డాక్టర్ కావాలనే డ్రీమ్ పక్కన పెట్టి ఆ కంపెనీలో వర్క్ చేయాల్సి వచ్చింది.. గుప్పెడంత మనసు నటి జ్యోతి పూర్వజ్ కామెంట్స్
గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన నటి జ్యోతి పూర్వజ్. జ్యోతి రాయ్‌గా కూడా పేరున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై హీరోయిన్‌గా నటించిన సినిమా కిల్లర్. పూర్వజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ఫైర్ అండ్ ఐస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో జ్యోతి పూర్వజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వాజ్. బుల్లితెర నుంచి వెండి తెరపైకి హీరోయిన్‌గా మారిన జ్యోతి పూర్వజ్‌కు జ్యోతి రాయ్ అనే పేరు కూడా ఉంది. జ్యోతి పూర్వజ్ నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా కిల్లర్.

ఇతర నటీనటులు
జ్యోతి పూర్వాజ్‌తోపాటు పూర్వజ్, మనీష్ గిలాడ ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు.
ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్
ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహించారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న కిల్లర్ సినిమా నుంచి ఇటీవల ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కిల్లర్ ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో జ్యోతి పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సీరియల్స్‌తో పాపులర్ అయ్యాను
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. "నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ, ఆ డ్రీమ్ పక్కనపెట్టి ఐటీ కంపెనీలో వర్క్ చేయాల్సివచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ చేసి పాపులర్ అయ్యాను. ఇప్పుడు హీరోయిన్‌గా మీ ముందుకు వస్తున్నాను. ఇవన్నీ నేను లైఫ్లో ప్లాన్ చేయలేదు. అలా జరుగుతూ వస్తున్నాయి" అని అన్నారు.
మంచి స్టంట్స్‌తో యాక్షన్ మూవీ
"యాక్టర్ అయ్యాక మంచి స్టంట్స్‌తో యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉండేది. ఆ విషయం పూర్వాజ్‌కు చెప్పాను. ఒకవైపు మాస్టర్ పీస్ సినిమా జరుగుతుండగానే ఈ కిల్లర్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ చదివాక మనం ఇంత భారీ స్కేల్‌లో సినిమా ఎలా చేయగలం అని అన్నాను. కానీ, తనకున్న పరిచయాలతో, స్నేహితులతో చూస్తుండగానే సినిమాను రూపొందించాడు" అని జ్యోతి రాయ్ తెలిపారు.
పూర్వజ్ చెప్పినట్లు చేశా
"ఈ మూవీలో బాగా పర్‌ఫార్మ్ చేశానని మా యూనిట్ వాళ్లు చెబుతున్నారు. పూర్వాజ్ చెప్పినట్లూ చేస్తూ వెళ్లా. ఒక కొత్త తరహా కంటెంట్‌తో మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా" అని గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వజ్ చెప్పుకొచ్చారు.
బిగ్ స్క్రీన్ మీద ఆకట్టుకోబోతున్నారు
ఇదే ఈవెంట్‌లో యాక్టర్ సీతారామ్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ పూర్వజ్ చాలా కష్టపడతారు. జ్యోతి గారిని టీవీల్లో చూశాం. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మనల్ని ఆకట్టుకోబోతున్నారు. ఆమె ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. కిల్లర్ సినిమా చూసిన ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అవుతారు" అని పేర్కొన్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలా
యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ.. "ఈ చిత్రంలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా అడుగుపెట్టా. నాలోని విలనిజాన్ని కొత్తగా తెరపై చూపించబోతున్నారు దర్శకులు పూర్వజ్. విజువల్స్ సూపర్బ్‌గా వచ్చాయి. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


