Illu Illalu Pillalu September 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కాళ్లబేరానికి బల్లక్కాయ్-వదలనంటున్న నర్మద-భద్రావతి ఫైర్
Illu Illalu Pillalu September 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 4 ఎపిసోడ్ లో బల్లక్కాయ్ కు దిమ్మతిరిగే షాకిస్తుంది నర్మద. దీంతో కాళ్లబేరానికి వచ్చినట్లే వచ్చి వల్లి తెగ బిల్డప్ కొడుతుంది. ఇటు పెళ్లి సంబంధాన్ని చెడగొట్టినవాళ్ల గురించి భద్రావతి ఆరా తీస్తుంది.
Illu Illalu Pillalu September 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ‘బావిలో బల్లి’ కథ చెప్పి శ్రీవల్లి, భాగ్యం అండ్ కోకు చెమటలు పట్టిస్తుంది నర్మద. ఏం చేయాలో తెలియక కథలు చెప్తున్నావా సెల్లాయ్ అని పైకి గంభీరంగా అడుగుతుంది బల్లక్కాయ్.

శ్రీవల్లి టెన్షన్
అక్కా, నువ్వు సినిమాల్లో యాక్టింగ్ చేసి ఉంటే పక్కా నంది వచ్చేది. ఎంత బాగా నటిస్తున్నావ్? నువ్వు మంచిదానివని నమ్మించేందుకు బావిలో దూకావు. ప్రేమ, ధీరజ్ ను విడగొట్టావ్. రైస్ మిల్ లో డబ్బులు కొట్టేసి, తిరుపతి బాబాయిని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావు. ఆ నింద భద్రావతిపై పడేలా చేశావంటూ జరిగిందంతా నర్మద చెప్పేసరికి శ్రీవల్లి గుటకలు మింగుతుంది.
బల్లక్కాయ్ కాళ్లబేరం
నువ్వు చేసిన వెధవ పని బయటపడితే నీ బతుకు బస్టాండ్ అనే లాజిక్ ఎలా మర్చిపోయావ్ అని నర్మద బెదిరిస్తుంది. దీంతో బల్లక్కాయ్ కాళ్లబేరానికి వస్తుంది. నువ్వు ఏం చెప్తే అది చెస్తానంటూ కాళ్లు పట్టుకుంటుంది. కానీ ఇలా రిక్వెస్ట్ చేస్తాననుకున్నావా చెల్లి? నేను ఏ తప్పు చేయలేదు. నేను చేయను కూడా. నిజం నిరూపణ కావాలంటే సాక్ష్యాలు కావాలని వల్లి బిల్డప్ కొడుతుంది.
నర్మద వార్నింగ్
నిజం నిప్పులాంటిది అక్క. చేయి కాలుతుంది. ఇవన్నీ నిజాలని నిరూపిస్తే ఏం చేస్తావని నర్మద అడుగుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని వల్లి ట్విస్ట్ ఇస్తుంది. నువ్వు ఎలాగో ఓడిపోతావ్ కదా. అప్పుడు నేను పెట్టే షరతు ఎలా ఉంటుందో ఆలోచించుకో అని వల్లి కౌంటర్ వేస్తుంది. బయటకు వెళ్లి బతికేందుకు రెడీగా ఉండమని వార్నింగ్ ఇచ్చి నర్మద వెళ్లిపోతుంది.
ఈ నర్మద పట్టపగలే చుక్కలు చూపించింది. నువ్వెందుకు ఛాలెంజ్ చేశావని వల్లిని భాగ్యం అడుగుతుంది. నర్మద గెలవదు. మనం భయపడి నోరు జారుతామని అనుకుంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండని తల్లిదండ్రులకు, సుక్కుకు వల్లి చెప్తుంది.
భద్రావతి ఫైర్
మరోవైపు తిరుపతి పెళ్లి సంబంధం చెడగొట్టారని భద్రావతి ఫైర్ అవుతుంది. వాళ్లు ఎవరో కనిపెట్టాలని సేనాపతికి భద్రావతి చెప్తుంది. అది కచ్చితంగా ధీరజ్ పనే. ఇన్నాళ్లు వాళ్లు చేయలేని పని మనం చేస్తున్నామని ఓర్వలేక చెడగొడుతున్నారని సేనాపతి అంటాడు. వాడితో పాటు ఓ అమ్మాయి కూడా ఉందంటా. వాడితో వెళ్లిని అమ్మాయి ఎవరై ఉంటుందని భద్రావతి అనేసరికి విశ్వ, ప్రేమ ఫ్యూజుల్ ఔట్ అయిపోతాయి.
