవ్ మాట్లాడుతూ.. "మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకునేలా మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో నేను బ్రదర్ రోల్‌లో నటించాను. చిన్న సినిమా అయినా కిల్లర్ పెద్ద విజయం సాధిస్తుంది" అని ఆశించారు.
పవర్‌ఫుల్ విలన్‌గా
యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో నేను విలన్ క్యారెక్టర్‌లో నటించాను. నన్ను ఒక పవర్‌ఫుల్ విలన్‌గా చూపించిన డైరెక్టర్ సుకు పూర్వాజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మేమంతా టీమ్ వర్క్ చేశాం. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


