Illu Illalu Pillalu August 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమకు మరో పెళ్లి- భద్రావతి సైకోయిజం- నర్మద మాటలు ఫెయిల్

Illu Illalu Pillalu Serial August 1st Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 1వ ఎపిసోడ్‌లో ప్రేమ అంటూ నిద్రలేచిన ధీరజ్ కలవరిస్తాడు. ప్రేమతో మాట్లాడి కన్విన్స్ చేస్తానని నర్మద చెబుతుంది. ప్రేమకు మరో పెళ్లి చేస్తానని సేనాపతి అంటే.. భద్రావతి కొట్టబోతుంది. దాంతో సేనాపతి షాక్ అవుతాడు.

Published on: Aug 1, 2026, 08:43:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమను ధీరజ్ తీసుకెళ్తుంటే భద్రావతి ఆపుతుంది. ధీరజ్‌ను గెంటేసి ప్రేమను బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది భద్రావతి. ధీరజ్ వస్తుంటే భద్రావతి మొహంపైనే తలుపులు వేస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 1వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 1వ ఎపిసోడ్

ప్రేమ కోసం కలవరించిన ధీరజ్

ప్రేమ అంటూ మంచంపైనుంచి లేచి ప్రేమ ప్రేమ అంటూ అటు ఇటు తిరుగుతాడు. అది నర్మద చూస్తుంది. ప్రేమను భద్రావతి తీసుకెళ్లింది అని ధీరజ్ అంటాడు. ఇప్పుడు తీసుకెళ్లడం ఏంటీ నువ్వే ప్రేమను అని పంపించావ్‌గా అని నర్మద అంటుంది. జరిగింది తలుచుకుని తలపట్టుకుంటాడు. ఇదంతా కల అనుకుంటాడు ధీరజ్.

ప్రేమను ధీరజ్ అన్న మాటలు, వేరొకరితో వెళ్లానంటే ప్రేమ పడే బాధ, నీ మాటలతో నువ్వే దూరం చేసుకున్నావని ధీరజ్‌ను నిందిస్తుంది నర్మద. సేనాపతి మామ అమ్మను ఎన్ని మాటలు అన్నాడో చూశావుగా. ఆ కోపంలో అన్నాను అని ధీరజ్ అంటాడు. ఏదైనా అందరిముందు అలా అంటే ఏ భార్య తట్టుకోదు. అక్కడ ఉంటే ప్రేమను వాళ్లు ఇంకా మారుస్తారు. నేను వెళ్లి ప్రేమను కన్విన్స్ చేస్తాను. నువ్వు కంగారుపడకు అని నర్మద ధైర్యం చెబుతుంది.

మరోవైపు భద్రావతి కుటుంబం అంతా టిఫిన్ చేస్తుంటారు. ప్రేమ మాత్రం ధీరజ్ జ్ఞాపకాల్లో ఉండిపోతుంది. ప్రేమను తినమంటుంది భద్రావతి. భర్తకు దూరంగా ఉన్నందుకు బాధపడుతుందని శారదాంబ అంటుంది. అదో అత్తారిల్లు, వాడో పనికిమాలిన అల్లుడు. వాడికంటే వంద రెట్ల మంచి, రాజా లాంటి సంబంధం చూసి ప్రేమకు పెళ్లి చేస్తానని సేనాపతి అంటాడు.

ప్రేమకు మళ్లీ పెళ్లి చేస్తా

బుద్ధి లేకుండా మాట్లాడకు. దాన్ని అత్తారింటిని తీసుకురావడమే తప్పు అని కొడుకును తిడుతుంది శారదాంబ. రేవతి కూడా అంటుంది. అసలు అది పెళ్లే కాదు. వాడు మొగుడు కాదు. అదో బొమ్మల పెళ్లి. అర్థం లేని పెళ్లికి నా కూతురుని కాపురానికి పంపించాలా అని సేనాపతి అంటాడు. ఎలాంటి పరిస్థితి అయినా వాళ్లకు జరిగింది పెళ్లే. వాళ్లు మొగుడుపెళ్లాలే. వాళ్లది మనసుతో ముడిపడిన పెళ్లి అని శారదాంబ అంటుంది.

తల్లికొడుకులు సేనాపతి, శారద వాదించుకుంటారు. ఆరు నూరు అయినా నూరు ఆరు అయిన సరే నా కూతురుకు ఇంకో పెళ్లి చేసి తీరుతాను. ఇది పక్కా అని సేనాపతి అంటుంది. దాంతో కోపంగా సేనాపతిపై చేయి ఎత్తుతుంది అక్క భద్రావతి. అక్కా నువ్వు కూడా నా మీద చేయి ఎత్తుతావా అని సేనాపతి అంటుంది.

ప్రేమ ఉన్న పరిస్థితి ఏంటీ, నువ్వు అనే మాటలు ఏంటీ. వాడు నీ శరీరంపైనే కొట్టాడు. అవి 4 రోజుల్లో పోతాయి. కానీ, ప్రేమ మనసుపై ధీరజ్ గాడు దెబ్బ కొట్టాడురా. వాడు లేకుంటే ప్రేమకు దిక్కే లేదన్నట్లు మాట్లాడాడు. ఆ మాటలకు ప్రేమ మనసు ఎంత గాయపడి ఉంటుందో. ఎంత నరకం అనుభవిస్తుందో. ఎన్ని రోజులు అయినా సరే ధీరజ్ పెట్టిన బాధ ప్రేమ మనసు నుంచి పోదురా అని మరింత ఎక్కిస్తుంది భద్రావతి.

