Illu Illalu Pillalu August 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ధీరజ్ మాటలకు కరిగిన ప్రేమ- ముగ్ధ ఎంట్రీతో సీన్ రివర్స్
Illu Illalu Pillalu August 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 14 ఎపిసోడ్ లో శ్రీవల్లికి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. ధీరజ్ మాటలకు ఆల్మోస్ట్ కరిగిపోయిన ప్రేమ క్షమించాలని అనుకుంటుంది. కానీ ముగ్ధ ఎంట్రీతో సీన్ రివర్స్ అవుతుంది. మరోవైపు విశ్వకు అమూల్య ఆర్డర్ వేస్తుంది.
Illu Illalu Pillalu August 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ కు విడాకులు ఇచ్చేయమని శ్రీవల్లి చెప్పగానే ప్రేమ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చికూతలు కూస్తే చంపేస్తానని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.

ప్రేమ పెరుగుతూనే
నేను మా ఆయనతో గొడవపడి నేను పుట్టింటికి వచ్చినందుకు నువ్వు చంకలు గుద్దుకుంటూ ఎంతో సంతోషపడుతున్నావో నాకు తెలియదా? నా భర్తకు నా మీద, నాకు నా భర్త మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుందని ప్రేమ సీరియస్ గా చెప్తుంది.
నీ బతుకేంటో చూసుకో
నీ బతుకేంటో చూసుకో. మీ ఆయన దూరం పెడితే నాలుగు గోడల మధ్య దిక్కుమొక్కు లేనిదానిలా బతుకుతున్నావ్. మీ ఆయన తన్ని తరిమేస్తే మళ్లీ అత్తారింట్లో అడుగుపెట్టవ్. మా ఆయన ఏదో ఒక రోజు నన్ను తీసుకెళ్తాడు. ముందు తుమ్మితే ఊడిపోయేలాంటి నీ లైఫ్ ను సెట్ చేసుకో అని బల్లక్కాయ్ కు ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.
ప్రేమ ఎమోషనల్
ప్రేమ పోలీస్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్తుంది. అక్కడే ధీరజ్ వెయిట్ చేస్తుంటాడు. నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయిపోయాయని ప్రేమ అంటుంది. ఆవేశంలో మాటలు జారాయని చెప్తే వినవేంటీ అని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరి ముందు నవ్వులు పాలు కావొద్దో వాళ్ల ముందే అలా చేశావ్. ప్రస్తుతం నా పరిస్థితికి ఒక వైపు జాలి పడుతున్నట్లు నటిస్తూనే గుచ్చి గుచ్చి మాటలతో చంపుతున్నారని ప్రేమ ఫీల్ అవుతుంది.
ధీరజ్ బాధ
కళ్యాణ్ తో నేను వెళ్లిపోవడం తప్పే. నువ్వు తాళి కట్టి జీవితాన్ని ఇచ్చినందుకు రుణపడి ఉంటా. కానీ నలుగురిలో తలదించుకునేలా చేస్తే ఆ బాధ నాకు మాత్రమే తెలుసు అని ప్రేమ అంటుంది. నేను అలా మాట్లాడినందుకు అప్పటి నుంచి ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో అర్థం చేసుకోవా? మా అమ్మంటే నాకు గౌరవం. ప్రతి ఆడపిల్లను అలాగే గౌరవిస్తా. నీ మీద ఎంతో ప్రేమ ఉందని ధీరజ్ చెప్తుంటాడు.
క్షమించు ప్రేమ
నిన్ను బాధపెట్టడం అంటే నన్ను నేను బాధపెట్టుకోవడమే కదా. నువ్వంటే ఇష్టం లేనప్పుడు కూడా ఆ కళ్యాణ్ వేధిస్తున్నాడని చంపబోయా. ఇప్పుడు నా ప్రేమ అర్థం కావడం లేదా? నిజంగా నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశ్యం అయితే ఇన్నిసార్లు ప్రాధేయపడతానా? నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే కోపంలో మాట్లాడిన మాటలు క్షమించమని రెండు చేతులతో మొక్కుతాడు ధీరజ్.
