Illu Illalu Pillalu August 17 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్లక్కాయ్ చావుతెలివి-ప్రేమకు ధీరజ్ గోరింటాకు-భద్రావతి కుట్ర

Illu Illalu Pillalu August 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 17 ఎపిసోడ్ లో భద్రావతి మరో కుట్ర పన్నుతుంది. వల్లి తన చావు తెలివితేటలతో చందుతో గోరింటాకు పెట్టించుకుంటుంది. ప్రేమకు ధీరజ్ వెళ్లి గోరింటాకు పెడతాడు. కానీ భద్రావతి కళ్యాణ్ పేరు రాస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ చూసేయండి.

Published on: Aug 17, 2026, 08:06:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu August 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గోరింటాకు నూరుతూ వేదవతి ఏదో బాధలో ఉంటుంది. ఈ విషయాన్ని కోడలు నర్మద గమనిస్తుంది. ప్రేమ, ధీరజ్ గురించి అత్తయ్య బాధపడుతుంది. ఆమెను కాస్త నవ్వించాలని నర్మద అనుకుంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వేదవతి బాధ

పెళ్లయిన కొత్తలో మామయ్యతో గోరింటాకు పెట్టించుకోవడం గుర్తు చేసుకుంటున్నారా? కొంటె పనులు ఏమేం ఉన్నాయి? అని అత్తను నర్మద అడుగుతుంది. శ్రీరామ శ్రీరామ ఏంటే అలా పచ్చిగా మాట్లాడుతున్నావ్ అని వేదవతి అంటుంది. ధీరజ్, ప్రేమ గురించి ఆలోచిస్తున్నానని వేదవతి చెప్తుంది.

ప్రేమ తలరాత

గోరింటాకును సాక్షాత్తూ అమ్మవారి ప్రతీక అంటారు. ఆషాడ మాసంలో పెళ్లయిన ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే వాళ్ల కాపురం గోరింటాకు అంత అందంగా పండుతుందని అంటారు. అందుకే చాలా మంది ఆడపిల్లలో భర్తతో గోరింటాకు పెట్టించుకుంటారు. కానీ ప్రేమ తలరాత చూశావా? గొడవ జరిగి పుట్టింటికి వెళ్లిపోయిందని వేదవతి ఫీల్ అవుతుంది.

బల్లక్కాయ్ సైకో ఆనందం

ఈ మాటలను ఇటు ధీరజ్, అటు శ్రీవల్లి వింటారు. పొట్టి మిరపకాయ్ ను చూస్తే బాధగా ఉంది. గోరింటాకు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. లేకపోతే అక్కాచెల్లి కలిసి నా కాపురం కూలుస్తారా? ఇదిగో గవర్నమెంట్ నెక్స్ట్ నీ కాపురమే. ఏడవడానికి రెడీగా ఉండు అని అనుకుంటుంది బల్లక్కాయ్.

వల్లి రిక్వెస్ట్

రూమ్ లో రైస్ మిల్ లెక్కలు చూసుకుంటున్న చందు దగ్గరకు గోరింటాకు పట్టుకుని వల్లి పాటపాడుతూ వెళ్తుంది. గోరింటాకు పెట్టమంటుంది. ఈ ఎక్స్ ట్రాలే వద్దు. మన మధ్య అసలు కాపురమే లేదు అని చందు అంటాడు. వల్లి ఎంత రిక్వెస్ట్ చేసినా చందు మాత్రం మొండిగానే ఉంటాడు.

అందరూ మోసం చేసినోళ్లే

అప్పుడు మీ అమ్మకు నాన్న, నర్మదకు సాగర్ మరిది కూడా ఇలాంటి శిక్షలే వేయాలి. మన మధ్య భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోయిందని నువ్వు అనుకోవడానికి, నన్ను దూరం పెట్టడానికి కారణం ఏంటీ? నిజాలు దాచిపెట్టి నిన్ను మోసం చేశాననే కదా. మరి మీ అమ్మ, మీ నర్మద మరదలు, మీ చిన్న తమ్ముడు ధీరజ్ చేసింది ఏంటీ? ధీరజ్, ప్రేమకు దొంగచాటుగా మీ అమ్మ పెళ్లి చేసిందని వల్లి అంటుంది.

