Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఈ బల్లక్కాయ్ బుద్ధి మారదా? నర్మదను ఆపుతున్న మామ మాటలు.. నెక్స్ట్ ఏంటీ?

Illu Illalu Pillalu: తెలుగు జనాలు ఆదరిస్తున్న సీరియల్స్ ల ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ టాప్ లో ఉంటుంది. ఈ సీరియల్ లోని ఎమోషన్స్, సస్పెన్స్ తెలుగు ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా సీరియల్ లో ధీరజ్, ప్రేమ పెళ్లి జరిగింది. తన తప్పులన్నీ బయటపడ్డా బల్లక్కాయ్ బుద్ధి మాత్రం మారడం లేదు. 

Published on: Oct 2, 2026, 18:29:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమయ్యే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు తెలుగునాట అభిమానులు ఎక్కువే. ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుండటమే ఇందుకు నిదర్శనం. సీరియల్ స్టోరీలో ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ కొనసాగేలా మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే సీరియల్ కు మంచి క్రేజ్ దక్కుతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఈ బల్లక్కాయ్ బుద్ధి మారదా? నర్మదను ఆపుతున్న మామ మాటలు.. నెక్స్ట్ ఏంటీ? (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఈ బల్లక్కాయ్ బుద్ధి మారదా? నర్మదను ఆపుతున్న మామ మాటలు.. నెక్స్ట్ ఏంటీ? (jiohotstar)

ధీరజ్, ప్రేమ పెళ్లి

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కొన్ని ఎపిసోడ్లుగా ధీరజ్, ప్రేమ పెళ్లి జరుగుతుందా లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. కానీ డిటెక్టివ్ నర్మద రంగంలోకి దిగి అంతా సెట్ చేసింది. మొత్తం కుట్ర చేసింది భద్రావతి, శ్రీవల్లి అని ప్రేమకు తెలిసేలా చేసింది. దీంతో తప్పు తెలుసుకున్న ప్రేమ పెళ్లికి ఒప్పుకొంది. ధీరజ్, ప్రేమ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

బల్లక్కాయ్ బండారం

ధీరజ్, ప్రేమ పెళ్లి జరిగిపోయింది. మళ్లీ రామరాజు కుటుంబం అంతా ఒక్క చోటుకు చేరింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక బల్లక్కాయ్ బండారం బయటపడటం ఖాయమే అనుకుంటున్న సమయంలో సీరియల్స్ మేకర్స్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎంత జరిగినా బుద్ధి మారని బల్లక్కాయ్ తన తప్పులు బయటపడకుండా ఉండటం కోసం నర్మద దగ్గర తెగ నటించేస్తుంది.

మామ మాటలు

బల్లక్కాయ్ కుట్రలను ఎలా బయటపెట్టాలని నర్మద తెగ ఆలోచిస్తుంది. ఈ సమయంలోనే మామ మాటలు ఆమెను మళ్లీ మళ్లీ ఆపుతున్నాయి. ధీరజ్, ప్రేమ పెళ్లితో రామరాజు కుటుంబంలో సంతోషం మళ్లీ వచ్చింది. ఎప్పటికీ ఇలాగే కుటుంబం కలిసి ఉండాలని రామరాజు నేరుగా నర్మదకే చెప్పాడు. దీంతో బల్లక్కాయ్ గురించి చెస్తే ఆమెను కచ్చితంగా బయటకు నెట్టేస్తారని నర్మద ఆగుతుంది.

అదే కన్నింగ్ బుద్ధి

ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినా, అవన్నీ నర్మదకు తెలిసినా కూడా బల్లక్కాయ్ బుద్ధి మాత్రం మారడం లేదు. తన తప్పును ఆమె తెలుసుకోవడం లేదు. అదే కన్నింగ్ బుద్ధి చూపిస్తోంది. తన బండారం బయటపడితే కుటుంబం ముక్కలు అవుతుందని, తనను బయటకు గెంటేస్తారని, చందు బావ, మామయ్య కోసం నిజం చెప్పొద్దంటూ నర్మద దగ్గర బల్లక్కాయ్ డ్రామాలు ఆడుతోంది.

నెక్ట్స్ ఏంటీ?

ధీరజ్, ప్రేమ పెళ్లి జరిగింది. మరి బల్లక్కాయ్ కుట్రలను నర్మద ఎలా బయటపెడుతుంది? తన తప్పులు బయటకు రాకుండా వల్లి ఎలా తప్పించుకుంటుంది? అనేది ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు భద్రావతి ఏమో పగతో రగలిపోతుంది. ఇక భాగ్యం ఏమో చెడగొట్టడానికే రెడీగా ఉంది. మరి ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More