వాడితో వెళ్లిన ఆ అమ్మాయి ఎవరో నీకు మాత్రమే తెలుసు ప్రేమ. ఎవరో చెప్పు అని ప్రేమను భద్రావతి అడుగుతుంది. అత్త నాకు తెలుసు. పెద్దక్క నర్మదనే అని విశ్వ మధ్యలో వచ్చి చెప్తాడు. దీంతో విశ్వ చెంపపై కొడుతుంది భద్రావతి. కచ్చితంగా నర్మదనే. కానీ ఆ అమ్మాయిని వరుసలు కలిపి మాట్లాడావని కొట్టానని భద్రావతి ఫైర్ అవుతుంది.
రామరాజు కుటుంబానికి బుద్ధి చెప్తా. నా తమ్ముడి పెళ్లి ఎవరితో, ఎలా చేయాలో నాకు తెలుసని భద్రావతి ఊగిపోయి లోపలికి వెళ్లిపోతుంది. అత్త సంగతి తెలిసి కూడా పెద్దక్క అన్నావేంటీ అని విశ్వను చూసి ప్రేమ నవ్వుకుంటుంది.
దొంగచాటుగా వల్లి
ఇటు రామరాజు ఇంట్లో నర్మద, వేదవతి, ధీరజ్ ఒకే గదిలోకి వెళ్లడం వల్లి చూస్తుంది. కిటికీ దగ్గరకు వెళ్లి వాళ్ల మాటలను దొంగచాటుగా బల్లక్కాయ్ వింటుంది. ఆ వల్లి అమాయకంగా కనిపించే అనకొండ. మన మెడకే చుట్టుకొని, మనల్నే మింగేస్తుందని నర్మద అంటుంది. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయింది కదా. పైగా అన్నయ్య కోసం బావిలో దూకిందని ధీరజ్ చెప్తాడు.
నిజానిజాలు తెలియకుండా ఒకరిని నిందించడం తప్పు నర్మద అని వేదవతి అంటుంది. తనమీద నాకు అనుమానం పోలేదు. ఒక్క తీగ దొరికితే డొంకంతా లాగుతానని నర్మద చెప్తుంది. దొరికినప్పుడు చూసుకుందామని వేదవతి, ధీరజ్ వెళ్లిపోతారు. ఈ వల్లి రంగులు మార్చే ఊసరవెళ్లి, పట్టుకోవడం నీ తరం కాదని బల్లక్కాయ్ అనుకుంటుంది.
తిరుపతి హ్యాపీ
పెళ్లి సంబంధాన్ని చెడగొట్టినందుకు ధీరజ్, ప్రేమకు తిరుపతి థ్యాంక్స్ చెప్తాడు. మీరిద్దరు కలిసి ఉంటే ఏదైనా సాధించగలరని తిరుపతి అంటాడు. దీంతో ప్రేమ, ధీరజ్ మళ్లీ ఒకరిని ఒకరు మాటలు అనుకుంటారు. పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేందుకు వెళ్లినప్పుడు నీ గురించి ఏం చెప్పాడో తెలుసా బాబాయి అని ప్రేమ చెప్పబోతుంటే ధీరజ్ నోరు మూస్తాడు. ప్రేమ కొరుకుతుంది.
అప్పుడే వేదవతి, నర్మద బయటకు వచ్చి ఏమైందని అడుగుతారు. పెళ్లి సంబంధం అంటూ నోరు జారబోతున్న తిరుపతిని ధీరజ్ ఆపుతాడు. ఏరా, తిరిగి ఇంటికి రావాలని లేదా? అక్కగా నిన్ను అనే హక్కు లేదా. నేను మాటవరుసకు డబ్బులు తీశావా అని అడిగానని వేదవతి అంటుంది. పాతికేళ్లు నీ దగ్గరే పెరిగా కదా అక్క. నేను డబ్బులు తీస్తానా అని ఫీల్ అయిపోయి తిరుపతి లోపలికి వెళ్లిపోతాడు.
విశ్వ వీడియో కాల్
నైట్ చదువుకుంటున్న అమూల్యకు విశ్వ వీడియో కాల్ చేస్తాడు. అర్జెంట్ గా ఓ విషయం చెప్పాలి. అది మార్నింగ్ చెప్తా. రేపు సినిమాకు టికెట్లు తీస్తానని విశ్వ అంటాడు. చెప్పు తెగుతుందని తెగ తిట్టేస్తుంది అమూల్య. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