అప్పుడు నర్మద అక్కడే ఉంది. కానీ ఈ విషయం సాగర్ కు చెప్పకుండా మోసం చేసింది. మీ చిన్న తమ్ముడు కూడా నాన్నకు చెప్పకుండా మోసం చేశాడు. వాళ్లందరూ సరిగ్గానే ఉన్నారు. నా పరిస్థితే ఇలా ఉంది. మీ అమ్మ పరిస్థితి, నా పరిస్థితి ఇప్పుడు ఒకటే బా. మీ అమ్మతో మీ నాన్న మాట్లాడటం లేదు. నాతో నువ్వు మాట్లాడటం లేదు అని వల్లి అంటుంది.

వల్లి చావు తెలివితేటలు

వీపు గోక్కుంటున్నాననే నెపంతో గోరింటాకు గిన్నెను చందు చేతిలో పెడుతుంది వల్లి. మళ్లీ తీసుకునేటప్పుడు గిన్నె బోర్లా వేసేలా చేయి గోరింటాకు పెట్టించుకుంటుంది. చందు కోపంతో బయటకు వెళ్లిపోయి ధీరజ్ తో మాట్లాడతాడు. నా కాపురం ఎలాగో బాలేదు. నువ్వు ప్రేమను ఇంటికి తీసుకు రా అని ధీరజ్ కు చెప్తాడు.

ధీమా అని గోరింటాకు

అందరూ పడుకోగానే గోరింటాకు తీసుకుని ప్రేమ గదికి వెళ్తాడు ధీరజ్. కుందేలు పిల్లలా ఎంత క్యూట్ గా ఉన్నావే అని నిద్రపోతున్న ప్రేమను చూసి మురిసిపోతాడు ధీరజ్. ప్రేమ చేతికి గోరింటాకు పెడతాడు. అరచేతిపై ‘ధీమా’ అని తమ పేర్లు కలిసేలా గోరింటాకుతో రాస్తాడు ధీరజ్. మన పేర్లు, మన ప్రేమ ఎప్పటికీ కలిసి ఉండాలని నీకు అర్థమయ్యేలా చేయడం కోసమే ఈ గోరింటాకు అని ధీరజ్ అనుకుంటాడు.

ఈ రోజు ఏంటే ఇంత ముద్దొస్తున్నావ్? ముద్దు పెట్టుకోకుండా ఉండేందుకు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో అని అనుకుంటూ ధీరజ్ వెళ్లిపోతాడు.

భద్రావతి కుట్ర

ఉదయం కాఫీ తాగుతూ సైకో ఆనందంతో మురిసిపోతుంది భద్రావతి. ప్రేమకు గోరింటాకు పెట్టి సంబరపడిన ధీరజ్ ఆనందానికి, రామరాజు ఫ్యామిలీకి మరికొన్నిసేపట్లో బాధ మిగిలించబోతున్న అని భద్రావతి అనుకుంటుంది. అప్పుడే ప్రేమ అందరినీ పిలుస్తూ కోపంతో కిందకు వస్తుంది.

కళ్యాణ్ పేరుతో

నా చేతికి గోరింటాకు ఎవరు పెట్టారని ప్రేమ అడుగుతుంది. మీ అత్త పెట్టిందేమోనని శారదాంబ అంటుంది. టెన్షన్ పడ్డ భద్రావతి నేను పెట్టలేదని అంటుంది. కచ్చితంగా ఆ ధీరజ్ పెట్టి ఉంటాడని భద్రావతి అంటుంది. గోరింటాకు బాగా పండింది. నీ భర్తపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని శారదాంబ గొప్పగా చెప్తుంది.

మీ ఆయనకు నీ మీద ఎంతో ప్రేమ ఉందని రేవతి అంటుంది. ఎంత ప్రేమ? ఇంత ప్రేమనా అని చేతిపై గోరింటాకుతో రాసిన కళ్యాణ్ పేరును ప్రేమ చూపిస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More