ముగ్ధ ఎంట్రీ
ఇంతలా సారీ చెప్తున్నాడు కాబట్టి క్షమించేస్తానని ప్రేమ అనుకుంటుంది. అప్పుడే ముగ్ధ వచ్చి మై ప్రిన్స్ అంటూ ధీరజ్ ను హగ్ చేసుకుంటుంది. ధీరజ్ వెళ్లమని చెప్తున్నా ముగ్ధ మాత్రం వెళ్లదు. మన విషయం ఇంట్లో చెప్పానని, తీసుకురమ్మన్నారని ముగ్ధ చెప్పడంతో ప్రేమ కోపంతో వెళ్లిపోతుంది.
విశ్వ బిల్డప్
మరోవైపు అమూల్య కోసం కాలేజీ దగ్గర విశ్వ వెయిట్ చేస్తుంటాడు. ఏంటీ కాలేజీ ముందు కాపలా కాస్తున్నావు. కొంపదీసి వాచ్ మ్యాన్ లా మారావా? అని అమూల్య అడుగుతుంది. నీ కోసం మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ చాక్లెట్ నీకు ఇద్దామని వచ్చా. నువ్వే నాకు ఓ శాలువా కప్పి, బొకే ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి. మా చెల్లెలిని గుడికి వచ్చేలా చేశానని విశ్వ తెగ బిల్డప్ ఇస్తాడు.
అమూల్య ఆర్డర్
మా అన్నయ్య, వదిన ఏమైనా కలిసిపోయారా? ఇంకా దూరం పెరిగిపోయిందని అమూల్య అంటుంది. టెన్షన్ పడాల్సిందేమీ లేదు. మనం ఏదో ఒకటి చేసి వాళ్లను కలిపేద్దామని విశ్వ చెప్తాడు. మీ ఇంట్లో ప్రేమ ఎప్పుడూ మా అన్నయ్యను తలుచుకునేలా చేయు. అలాగే మీ నాన్న, అత్తయ్య కుట్రలు కూడా నాకు చెప్పమని అమూల్య ఆర్డర్ వేస్తుంది.
విషం ఇవ్వు అమ్మ
ఇంటికి వెళ్లిన ప్రేమ.. ముగ్ధతో ధీరజ్ ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటూ కోపంతో ఊగిపోతుంది. ధీరజ్ ను నానామాటలు అనుకుంటుంది. పెద్ద ఫ్లర్టింగ్ రాజా అని అనుకుంటూ అటూఇటూ తిరుగుతుంది. అప్పుడే రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ కాదమ్మా ఇంత విషం ఇవ్వు. ఈ టెన్షన్, బాధ తట్టుకోలేకపోతున్నానని ప్రేమ అంటుంది. నువ్వు ధీరజ్ ను పెళ్లి చేసుకోని 8 నెలల అవుతుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా చనిపోవాలనే ఆలోచన వచ్చింది. ధీరజ్ నిన్ను అలా చూసుకున్నాడని రేవతి చెప్తుంది.
మనసు నిండా ధీరజ్
నీ మనసు నిండా ధీరజ్ ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు వదిలేసుకుని వచ్చావ్? ధీరజ్ చేసిన దాంట్లో తప్పేం ఉంది. నీకు జరిగిందే కదా ధీరజ్ చెప్పాడు. నువ్వు చేస్తే తప్పు లేదు కానీ ధీరజ్ మాట్లాడితే తప్పు వచ్చిందా? ధీరజ్ కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఏ విషయాన్ని దాచడు. కానీ నిన్ను పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు దాచాడు? నీ గౌరవం కోసమే అని ప్రేమకు అర్థమయ్యేలా రేవతి చెప్తుంది.
మీ నాన్న నాతో చాలా సార్లు గొడవపడ్డాడు. నేను అర్థం చేసుకున్నా కానీ బంధాన్ని తెంచుకోలేదు కదా. ఇష్టం లేకపోయినా వాళ్ల అమ్మ కోసం నీ మెడలో ధీరజ్ తాళి కట్టాడు. నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడని రేవతి చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


