Illu Illalu Pillalu August 20 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-భద్రావతి కన్నింగ్ ప్లాన్-ప్రేమను పట్టించుకోని ధీరజ్-చంపాలని!
Illu Illalu Pillalu August 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 20 ఎపిసోడ్ లో భద్రావతి తన మాయ మాటలతో ప్రేమను మార్చాలని చూస్తుంది. ధీరజ్ ఏమో ప్రేమను పట్టించుకోడు. ఇక వేదవతి, నర్మద కలిసి ప్రేమకు క్లాస్ పీకుతారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
Illu Illalu Pillalu August 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను ఫారెన్ పంపించాలని సేనాపతి కొత్త నాటకం స్టార్ట్ చేస్తాడు. విదేశాలకు వెళ్తావా? అని ప్రేమను అడుగుతాడు. అప్పుడే భద్రావతి వచ్చి ప్రేమ ఎక్కడికి వెళ్లదని చెప్తుంది. ఆ ధీరజ్ ఏమో కళ్యాణ్ పేరు రాసి ప్రేమను బాధపెడుతున్నాడని సేనాపతి అంటాడు.

భద్రావతి మాయ మాటలు
అంతే కాదు ఆ పేరు రాసింది మనమేనని కూడా బుకాయిస్తాడని భద్రావతి కావాలనే అంటుంది. అందుకే ఈ బాధలకు దూరంగా ప్రేమను పంపించేద్దామని సేనాపతి అంటాడు. పారిపోవాలనుకుంటే మనం ఎప్పుడో వెళ్లిపోయేవాళ్లం. రామరాజు మన ఇంట్లో పని చేసి మన చెల్లెలిని లేపుకెళ్లిపోయాడు. మనకు నమ్మద్రోహం చేసి మనల్నే రాక్షసుల్లా చిత్రీకరించాడని భద్రావతి అంటుంది.
ధీరజ్ మంచోడు
ఓ వైపు ప్రేమను బాధపెడుతూనే మనల్ని రాక్షసుల్లా చేస్తున్నాడని భద్రావతి అంటుంది. కానీ ధీరజ్ మంచోడు. స్వతహాగా ఎవరిని బాధపెట్టడని ప్రేమ చెప్పడంతో భద్రావతి షాక్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ పేరును ఎవరు రాశారు? అంటే నేనో, మీ నాన్నో రాశారని నిందలు వేస్తాడు. ఈ నిందలు పడటం నాకు కొత్త కాదు. నా మేనకోడలు కంటితడి పెడితే నాకు బాధగా ఉంటుంది. అందుకే నిన్ను ఎక్కడికి పంపనని భద్రావతి మొసలి కన్నీరు కారుస్తుంది.
బంధాన్ని తెంచుకునేలా
కళ్యాణ్ తో లేచిపోయావని అన్న మాటల నుంచి ఈ రోజు చేతి మీద పేరు రాసేంతవరకూ అన్నీ ప్రేమ చూస్తూనే ఉంది. ఇవన్నీ చూసి ధీరజ్ ఎలాంటి వాడు అనే అంచనాకు రాకుండా ఉంటుందా? తన అసలు రంగు తెలుసుకోకుండా ఉంటుందా? అని ప్రేమను మాటలతో మాయ చేస్తుంది భద్రావతి. ధీరజ్ తో బంధాన్ని ప్రేమ తెంచుకునేలా చేద్దామని బయట సేనాపతితో భద్రావతి చెప్తుంది.
అమూల్య సైగలు
ప్రేమను అకాడమీలో డ్రాప్ చేసేందుకు విశ్వ రెడీ అవుతాడు. అయితే బైక్ టైర్ లో గాలి తీసేయమని విశ్వకు అమూల్య సైగలు చేస్తుంది. విశ్వ అలాగే చేస్తాడు. ధీరజ్ బయటే కారు క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ బయటకు వస్తుంది. ప్రేమను చూసి ధీరజ్ పట్టించుకోడు.
