Illu Illalu Pillalu August 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- నీ కాల్ డేటా మొత్తం తీస్తా- శ్రీవల్లికి నర్మద వార్నింగ్
Illu Illalu Pillalu Serial August 15th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 15వ ఎపిసోడ్‌లో భద్రావతితో శ్రీవల్లి మాట్లాడుతుంటుంది. అది చూసిన నర్మద అత్తకు చెబుతుంది. ఇద్దరు వెళ్లి వల్లిని నిలదీస్తారు. ఫోన్ ఇవ్వమంటే కావాలనే వల్లి పగలగొట్టుకుంటుంది. కాల్ డేటా తీస్తానని నర్మద అంటుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో మీ నాన్న కూడా అందరిమందు నా పరువు తీసేవారు. అలా అని బంధాన్ని విడగొట్టుకోలేదు. ఆ అబ్బాయి తల్లి మాట కోసం ఎంతో చేశాడు. అతని త్యాగం కనబడట్లేదు కానీ ఆవేశంలో అన్న ఒక్క మాటను పట్టుకున్నావు అని ప్రేమకు తల్లి రేవతి నచ్చజెబుతుంది.

నీ ఘనకార్యం గురించేగా మాట్లాడింది
ఏ నీకోసం అంత చేసినవాడు ఒక్క మాట అంటే పడలేవా. అందులోనూ నువ్వు చేసిన ఘనకార్యం గురించేగా తను మాట్లాడింది. మరి తప్పులు నీవైపు పెట్టుకుని అతన్నెందుకే దోషిలా చూస్తున్నావ్. పెళ్లంటే ఎన్ని పెద్ద సమస్యలు వచ్చిన మరింత బలంగా చేసుకుని ముందుకు పోవడం అని రేవతి అంటుంది.
ఆ అబ్బాయి తప్పు లేకున్నా నీకోసం చాలా తగ్గాడు. క్షమాపణ చెప్పేందుకు తలవంచాడు. ఇంకా తలవంచేలా చేయకు. ఒక్కసారి అతని సహనం దెబ్బతిందంటే నువ్వు జీవితంలో అందుకోలేనంతంగా దూరమైపోతాడు. ఇది గుర్తు పెట్టుకో అని కూతురుకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రేవతి. ప్రేమ తనను కొట్టడంపై, అన్న మాటలు తలుచుకుంటూ శ్రీవల్లి కోపంతో రగిలిపోతుంది.
నువ్వు అత్తారింట్లో ఎలా అడుగుపెడతావో నేను చూస్తానే పొట్టి మిరపకాయ్ అని భద్రావతికి కాల్ చేస్తుంది వల్లి. లోక కల్యాణం కోసం, మీకు హెల్పింగ్ చేసేందుకు కాల్ చేశానని వెటకారంగా అంటుంది వల్లి. మీరు బాగా నాటకం ఆడారు కానీ ప్రేమ ఏ క్షణమైన ఈ ఇంట్లో అడుగుపెట్టేందుకు ఆలోచిస్తుంది. నేను ప్రేమతో మాట్లాడినప్పుడు ఏం అందో తెలుసా అని జరిగింది చెబుతుంది శ్రీవల్లి.
మాటవరసకైనా నాకు భయపడవే
బల్లక్కాయ్ ఫోన్ మాట్లాడటం చూస్తుంది నర్మద. ఇది ఎవరితో అంత సీరియస్‌గా మాట్లాడుతుందని డౌట్ పడుతుంది. అటుగా వేదవతి వెళ్తుంటే నర్మద పిలిచి చూపిస్తుంది. తన భర్తతో మాట్లాడుతున్నట్టుందని వేదవతి అంటుంది. దాంతో నర్మద సెటైర్లు వేస్తుంది. మాటవరసకైనా నాకు భయపడవే అని వేదవతి అంటుంది. మొగుడితో అంత సీరియస్‌గా మాట్లాడుతుందా అని నర్మద అంటుంది.
అవును, నేను కూడా మా ఆయనతో మాట్లాడేటప్పుడు తెగ సిగ్గుపడిపోతానని వేదవతి సిగ్గుపడుతుంది. మీ సిగ్గుకో దండం. ఆ మిడత మీ భద్రావతి అక్కతో మాట్లాడుతుందేమో అని నాకు డౌట్‌గా ఉందంటుంది నర్మద. దాంతో వేదవతి దాని గూప పగలగొడతానంటుంది. నర్మద ఆపుతుంది. నువ్వు చెప్పినప్పటినుంచి ఇదంటేనా నా రక్తం మరిగిపోతుంది అని వేదవతి అంటుంది.
