Illu Illalu Pillalu August 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ సైకో ఆనందం- విడాకులు తీసుకోమని ప్రేమకు షాక్

Illu Illalu Pillalu August 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 13 ఎపిసోడ్ లో ప్రేమ మాటలకు ధీరజ్ కుమిలిపోతాడు. మరోవైపు భాగ్యం ఫ్యామిలీ సైకో ఆనందం పొందుతారు. నర్మదను వల్లి టార్గెట్ చేస్తుంది. ప్రేమకు విడాకులు తీసుకోమని చెప్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 13, 2026, 10:36:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu August 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గుడిలో జరిగిన హైడ్రామాతో ధీరజ్ తనకు వద్దే వద్దని ప్రేమ చెప్తుంది. కోపం రాగానే నాకు ఇచ్చిన మాట తప్పాడు. రేపు కోపమొస్తే ఏదైనా చేస్తాడు కదా. నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేశాడు. ఆడపిల్ల మనసును అర్థం చేసుకోలేని భర్త నాకొద్దు అని ప్రేమ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెళ్లిపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

బల్లక్కాయ్ సైకో ఆనందం

ప్రేమ మాటలకు ధీరజ్ ఇంకా కుమిలిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా కాపురాన్ని కూల్చేసిన శత్రువు కాపురం ముక్కలైంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని బల్లక్కాయ్ సైకో ఆనందం పొందుతుంది. సీన్ కట్ చేస్తే భాగ్యం ఇంట్లో అందరూ ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా అనే సాంగ్ పెట్టుకుని ఏడుస్తుంటారు.

భాగ్యం సంబరం

శ్రీవల్లి సాంగ్ ఆపేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని ఆ ప్రేమ ఎలా వద్దనుకుందని అందరూ పాపం పాపం అంటూ సైకో ఏడుపు ఏడుస్తారు. ఆ వెంటనే పొట్టలు పగిలేలా నవ్వేస్తారు. నువ్వు సూపర్ అమ్మడు.. ఆ ప్రేమ పావురాల కాపురాన్ని కూల్చేశావ్. నా కూతురు అనిపించుకున్నావ్ అని భాగ్యం సంబరపడిపోతుంది.

నర్మద టార్గెట్

శత్రుశేషం అస్సలు ఉంచుకోకూడదు. నర్మద కాపురాన్ని కూల్చేశావంటే పరిపూర్ణం అవుతుందని వల్లిని భాగ్యం ఇంకా రెచ్చగొడుతోంది. ఇక నుంచి అదే పనిలో ఉంటానని వల్లి అంటుంది. నాన్నగారు మీ చేతివాటానికి టైమ్ వచ్చింది. మా రైస్ మిల్ లో దొంగతనం చేయాలి. దొంగతనం లాంటిది చేయాలని ఇడ్లీ బాబాయ్ కు వల్లి చెప్తుంది.

మా మామయ్య ఊరు వెళ్లారు. రైస్ మిల్ లో మా ఆయనకు తెలియకుండా ఎన్ని లక్షలు దొరికితే అన్ని మడతపెట్టేయ్ అని తండ్రికి చెప్తుంది బల్లక్కాయ్. ఈ చిల్లర దొంగతనాలు ఎందుకు అని భాగ్యం అడుగుతుంది. ఆ రైస్ మిల్ మన చేతికి రాకపోతే ఏంటీ పరిస్థితి? అవకాశం దొరక్కానే మడత పెట్టేయాలి. రైస్ మిల్ లో క్యాష్ కొట్టేసే పనిలో ఉండండి నాన్నగారు. నేను నర్మద కాపురం కూల్చే పనిలో ఉంటానని కన్నింగ్ గా చెప్తుంది వల్లి.

మామయ్యకు అవార్డులు

ఇటు ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉంటాడు ధీరజ్. ధీరజ్ ను చూసి వేదవతి, నర్మద ఫీల్ అవుతారు. చిన్నోడు నోట్లో నాలుక లేని అమాయకుడు. నాలాగే సున్నితమైన మనసు. ఎవరైనా ఏదైనా మాట అంటే బాధపడటం తప్పా నోరు తెరిచి మాట్లాడలేమని నర్మదతో వేదవతి అంటుంది. మీ జోకులు ఆపుతారా అని నర్మద కౌంటర్ వేస్తుంది. గయ్యాళి మీరు. మిమ్మల్ని భరిస్తున్నందుకు మామయ్యకు సహన సామ్రాట్, సహన శీలి అనే అవార్డులివ్వాలని ఎగతాళిగా అంటుంది నర్మద.

