Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్-ట్రబుల్ షూటర్ నర్మద-ధీరజ్, ప్రేమ పెళ్లి బాజాలు-బల్లక్కాయ్ కు చుక్కలే!

Illu Illalu Pillalu: బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఓ సస్పెన్స్ కు తెరపడినట్లే. ట్రబుల్ షూటర్ నర్మద రంగంలోకి దిగడంతో ధీరజ్, ప్రేమ పెళ్లికి అన్ని కుదిరాయి. మరోవైపు మాత్రం బల్లక్కాయ్ కు ఇక చుక్కలే అని చెప్పొచ్చు. 

Published on: Sep 29, 2026, 14:15:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu: తెలుగు జనాలు విపరీతంగా ఆదరిస్తున్న సీరియల్స్ లో ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఒకటి. ఈ సీరియల్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఉత్కంఠ రేపే సస్పెన్స్, రివేంజ్ డ్రామా కూడా ఉంది. ముఖ్యంగా రామరాజు కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ట్రబుల్ షూటర్ లో ముందుండే నర్మద క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్-ట్రబుల్ షూటర్ నర్మద-ధీరజ్, ప్రేమ పెళ్లి బాజాలు-బల్లక్కాయ్ కు చుక్కలే! (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్-ట్రబుల్ షూటర్ నర్మద-ధీరజ్, ప్రేమ పెళ్లి బాజాలు-బల్లక్కాయ్ కు చుక్కలే! (jiohotstar)

ట్రబుల్ షూటర్ నర్మద

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు నడిపి కోడలు నర్మదను ట్రబుల్ షూటర్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఆమె తన తెలివితో, ధైర్యంలో ప్రతి ప్రాబ్లెం సాల్వ్ చేసుకుంటూ వెళ్తోంది. తన ఫ్యామిలీని ఒక్కటిగా ఉంచడం కోసం ఎంతకైనా తెగిస్తుంది.

బల్లక్కాయ్ గుట్టు

ఈ సీరియల్ లో చదువు పేరుతో చందును మోసం చేసి వల్లిని భాగ్యం కట్టబెడుతుంది. కానీ బల్లక్కాయ్ చదువు విషయాన్ని బయటపెట్టడంలో నర్మద కీ రోల్ ప్లే చేసింది. భాగ్యం అండ్ కో చేసిన లెక్కలేనన్ని మోసాలను ఆమె బయటపెట్టింది. ఇక శ్రీవల్లి దొంగ కడుపు నాటకాన్ని కూడా నర్మదనే కనిపెట్టింది.

ప్రేమ, ధీరజ్ లను కలిపి

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కొన్ని వారాలుగా ధీరజ్, ప్రేమ మళ్లీ కలుస్తారో లేదోనని సస్పెన్స్ రేకెత్తింది. శ్రీవల్లి కుట్ర ప్రకారం భద్రావతి కన్నింగ్ ప్లాన్ తో ధీరజ్, ప్రేమను విడగొట్టింది. కానీ నర్మద చూస్తూ ఊరుకుంటుందా? డిటెక్టివ్ లా మారింది. బల్లక్కాయ్ పై అనుమానంతో తన ఫ్రెండ్ సాయం తీసుకుంది. చివరకు బల్లక్కాయ్ బండారాన్ని తెలుసుకుంది.

అందుకే ధీరజ్ నుంచి ప్రేమను విడగొట్టేందుకు బల్లక్కాయ్, భద్రావతి కారణమని తెలుసుకుంది. ఇదే విషయాన్ని వీడియోలతో సహా ప్రేమకు చూపించింది. ధీరజ్ జీవితంలోకి జన్మలో వెళ్లనని శపథం చేసిన ప్రేమ మనసు మారేలా చేసింది. చివరకు ధీరజ్, ప్రేమల పెళ్లికి నర్మద కారణమైంది.

వల్లికి మూడినట్లే

ఇక రాబోయే ఎపిసోడ్లో ధీరజ్, ప్రేమ పెళ్లి జరిగినట్లు ప్రోమోలో చూపించారు. అసలు ప్రేమ పెళ్లి కూతురు చీరలో రావడం చూసే బల్లక్కాయ్ కంగుతింది. ఇక ధీరజ్, ప్రేమ పెళ్లి అయిన తర్వాత శ్రీవల్లికి మామూలుగా ఉండదు. మొత్తం బండారాన్ని బయటపెట్టి బల్లక్కాయ్ ను నర్మద ఒక ఆటాడుకోవడం ఖాయం.

మొత్తానికి ప్రేమ, ధీరజ్ కలుస్తారో లేదో? అసలు ధీరజ్ ను పెళ్లి చేసుకునేందుకు ప్రేమ వస్తుందో రాదో? అనే సస్పెన్స్ కు మేకర్స్ ఎండ్ కార్డు వేశారు. ధీరజ్, ప్రేమ పెళ్లితో రామరాజు ఫ్యామిలీలో మళ్లీ సంతోషం నిండనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More