Illu Illalu Pillalu September 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భద్రావతి బ్లాక్ మెయిల్-ప్రేమ సంచలన నిర్ణయం-భాగ్యం షాక్
Illu Illalu Pillalu September 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 15 ఎపిసోడ్ లో ప్రేమను భద్రావతి కొడుతుంది. ప్రేమ సంచలన నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు భాగ్యం, ఇడ్లీ బాబాయిని చింతామణి చితక్కొడుతుంది. ఇక ప్రేమ, ధీరజ్ ను కలిపేందుకు నర్మద, సాగర్ వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
Illu Illalu Pillalu September 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తిరుపతి, సుకన్యల పెళ్లి చేసిన ధీరజ్ పై రామరాజు ఫైర్ అవుతాడు. ముందు ధీరజ్ ను సంసారం చక్కదిద్దుకోమని చెప్తాడు. వేదవతి కూడా అదే విషయం చెప్తుంది. ప్రేమను ఇరికించావని అంటుంది.

ప్రేమకు చెంపదెబ్బ
మరోవైపు భద్రావతి ఇంట్లో ప్రేమను దోషిలా నిలబెడతారు. ప్రేమను భద్రావతి చెంపపై కొడుతుంది. ఈ లోకంలో ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాదేమో. చిన్న కూతురు కళ్ల ముందే ఉన్నా పుట్టింటికి వచ్చి పోయే అవకాశం లేదని బాధపడ్డా. ఇప్పుడు చిన్న కొడుకును గెంటేశారని శారదాంబ ఫీల్ అవుతుంది.
నిజం ఒప్పుకొన్న ప్రేమ
అప్పుడే భద్రావతి కోపంతో ఊగిపోతుంది. ప్రేమ మా నాశనాన్ని కోరుకుంటున్నావా? నీ తీరు అలాగే ఉందని భద్రావతి అంటుంది. ధీరజ్ అంతు చూసేవాడిని కానీ నీ కూతురే దగ్గరుండి పెళ్లి చేసిందనేసరికి తల దించుకోవాల్సి వచ్చిందని సేనాపతి అగ్నికి ఆజ్యం పోస్తాడు. ఆ రోజు ధీరజ్ తో కలిసి వెళ్లి సంబంధం చెడగొట్టింది నువ్వేనా అని భద్రావతి అడిగేసరికి ప్రేమ నిజం ఒప్పుకుంటుంది.
రెచ్చగొట్టిన భద్రావతి
మేమంటే ఎందుకు అంత కోపం? మేం ఏ పాపం చేశామని అని భద్రావతి సీరియస్ అవుతుంది. మాతో చెప్పలేదు కానీ వాడితో వెళ్లి పెళ్లి చేశావ్. వాడి దగ్గరికే వెళ్లిపో అని భద్రావతి చెప్తుంది. కళ్యాణ్ తో లేచిపోయావని నవ్వుల పాలు చేయలేదా అని మరోసారి గతాన్ని గుర్తు చేసి ప్రేమను భద్రావతి రెచ్చగొడుతుంది.
ప్రేమ సంచలన నిర్ణయం
ధీరజ్ మా పరువు తీస్తూనే ఉంటాడు. ఆ రోజు వాడు ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తే మేం గుండెల్లో పెట్టుకున్నాం. మరోసారి వాడు పరువు తీస్తే మేం బతకలేం. పదరా సేనా చచ్చిపోదామని భద్రావతి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ధీరజ్ మరోసారి మన కుటుంబం పరువు తీసేలా ప్రవర్తిస్తే నేను ఈ జన్మలో వాడి జీవితంలోకి వెళ్లనని ప్రేమ సంచలన నిర్ణయం తీసుకుంటుంది. అత్తకు మాటిస్తుంది.
