Illu Illalu Pillalu August 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- గుడిలో ప్రేమకు వల్లి కుట్ర చెబుదామన్న నర్మద- విశ్వ స్కెచ్

Illu Illalu Pillalu Serial August 8th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 8వ ఎపిసోడ్‌లో ఈ ఏడాది గుడికి వెళ్లొద్దని సేనాపతి అంటే.. నర్మద బాధ పోగొట్టేందుకు వెళ్లాలని రెచ్చగొడుతుంది భద్రావతి. ప్రేమ క్లాస్ ఉందని రానంటుంది. ప్రేమను ఇంటికి తీసుకొచ్చేందుకు నర్మద ప్లాన్ చేస్తే వల్లి వింటుంది.

Published on: Aug 8, 2026, 09:08:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ ప్రేమను విడగొట్టడానికి భద్రావతి కుట్ర చేసిందని అక్కతో అంటుంది వేదవతి. ఆరోజు ప్రేమ జీవితం మీద మచ్చ పడితే నా పుట్టింటివాళ్లు ఆ అవమానం తట్టుకోలేరని మీ ప్రాణాల గురించి ఆలోచించాను. నిజంగా మీరిపోతే ఈ చెల్లెలిని అర్థం చేసుకునేవాళ్లు అని వేదవతి అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 8వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 8వ ఎపిసోడ్

నా కోడలు నా ఇంటికి వస్తుంది

అయితే, ఇప్పుడు ఏంటని భద్రావతి అంటుంది. ప్రేమ నా కోడలు. ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ, ఏదో ఒక రోజు నా కోడలు నా ఇంటికి వస్తుందని వేదవతి అంటుంది. నీ మొహం ఇందాక ప్రేమ చెప్పిందిగా అది జరగదని భద్రావతి వెళ్లిపోతుంది. నా కోడలు నా ఇంటికి రాకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను అని వేదవతి ఛాలెంజ్ చేసి వెళ్తుంది.

భద్రావతి కాస్తా ఆలోచనల్లో పడుతుంది. ఈ సంవత్సరం గుడికి వెళ్లొద్దని సేనాపతి అంటాడు. ఆ కూలోడి కుటుంబం వస్తుంది, ధీరజ్ గాడు నన్ను కొట్టినట్లు హేళన చేస్తాడు. అలా చేస్తే నా కూతురు తట్టుకోలేదు. గుడికి ఎందుకు నా కూతురు బాధపడటం ఎందుకు అని సేనాపతి అంటాడు. ఆ ధీరజ్ తన జోలికి వెళ్తేనే అంటాడు. ఆరోజు కూడా నువ్వు అని శారదాంబ అంటుంటే.. భద్రావతి ఆపుతుంది.

అవమానిస్తే భరిద్దాం. ఈరోజు ప్రేమ కోసం గుడికి వెళ్దాం. ధీరజ్ పెట్టిన బాధనుంచి ప్రేమను బయటకు తెచ్చుకోవాలి. పాత ప్రేమలా మార్చుకోవాలి. గుడికి తీసుకెళ్తే ఆ వాతావరణానికి కాస్తా ప్రశాంతంగా ఉంటుందిగా. ప్రేమ ఏమంటావ్ అని భద్రావతి అంటుంది. నేను గుడికి రాను. ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అని ప్రేమ అంటుంది. నువ్వు భయపడి రాలేదనుకుంటాడని భద్రావతి అంటుంది.

క్లాస్ ఉంది అంతే

నా చిన్నమనవడు అలాంటివాడేం కాదు భార్య రాలేదని బాధపడతాడు అని శారద అంటుంది. నేను ఎవరికి భయపడట్లేదు. నాకు క్లాస్ ఉందని వెళ్లిపోతుంది ప్రేమ. ఇప్పుడు ప్రేమ గుడికి రానంటుంది ఏం చేయాలని విశ్వ ఆలోచిస్తాడు. మరోవైపు రామరాజు రెండు బ్యాగులతో వస్తాడు. మావయ్య బోలెడంత భోజనం తెచ్చుకున్నట్లు ఉన్నారు అని శ్రీవల్లి అంటుంది.

రామరాజు దగ్గరికి వెళ్లి చాలా బాధగా ఉందని, అత్తయ్య గారి చేతి వంటే తింటారు. అలాంటిది రోజు ఇలా బయట భోజనం తెచ్చుకుంటే ఎలా. చూస్తుంటే బిర్యానీ తెచ్చినట్లున్నారు. రండి వడ్డిస్తాను అని శ్రీవల్లి అంటుంది. ఇది భోజనం కాదు అమ్మవారి చీర, ఇంటి సాంప్రదాయం ప్రకారం గుడికి వెళ్లడం గురించి రామరాజు చెబుతాడు.