భద్రావతి సైకోయిజం

ప్రేమ మనసు మారుద్దామురా. ఇంత బాధపెట్టిన ధీరజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రేమకు తెలియదా అని కన్నింగ్‌గా మాట్లాడుతుంది భద్రావతి. ప్రేమకు తినిపిస్తానంటే నాకు వద్దని వెళ్లిపోతుంది ప్రేమ. భద్రావతి మాత్రం సైకోలా నవ్వుతుంది. ప్రేమకు నర్మద కాల్ చేస్తుంది. బయటకు రా. వెయిట్ చేస్తున్నానని నర్మద అని కాల్ కట్ చేస్తుంది.

మరోవైపు అమూల్యను రామరాజు కాఫీ అడిగితే.. వేదవతి వచ్చి కాఫీ ఇస్తుంది. రామరాజు తీసుకోకుండా జరిగింది గుర్తు చేసుకుంటాడు. అమూల్య అంటూ గట్టిగా అరుస్తాడు. కాఫీ అడిగానుగా వినపడలేదా అంటాడు. రూమ్‌లో ఉన్నా వినపడలేదంటుంది అమూల్య. ఇప్పుడు వినిపించిందిగా. కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు రామరాజు.

దాంతో భయంగా వెళ్లిపోతుంది అమూల్య. దానికి సరిగా కాఫీ పెట్టరాదండి. మీరు తాగలేరు అని వేదవతి అంటుంది. విషంలా ఉన్నా తాగుతానని రామరాజు అంటాడు. విషంలాంటి రిస్కులు ఎందుకండి. తేడా వస్తే బాత్రూమ్‌కి పరిగెత్తాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం గురించి ఆలోచించి చెబుతున్నాను అని వేదవతి అంటుంది. ఇంతలో అమూల్య వచ్చి కాఫీ ఇస్తుంది.

విషంలాంటి కాఫీ

కాఫీ తాగి మొహం అదోలా పెడతాడు రామరాజు. నేను చెప్పానుగా. ఇది తీసుకోండని వేదవతి అంటుంది. దాంతో కోపంగా విషంలాంటి కాఫీ తాగి వెళ్లిపోతాడు. నిన్ను కాలేజీకి వెళ్లమన్నాగా అని వేదవతి అంటే.. సండే రోజు కాలేజ్ ఎందుకుంటది. మొగుడు పెళ్లాల మధ్య నేను చస్తున్నాను అని అమూల్య వెళ్లిపోతుంది. ఈయన ఎప్పుడు మాట్లాడతాడో ఏమో అని ఉసూరుమంటుంది వేదవతి.

మరోవైపు నర్మద వచ్చి ప్రేమను కలుస్తుంది. ఏడుస్తూ నర్మదను హగ్ చేసుకుంటుంది ప్రేమ. మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తుంది నర్మద. ఇద్దరు ధీరజ్ చేసిన దాని గురించి మాట్లాడుకుంటారు. తన మనసు గాయపడిందని ప్రేమ చెబుతుంది. ధీరజ్ కోపంలో అన్నాడని నర్మద అంటుంది. నా గురించి అంతా తక్కువ చూస్తారు. కల్యాణ్‌తో వెళ్లినట్లుగానే నన్ను చూస్తారుగా. నాకు గిల్టీగా ఉంటుందిగా అని ప్రేమ అంటుంది.

అంతా మనవాళ్లేగా. కష్టం వస్తే కళ్లల్లో పెట్టుకుని చూస్తారు. పదా ఇంటికి వెళ్దామని నర్మద అంటుంది. రానని ప్రేమ అంటుంది. భరించలేని బాధతో వచ్చా. ఇప్పటికీ అదే మోస్తున్నా అని ప్రేమ అంటుంది. భర్తతో, అత్తారింటితో బంధాన్ని తెంచేసుకుంటావా అని నర్మద అడుగుతుంది. ఎలా వస్తాను. ధీరజ్‌తో ఇంతకుముందులా ఎలా ఉంటాను. నా బాధ నీకు అర్థం కావట్లేదని ప్రేమ అంటుంది.

నర్మద మాటలు ఫెయిల్

నాకు జీవితాన్ని ఇచ్చినట్లు ఎందుకు మాట్లాడని ప్రేమ అంటుంది. నర్మద ఎంత చెప్పిన ప్రేమ వినదు. నీ మరిదిని వెనుకేసుకునేందుకు రాకు అని కోపంగా వెళ్తుంది ప్రేమ. నర్మద ఎంత ఆగమన్నా ఆగదు. రామరాజు గుమ్మంవైపే చూస్తుంటాడు. అమూల్యను తిట్టి టిఫిన్ తినడానికి పిలవచ్చుగా అంటుంది వేదవతి. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More