పట్టించుకోని ధీరజ్
బైక్ టైర్ పంక్చర్ అయిందని ప్రేమకు విశ్వ చెప్తాడు. నా క్లాస్ కు టైమ్ అవుతుందని ప్రేమ అంటుంది. కారుతో నీ భర్త ఉండగా ఎందుకు చింత అని విశ్వ అంటాడు. ధీరజ్ ను బావ అని పిలుస్తాడు. మీ ఆవిడకు క్లాస్ కు టైమ్ అవుతుందంటా తీసుకెళ్లవా? అని ధీరజ్ ను విశ్వ అడుగుతాడు. అమూల్య, వేదవతి, నర్మద చెప్పినా కూడా ధీరజ్ వినడు. కారు తీసుకొని వెళ్లిపోతాడు.
స్కూటీపై వేదవతి
క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తానని ప్రేమ అంటుంది. వేదవతి స్కూటీ మీద ప్రేమను డ్రాప్ చేస్తానంటుంది. నర్మదను కూడా ఎక్కమంటుంది. నర్మద దేవుడికి దండం పెట్టుకుని స్కూటీ ఎక్కుతుంది. ప్రేమను మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. కొంచెం దూరం వెళ్లగానే స్కూటీ ఆపమని ప్రేమ దిగుతుంది. బలంగా శ్వాస పీల్చుకుంటుంది.
ప్రేమ ఎమోషనల్
ఇటు నువ్వు, అటు అక్క మధ్యలో నన్ను అప్పడం చేసేశారని ప్రేమ అంటుంది. భార్యాభర్తల బంధం కూడా అంతేనే. ఆ బంధంలో వేరేవాళ్లు జోక్యం చేసుకుంటే ఇలాగే ఊపిరి ఆడకుండా అయిపోతుందని వేదవతి చెప్తుంది. మీరే మాట్లాడుకోవాలి. ఎవరో ఒకరు తగ్గాలి. ఇప్పుడు ఎంత దూరం వెళ్లిందో చూశావా అని నర్మద చెప్తుంది. కానీ ప్రేమ మాత్రం మళ్లీ అవే మాటలను చెప్తుంది. ధీరజ్ అందరి ముందు అవమానించాడని ఎమోషనల్ అవుతుంది.
ధీరజ్ ను చంపాలని
అందరిముందు చిన్నోడు అలా మాట్లాడటం తప్పే. కానీ మీరు కలిసిపోలేనంత పెద్ద తప్పు కాదని వేదవతి అంటుంది. ఒకసారి నువ్వు ఆలోచిస్తే ధీరజ్ నీ కోసం ఎన్ని అవమానాలు పడ్డాడో తెలుస్తుందని నర్మద చెప్తుంది. మీ అత్త, నాన్న ఎన్ని అవమానించినా పడ్డాడు కానీ నీ గురించి చెడుగా మాట్లాడలేదు. ఒకవేళ ధీరజ్ అనుకుంటే ఎప్పుడో కళ్యాణ్ గురించి చెప్పేవాడు. ఆఖరికి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు సంక్రాంతి పండుగ రోజు చంపాలని చూశారని వేదవతి గుర్తు చేస్తుంది.
నర్మద క్లాస్
నీ కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకునేందుకు రెడీ అయిన ధీరజ్ ప్రేమ కనిపించడం లేదా అని ప్రేమను ప్రశ్నిస్తుంది వేదవతి. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మామయ్య మొదట్లో ధీరజ్ తో మాట్లాడలేదు. నీ కోసం ధీరజ్ ఫుడ్ డెలివరీ చేశాడు. వాటర్ క్యాన్ లు మోశాడు. నిన్ను పోలీస్ ను చేసేందుకు నైట్ కారు తోలాడని నర్మద కూడా చెప్తుంది.
సొంత ఇంట్లోనే పరాయివాడిలా బతికాడు. అది నీ కోసం కాదా? అప్పుడు ధీరజ్ నీతో మాట్లాడలేదు కూడా. కావాలనుకుంటే నిన్ను వదిలేసేవాడు అని నర్మద క్లాస్ పీకుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