అమూల్యను పిలిచి ఇది అమ్మవారి చీర, ఇంట్లో మహాలక్ష్మీ వ్రతం కోసం గోల్డ్ చైన్ తీసుకున్నాని చెప్పి ఇస్తాడు. ఆయన ఏది తెచ్చిన నాకిస్తారు, ఇప్పుడు బాధగా ఉందని వేదవతి అనుకుంటుంది. గోల్డ్ చైన్ అమ్మకు ఇవ్వమని అమూల్యకు చెబుతాడు రామరాజు. మీరెప్పుడు ఇస్తే అప్పుడే వేసుకుంటానని వేదవతి అంటుంది. అయితే, ఎప్పుడు జీవితాంతం బీరువాలోనే ఉంటుందని రామరాజు అంటాడు.

శ్రీవల్లికి గోల్డ్ చైన్

అయితే నాకు అక్కర్లేదని వేదవతి అంటుంది. శ్రీవల్లికి కూడా గోల్డ్ చైన్ ఇస్తాడు రామరాజు. దాంతో రామరాజు కాళ్లపై పడుతుంది వల్లి. అతి వినయం ధూర్త లక్షణం అని నర్మద కౌంటర్ ఇస్తుంది. తర్వాత నర్మదకు ఇస్తాడు రామరాజు. సాగర్ చూసి బుద్ధుందా. వాళ్ల నగలు తీసుకోవడం ఏంటని అంటాడు సాగర్. అంత రోషం ఉంటే తాకట్టు పెట్టిన నగలు తీసుకురమ్మను అని రామరాజు పంచ్ ఇస్తాడు.

తర్వాత ధీరజ్‌కు గోల్డ్ చైన్ ఇచ్చి ప్రేమకు ఇవ్వమంటాడు రామరాజు. రేపు గుడికి వస్తుందిగా అప్పుడు ఇవ్వమంటాడు. నీ చేతులతో గోల్డ్ చైన్ మెడలో వేయమని చందుతో అంటుంది వల్లి. తండ్రి కూడా వారించడంతో శ్రీవల్లి మెడలో చందు గోల్డ్ చైన్ వేస్తాడు. రామరాజు ఇంట్లో తినను అని వెళ్లిపోతాడు. రేపు నేను గుడికి రాను వెళ్లండని వేదవతి అంటుంది.

మీరు నాతో రండి, ధీరజ్ నువ్వు కూడా రా అని తీసుకెళ్తుంది నర్మద. ఏం ప్లాన్ చేస్తున్నావని వల్లి అనుకుంటుంది. రేపు గుడికి రాకుంటే ప్రేమను తీసుకొచ్చే బంగారు అవకాశం పోతుందని నర్మద అంటుంది. మీ అన్నయ్య మిమ్మల్ని అన్న మాటలు ప్రేమకు తెలుసా. తర్వాత ఎవరైనా చెప్పారా. రేపు గుడిలో మీ అక్క చూడకుండా ప్రేమను తీసుకెళ్లి మాట్లాడుదాం అని నర్మద అంటుంది.

ప్రేమను ఇంటికి తీసుకొచ్చేలా నర్మద ప్లాన్

కావాలనే గొడవ పెట్టుకున్నారనే విషయాన్ని ప్రేమకు అర్థమయ్యేలా చెబుదామని, మీ అక్క వాళ్లకు కల్యాణ్ గాడి విషయం ముందే తెలుసని చెబుదామని నర్మద అంటుంది. ఆ మాటలు వల్లి విని షాక్ అవుతుంది. ఆధారాలు అడిగితే ప్రేమకు ఏం చెబుతామని వేదవతి అంటుంది. దీనికి కర్త కర్మ క్రియ అంతా వల్లినే అని ప్రేమకు చెబుదామని నర్మద అంటుంది.

అయ్యబాబోయ్ ఈ సునామీ నా మీదకు దూకిందిగా అని వల్లి భయపడుతుంది. మన మీద పగతో వల్లి ఇదంతా చేసిందని, ఇదంతా వల్లి చేసిందని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని చెబుతాం. మనం చెబితే ప్రేమ వింటుందని, ప్రేమ తిరిగి వస్తుందని నర్మద అంటుంది. వేదవతి సరే అని గుడికి వస్తానంటుంది. అదంతా విన్న శ్రీవల్లి వణికిపోతుంది.

దీనికి ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుంది వల్లి. తర్వాత అమూల్యకు విశ్వ కాల్ చేస్తాడు. భోజనం చేశావా అని అడిగితే అమూల్య సెటైర్లు వేస్తుంది. తర్వాత రేపు గుడికి మా చెల్లి రాదంటా అని క్లాస్ ఉందని చెప్పిందని విశ్వ అంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు మా వదిన గుడికి రావాలని కాల్ కట్ చేస్తుంది అమూల్య. దాంతో విశ్వ ఏం చేయాలని ఆలోచిస్తాడు.

ప్రేమను ఆపేలా విశ్వ స్కెచ్

హా ఎస్ అని అనుకుంటాడు విశ్వ. మరుసటి రోజు ఉదయం ప్రేమ కోసం ఎదురుచూస్తుంటాడు విశ్వ. భద్రావతి ఎంత పిలిచిన వినిపించుకోడు. గుడికి టైమ్ అవుతుందిరా త్వరగా రా అని భద్రావతి అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More