Illu Illalu Pillalu: కలిసిపోయిన వేదవతి, భద్రావతి.. బుట్టో సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులు.. ఫస్ట్ టైమ్ అంటున్న అక్క!

Illu Illalu Pillalu: షాకింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ లో బద్ధ శత్రులా చెల్లి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకునే అక్క భద్రావతి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. చెల్లి వేదవతితో కలిసి తీన్మార్ స్టెప్పులు వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఏమైందో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 8, 2026, 20:51:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరే రేటింగ్ తో దూసుకెళ్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో భద్రావతి, వేదవతి కలిసిపోయారా? అదేంటీ.. ప్రేమ కాపురాన్ని కూల్చిన భద్రావతి మళ్లీ మారిపోయిందా? అక్కను చెల్లి క్షమించిందా? ఆగండి, ఆగండి.. కాస్త బ్రేక్ తీసుకోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో భద్రావతి, వేదవతి పాత్రలు చేస్తున్న ఆర్టిస్టులు కలిశారు. కానీ ఇది సీరియల్ లో కాదు.

కలిసిపోయిన వేదవతి, భద్రావతి.. బుట్టో సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులు.. ఫస్ట్ టైమ్ అంటున్న అక్క!
కలిసిపోయిన వేదవతి, భద్రావతి.. బుట్టో సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులు.. ఫస్ట్ టైమ్ అంటున్న అక్క!

ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆర్టిస్టులు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలకమైన వేదవతి పాత్రను సీనియర్ నటి ఆమని, భద్రావతి క్యారెక్టర్ ను దుర్గా దేవి ప్లే చేస్తున్నారు. ఇంటి పనోడు అయిన రామరాజుతో చెల్లి వేదవతి వెళ్లిపోయిందని భద్రావతి పగతో రగిలిపోతుంది. అంతే కాకుండా వేదవతి కొడుకును మేనకోడలు ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో రామరాజు కుటుంబంపై ప్రతీకారం కోసం భద్రావతి ఎదురు చూస్తోంది.

భద్రావతి, వేదవతి డ్యాన్స్

మరోవైపు వేదవతి ఏమో అక్క భద్రావతి ప్రేమ కోసం తపిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రావతి, వేదవతి కలిశారు. కలిసి డ్యాన్స్ చేశారు. కానీ ఇది సీరియల్ లో కాదు. రియల్ లైఫ్ లో ఇది జరిగింది. ఆమని, దుర్గా దేవి కలిసి ఓ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు. హైదరబాదీ ఒరిజినల్ బుట్టో సాంగ్ కు కాళ్లు కదిపారు.

వీడియో వైరల్

ఆమనితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను దుర్గా దేవి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘‘ఆమని గారితో ఫస్ట్ టైమ్ డ్యాన్స్. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశా. మాలాగే మీరు కూడా ఈ రీల్ ను ప్రేమిస్తారని అనుకుంటున్నా’’ అని దుర్గా దేవి ఆమనితో కలిసి డ్యాన్స్ చేస్తున్న రీల్ ను పోస్టు చేసింది.

సీరియల్ లో ఇలా

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కథ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. తన కాపురాన్ని కూల్చేరనే పగతో నర్మద, ప్రేమ జీవితాలను తలకిందులు చేయాలని పెద్ద కోడలు శ్రీవల్లి టార్గెట్ పెట్టుకుంది. అందుకే ప్రేమ, ధీరజ్ పెళ్లి విషయంలో అసలు నిజం భద్రావతికి చెప్పి రెచ్చగొట్టింది.

దీంతో తమ్ముడు సేనాపతితో ప్రేమ, ధీరజ్ ల కాపురంలో భద్రావతి చిచ్చు పెట్టించింది. ప్రేమను ధీరజ్ నుంచి విడగొట్టి తన ఇంటికి తీసుకెళ్లింది. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టేందుకు నర్మద రంగంలోకి దిగడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More