కన్ఫర్మ్ చేసుకుందామని భద్రావతి నెంబర్ తెలుసుకుని కాల్ చేస్తుంది. భద్రావతి కాల్ కూడా వెయిటింగ్ వస్తుంది. ఇది మీ అక్కతోనే అని నర్మద అంటుంది. నర్మద, వేదవతి లోపలికి వెళ్తారు. ప్రేమ, ధీరజ్‌ల గురించి మాట్లాడుతూ నర్మద, వేదవతి ఇద్దరిని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. కాల్ కట్ చేస్తుంది వల్లి. ఎంత పొగరు దీనికి, మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తుందని మళ్లీ కాల్ చేస్తుంది భద్రావతి.
ఫోన్ కిందపడేసిన వల్లి
వల్లి కట్ చేస్తుంది. నర్మద ఫోన్ మాట్లాడమంటే.. తర్వాత మాట్లాడతానని, ఎందుకు వచ్చారో చెప్పండని వల్లి అంటుంది. భద్రావతి మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంది. వేదవతి కూడా కోపంగా మాట్లాడమంటుంది. దాంతో వల్లి లిఫ్ట్ చేసి అమ్మా, నేను తిన్నాను. మా అత్త, చెల్లాయి వచ్చారని హింట్ ఇస్తుంది. సరేనని భద్రావతి అంటుంది. తల్లి ఫోన్ చేసినట్లు వల్లి చెబుతుంది.
ఓసారి నీ ఫోన్ ఇవ్వు, మీ అమ్మ నెంబర్ చూద్దామని నర్మద అడుగుతుంది. నేను మాట్లాడింది మా అమ్మతోనే ఒట్టు అంటుంది వల్లి. వేదవతి తిడుతుంది ఫోన్ ఇవ్వమని. నర్మద వల్లి ఫోన్ లాక్కుంటుంది. లాక్ ఓపెన్ చేసి ఇవ్వమని నర్మద తిరిగి ఇస్తుంది. లాక్ ఓపెన్ చేసినట్లు చేసి నర్మదకు ఫోన్ ఇస్తూ కావాలనే కిందపడేస్తుంది వల్లి.
అయ్యో నా ఫోన్ పట్టుకోకుండా కింద పడేస్తావా అని నర్మదపైనే నింద వేస్తుంది వల్లి. వేదవతి కోప్పడుతుంది. ఎంత ఖిలాడీవే నువ్వు. కావాలనే కింద పడేసి నర్మదను అంటావా అని వేదవతి అంటుంది. ఫోన్ కింద పడేశాను. నెంబర్ తెలియదనుకున్నావా. నీ కాల్ డేటా మొత్తం తీసుకొస్తా. నువ్వు మీ అమ్మతో మాట్లాడావో ఇంకా ఏ బొమ్మతో మాట్లాడావో అంతా తేలుస్తానని నర్మద అంటుంది.
లంచం డబ్బుతో సాగర్
భద్రావతితో మాట్లాడినట్లు తెలిస్తే నన్ను తన్ని తరిమేయడం గ్యారెంటీ అని శ్రీవల్లి భయపడుతుంది. తర్వాత సాగర్ లంచం డబ్బుతో ఇంటికి వస్తాడు. నర్మద చూడకుండా డబ్బు దాచాలనుకుంటాడు. డబ్బు తీసి ఎక్కడ దాచిపెట్టాలని ఆలోచిస్తాడు. డబ్బులు సంపాదించడమే అనుకున్నా దాచిపెట్టడం కూడా కష్టమే అనుకుంటాడు సాగర్.
ఇంతలో నర్మద వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. చేతిలో ఉన్న డబ్బులు కింద చేయిజారి పడతాయి. అవి చూసి నర్మద షాక్ అవుతుంది. అంత డబ్బెక్కడదని, ఒకేసారి ఎలా వచ్చిందని అడుగుతుంది. సాగర్ నీళ్లు నములుతాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులని, మన పెళ్లికి ముందు చేశానని, నిన్ను సర్‌ప్రైజ్ చేద్దామని చెప్పలేదని సాగర్ అంటాడు.
నీ వ్యవహారం తేడాగా ఉంది. ఎఫ్‌డీ చేసిన డ్యాక్యుమెంట్ చూపించు అని నర్మద అడుగుతుంది. ఏదోటి చెప్పి కవర్ చేస్తాడు. దొంగలా అనుమానిస్తావేంటీ అని సాగర్ అంటాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వేనని నర్మద అంటుంది. అవి ఎఫ్‌డీ డబ్బులు డాక్యుమెంట్స్ తర్వాత చూపిస్తానంటాడు సాగర్. తర్వాత మల్లెపూలు తీసి నర్మదకు పెడతాడు సాగర్.
ఏమార్చిన సాగర్
నర్మద మురిసిపోతుంది. లంచం డబ్బులు బయటపడటంతో ఏమార్చడానికి మల్లెపూలతో నర్మదను మ్యానేజ్ చేస్తాడు సాగర్. ఇద్దరు రొమాంటిక్‌గా క్లోజ్ అవుతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


