OTT: ఓటీటీలోకి ఎమోషనల్ హిట్ మూవీ- 8.2 రేటింగ్- తాత ప్రేమ కోసం పాకిస్థాన్ వెళ్లే మనవడు- థియేటర్లలో ఏడ్చిన ఆడియెన్స్!
Main Vaapas Aaunga OTT Streaming: థియేటర్లలో ప్రేక్షకులను కంటినీరు పెట్టించిన ఫీల్ గుడ్ లవ్ డ్రామా మై వాపస్ ఆవుంగా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. తాత ప్రేమ కోసం పాకిస్థాన్ వెళ్లే మనవడి కథగా వచ్చిన ఈ సినిమాకు 8.2 రేటింగ్ ఉంది. ఇలాంటి మై వాపస్ ఆవుంగా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Main Vaapas Aaunga OTT Release: థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టిన ఇంతియాజ్ అలీ ఎమోషనల్ లవ్ డ్రామా 'మై వాపస్ ఆవుంగా' (Main Waapas Aaunga) ఓటీటీ వినోదానికి సిద్ధమైంది. జూన్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసి మంచి విజయాన్ని అందుకుంది.

దేశ విభజన నేపథ్యంతో సాగే ఎమోషనల్ డ్రామా
'మై వాపస్ ఆవుంగా' కథాంశం దేశ విభజన (Partition) సమయంలో విడిపోయిన ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. శతాబ్దాల నాటి ప్రేమకథలకు కొత్త నిర్వచనం ఇచ్చేలా ఇంతియాజ్ అలీ ఈ చిత్రాన్ని మలిచారు. ఇందులో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషించగా, ఆయన మనవడి పాత్రలో సింగర్, నటుడు దిల్‌జీత్ దొసాంజ్ అద్భుతమైన నటన కనబరిచారు.
తాత ఆశయాన్ని నెరవేర్చడానికి, సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లే మనవడి ప్రయాణమే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నసీరుద్దీన్ షా చిన్నప్పటి పాత్రలో వేదాంగ్ రైనా నటించగా, ఆయన ప్రేమికురాలిగా శార్వరి వాఘ్ ఒదిగిపోయారు. తాత పాత్ర ద్వారానే కథంతా ముందుకు సాగుతూ వీక్షకులకు కళ్లు చెమర్చే అనుభూతిని కలిగిస్తుంది.
థియేటర్లలో ప్రేక్షకుల కన్నీళ్లు.. ఇంతియాజ్ సర్‌ప్రైజ్ విజిట్స్
మై వాపస్ ఆవుంగా సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దర్శకుడు ఇంతియాజ్ అలీ స్వయంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న థియేటర్లను సందర్శించి ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూశారు.
"ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయి కంటతడి పెట్టుకోవడం ఒక దర్శకుడిగా నాకు లభించిన అతిపెద్ద పురస్కారం" అని పలు సందర్భాల్లో డైరెక్టర్ ఇంతియాజ్ అలీ వ్యక్తపరిచారు. ఈ చిత్రంలో కథతో పాటు సంగీతం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్ల కలెక్షన్లు
బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే, 'మై వాపస్ ఆవుంగా' కలెక్షన్ల పరంగా రికార్డు స్థాయి ఫలితాన్ని సాధించింది. భారతదేశంలో ఈ సినిమా నికరంగా (Net Collection) రూ.64.65 కోట్లు వసూలు చేసింది. మొదటి వారంలో రూ.12.25 కోట్లు సాధించిన ఈ చిత్రం, రెండో వారంలో మరింత పుంజుకుని రూ.22.55 కోట్లు రాబట్టింది.
మూడో వారంలో రూ.17.45 కోట్లు, నాలుగో వారంలో రూ.7.85 కోట్లు, ఐదో వారంలో రూ.3.02 కోట్లు, ఆరో వారంలో రూ.1.32 కోట్లు వసూలు చేసింది. ఇక 43వ రోజు రూ.7 లక్షలు, 44వ రోజు రూ.16 లక్షలు రాబట్టింది. మన దేశంలో మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ.70.17 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.90.47 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగానే కాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.2 రేటింగ్‌ను సొంతం చేసుకుంది ఎమోషనల్ హిట్ మూవీ మై వాపస్ ఆవుంగా. ఇలాంటి మై వాపస్ ఆవుంగా ఓటీటీలోకి వచ్చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా మై వాపస్ ఆవుంగా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
మై వాపస్ ఆవుంగా ఓటీటీ స్ట్రీమింగ్
ఆగస్ట్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో మై వాపస్ ఆవుంగా ఓటీటీ రిలీజ్ అవనుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు, మరోసారి ఈ క్లాసిక్ లవ్ స్టోరీని చూడాలనుకునేవారు ఆగస్టు 7 నుంచి హ్యాపీగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మై వాపస్ ఆవుంగా సినిమా వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


