Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నర్మదకు బల్లక్కాయ్ సీక్రెట్ సిమ్ దొరికిందా? ధీరజ్, ప్రేమ పెళ్లిపై ఉత్కంఠ!
Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరే రేటింగ్ తో దూసుకుపోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సస్పెన్స్ వేరే లెవల్ కు చేరుకుంది. ఓ వైపు బల్లక్కాయ్ గుట్టు రట్టు చేసేందుకు నర్మద ట్రై చేస్తూనే ఉంది. మరోవైపు ధీరజ్, ప్రేమ పెళ్లిపై టెన్షన్ నెలకొంది.
Illu Illalu Pillalu September 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇప్పుడు స్టోరీ ఉత్కంఠతో ఊపేస్తోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తోంది. తాాజగా కథలోని సస్పెన్స్ లు ఈ రేటింగ్ ను మరింత పెంచేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

బల్లక్కాయ్ కుట్రలు
రామరాజు కుటుంబాన్ని పెద్ద కోడలు శ్రీవల్లి ముక్కలు చేసింది. రివేంజ్ తీర్చుకోవడం కోసమని ధీరజ్, ప్రేమను బల్లక్కాయ్ విడగొట్టింది. అక్కడితోనే ఆగకుండా వీళ్లు కలవకుండా ఎప్పటికప్పుడూ ప్లాన్స్ వేస్తోంది. అంతే కాకుండా తిరుపతిని కూడా ఇంట్లో నుంచి పంపించేలా చేసింది.
డిటెక్టివ్ నర్మద
రామరాజు కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్ని ప్రాబ్లమ్స్ కు బల్లక్కాయ్ కారణమని నర్మద గట్టిగా నమ్ముతోంది. అందుకే తన ఫ్రెండ్ స్మిత్ తో సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించింది. దీంతో వల్లి తన తల్లిదండ్రులను మోపిదేవి పంపించిందనే విషయం బయటకొచ్చింది. ఈ విషయంతో ధీరజ్, ప్రేమ విడిపోవడం వెనుకాల వల్లి ఉందని నర్మద ఓ నిర్ణయానికి వచ్చింది.
సీక్రెట్ సిమ్ కార్డు
అయితే భద్రావతికి బల్లక్కాయ్ కాల్ చేసినట్లు మాత్రం రికార్డుల్లో లేదు. ఇప్పుడీ మిస్టరీ ఛేదించేందుకు నర్మద రంగంలోకి దిగింది. ఇప్పటికే బల్లక్కాయ్ చెంపలు పగలగొట్టి మరీ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో వల్లి సీక్రెట్ సిమ్ కార్డు కిందపడ్డా కూడా నర్మద చూడలేకపోయింది. వెంటనే వల్లి దాన్ని దాచేసింది.
ఈ సీక్రెట్ సిమ్ కార్డుతోనే భద్రావతి, తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ బల్లక్కాయ్ కుట్రలు అమలు చేస్తోంది. అది నర్మద చేతికి చిక్కితే వల్లి ఛాప్టర్ క్లోజ్. దీంతో ఆ సిమ్ కార్డును నర్మద ఎలా కనిపెడుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
ధీమా పెళ్లి
మరోవైపు ధీరజ్, ప్రేమ (ధీమ)ల పెళ్లిని గ్రాండ్ గా చేస్తానని రామరాజు శపథం చేశాడు. భద్రావతికి ఛాలెంజ్ చేశాడు. కానీ మరోవైపు అత్తను నమ్మి గుడ్డిగా ఇచ్చిన మాట కోసం ధీరజ్ ను పెళ్లి చేసుకోలేనని ప్రేమ బాధపడుతుంది. ఇక రామరాజు ఏమో ప్రేమను ఒప్పించే బాధ్యతను వేదవతి, నర్మదపై పెట్టాడు.
భద్రావతి కన్నింగ్ ప్లాన్
ఇప్పటికే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తన మాయ మాటలతో, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో ప్రేమను నమ్మిస్తుంది భద్రావతి. ధీరజ్ జీవితంలోకి ఎప్పటికీ వెళ్లను అనేలా ప్రేమ నిర్ణయం తీసుకోవడానికి కారణం భద్రావతి కుట్రనే. మరి ఈ విషయం ప్రేమకు తెలుస్తుందా? ధీరజ్, ప్రేమ పెళ్లి జరుగుతుందా? అనే సస్పెన్స్ సీరియల్ పై క్యూరియాసిటీని మరింత పెంచుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