చితక్కొట్టిన చింతామణి
సీన్ భాగ్యం ఇంటికి మారుతుంది. అప్పటికే భాగ్యం, ఇడ్లీ బాబాయిని చింతామణి చెడుగుడు ఆడేస్తుంది. నా కూతురి ఎంగేజ్మెంట్ ను ఆపుతారా? పెళ్లి కొడుకును తీసుకెళ్లి మీ మేనకోడలితో పెళ్లి చేస్తారా? అని చింతామణి ఫైర్ అవుతుంది. భార్య వెనుకాలకు వెళ్లి ఇడ్లీ బాబాయి దాక్కుంటాడు. ఇడ్లీ బాబాయిని బెల్ట్ తో చింతామణి కొడుతుంది.
షాకింగ్ ఎంట్రీ
పెళ్లి కూతురు మీ అమ్మాయి అనే విషయం మాకు తెలీదు. తిరుపతి, సుకన్య ప్రేమించుకున్న విషయం కూడా మాకు తెలియదు అని భాగ్యం అబద్ధాలు చెప్తుంది. పెళ్లి విషయంలో మాకు సంబంధం ఉంటే వాళ్లు మా పక్కనే ఉండేవాళ్లు కదా అని ఇడ్లీ బాబాయి, భాగ్యం చెప్తుండగానే.. వచ్చేశామంటూ తిరుపతి, సుక్కు షాకింగ్ ఎంట్రీ ఇస్తారు.
యవ్వారం తేడా కొట్టేసిందని భాగ్యం, ఇడ్లీ బాబాయి అనుకుంటారు. ఇద్దరి చెంపలను చింతామణి పగలగొట్టి వెళ్లిపోతుంది. సుక్కు, తిరుపతికి హారతినిచ్చి భాగ్యం లోపలికి రమ్మంటుంది. భాగ్యాన్ని చింతామణి కొట్టినందుకు ఇడ్లీ బాబాయి తెగ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ధీరజ్, ప్రేమ మీటింగ్
మరోవైపు ధీరజ్, ప్రేమ, నర్మద, సాగర్, అమూల్య, విశ్వ కలిసి మీటింగ్ పెడతారు. ఇంకెంత సేపు సైలెంట్ గా ఉండాలని సాగర్ కోప్పడతాడు. అబ్బా అని ప్రేమ అనగానే.. అబ్బనీ తియ్యని దెబ్బ అని నర్మద, సాగర్ డ్యాన్స్ చేస్తారు. వాళ్లను ఆపిన విశ్వ ఐడియా ఇస్తానంటే వద్దంటారు.
ప్రేమ వార్నింగ్
వీడితో వెళ్తే నా చెంప పగిలింది. వీడికి మనుషులంటే లెక్కలేదని ప్రేమ అంటుంది. ధీరజ్ పంచ్ లు వేస్తుంటే నర్మద నవ్వుతుంది. మధ్యలో నర్మదను ఇరికిస్తాడు ధీరజ్. నా పరువును బజారున పెట్టడం తప్పు కాదా? ఇంకోసారి నా గురించి కానీ, నా వాళ్ల గురించి కానీ ఇంకో మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకు తెలియదని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.
ధీరజ్ హ్యాండ్ వాష్
ప్రేమ, సంబంధం గురించి నర్మద గొప్పగా చెప్తుంది. మామయ్య ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నిన్ను ఇంటికి రమ్మన్నారు. మీ కోపాన్ని పక్కనపెట్టి కలిసిపోండి. ఓ సారి చేయి కలపండని ప్రేమకు నర్మదతో పాటు అందరూ చెప్తారు. ధీరజ్ చేయి అందిస్తే ప్రేమ షేక్ హ్యాండ్ ఇస్తుంది. వెంటనే శానిటైజర్ తో ధీరజ్ ఆ హ్యాండ్ ను వాష్ చేసుకుంటాడు.
వీడికి ఎంత పొగరో చూశావా అక్క? శానిటైజర్ తో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడని ప్రేమ అంటుంది. ధీరజ్, ప్రేమ ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోతారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