ప్రేమ మొదట ఆవేశపడుతుంది. ఆ తర్వాత అర్థం చేసుకుంటుంది. త్వరలోనే తన తప్పు తాను తెలుసుకుంటుందని నర్మద, వేదవతి కలిసి ధీరజ్ ను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. మొగుడు పెళ్లాలు అన్నాక గొడవలు చాలా కామన్ అని తిరుపతి కూడా ఫిలాసఫీ చెప్తాడు. ఇద్దరు అన్నలు, చెల్లి కూడా బాధపడకమని చెప్తారు.

ప్రేమను తీసుకురావాలని

మీరందరూ మెలో డ్రామా చేస్తున్నారు. నేను బాధపడుతున్నానని చెప్పానా? నేనేం బాధపడను. నా పెళ్లానికి బుర్ర తక్కువ. దాని మాటల్లోని కోపాన్ని అర్థం చేసుకుంటాను కానీ బాధపడను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. మేం ఒకరికొకరం విడిచి పెట్టి ఉండలేం. మన ఫ్యామిలీని తిరిగి హ్యాపీగా ఉంచడం కోసం దాన్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నానని ధీరజ్ అంటాడు.

చిన్నోడా.. ఎంత ఎదిగిపోయావురా? మీ ప్రేమే తిరిగి మిమ్మల్ని కలుపుతుందని వేదవతి ఎమోషనల్ అవుతుంది. నీ ఎమోషన్ చూసి బాధ వేస్తుంది అమ్మా. ధీరజ్ ను రేపటిలోగా తీసుకురాకపోతే అని అనుకుంటూ ధీరజ్ వెళ్లిపోతాడు.

భద్రావతి విషం

ప్రేమకు అలాంటి మాటలు ఎందుకు చెప్పావ్ అక్కా? తన ఇష్టముంటే వెళ్లిపొమ్మని ఎందుకు అన్నావ్? అని భద్రావతిని సేనాపతి అడుగుతాడు. శాశ్వతంగా బంధం తెంచుకునేందుకే అలా మాట్లాడా. కోపంతో మాట్లాడితే ప్రేమ ద్వేషం కక్కుతుంది. నలుగురిలో అవమానించి, జాకెట్ చింపేసినా మొగుడు కావాలంటే వెళ్లిపో అని విషం లాంటి మాటను వెన్నపూసతో రాసినట్లు చెప్పా. ప్రేమ ఇప్పుడిప్పుడే నా మాట వింటుంది. నా నాటకాలతో ప్రేమ మనసును పూర్తిగా మార్చేస్తానని భద్రావతి చెప్తుంది.

ప్రేమ మెడలో ధీరజ్ కట్టిన తాళిని వాడి ముఖం మీదే విసిరికొట్టేలా చేస్తా. నా మేనకోడలికి నా స్థాయి చూసి ఘనంగా పెళ్లి చేస్తానని తనలోని అసలు విషాన్ని బయటకు కక్కుతుంది భద్రావతి.

వల్లి డ్రామా

ఉదయం బయటకు వచ్చిన ప్రేమ ఏమో ధీరజ్ కనిపించడం లేదని వెతుకుతుంది. అది చూసి వల్లి మాటలతో ప్రేమను బాధపెట్టాలని అనుకుంటుంది. ఎట్టా ఉన్నావ్ సెల్లాయ్. అసలే మొగుడిని వదిలేసి ఉన్నావ్. నీ మంచి చెడుల గురించి ఒక అక్కగా నాకు బాధ ఉంటుంది కదా సెల్లాయ్ అని బల్లక్కాయ్ అంటుంది. నీ నాటకాలు నాకు తెలుసని ప్రేమ కోప్పడుతుంది.

విడాకులు ఇచ్చేయ్

నా అన్న వాళ్లకు ఏదైనా అయితే నా గుండె గుక్క పెట్టి ఏడుస్తుంది. నీ కాపురం కూలిపోయినందుకు ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు. నీకు జీవితాంతం బాధపడే అవకాశం రాకూడదు. ధీరజ్ కు మీ కుటుంబం మీద పగ తప్పా నీ మీద ప్రేమ లేదు సెల్లాయ్. అందుకే మీ వాళ్లు వచ్చినప్పుడు ధీరజ్ అలా మాట్లాడాడు. నిన్ను ఇంకా అవమానిస్తూనే ఉంటాడని వల్లి లేనిపోనివి చెప్తుంది.

ధీరజ్ కు విడాకులు ఇచ్చేయ్ అని వల్లి అనగానే ప్రేమ లాగిపెట్టి కొడుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More