Illu Illalu Pillalu August 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భాగ్యాన్ని వణికించిన చింతామణి- మంట రాజేస్తున్న బల్లక్కాయ్

Illu Illalu Pillalu August 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 19 ఎపిసోడ్ లో ఇటు భద్రావతి, అటు శ్రీవల్లి కలిసి ప్రేమ, ధీరజ్ మధ్య మంటను ఇంకా పెంచుతారు. ఇక భాగ్యానికి చింతామణి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. చెంపపై కొట్టి వణికిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 19, 2026, 07:48:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu August 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. పుట్టింట్లో ప్రేమ, ఇటు ధీరజ్ బాధపడుతూ కూర్చుంటారు. తమ ప్రేమ జ్ణాపకాలను గుర్తు చేసుకుంటుంటారు. ప్రేమను బాధను చూసి భద్రావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ దగ్గరకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

భద్రావతి నాటకం

ప్రేమ నిన్ను ఎలా ఓదార్చాలో? ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నీ చేతి మీద కళ్యాణ్ అని పేరు రాశావని అడిగినందుకు ధీరజ్ అంత నీచంగా మాట్లాడతాడా? కష్టమో ఇష్టమో పెళ్లి చేసుకున్నారు. కలిసి ఉన్నారు. కోపం తగ్గిన తర్వాత ధీరజ్ వచ్చి అడిగితే పంపించేద్దామనుకున్నానని భద్రావతి నాటకం ఆడుతుంది.

ప్రేమను రెచ్చగొట్టేలా

మీ మధ్య జరిగిన గొడవలను అవకాశంగా తీసుకొని వేరు చేయాలని చూడలేదు. ధీరజ్ రోజురోజుకూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నావ్ కదా. కళ్యాణ్ తో లేచిపోయావని ఆ రోజు ఏదో కోపంలో అన్నాడనుకున్నా. కానీ ఈ రోజు నువ్వు చేసిందే అన్నానని చెప్పాడు. అతను గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధపెట్టడం కోసం మాట్లాడాలని అనుకోవాలా? అని ప్రేమను ఇంకా రెచ్చగొడుతుంది భద్రావతి.

నీ భవిష్యత్ ను ఆ ధీరజ్ ఇంకా ఎంత దారుణంగా మారుస్తాడో? నిన్ను ఎంతలా బాధపెడతాడో? అని భయంగా ఉందని చెప్పి భద్రావతి లోపలికి వెళ్లిపోతుంది. ప్రేమ దీర్ఘమైన ఆలోచనలో పడిపోతుంది.

రైస్ మిల్ కు ఇడ్లీ బాబాయ్

మరోవైపు ఇడ్లీ బాబాయ్ ను రైస్ మిల్ కు వెళ్లమని భాగ్యం తొందరపడుతుంది. వెళ్లలేకపోతున్నా భాగ్యం. తరతరాలుగా వస్తున్న ఇడ్లీ బిజినెస్ ను వదల్లేకపోతున్నానని ఇడ్లీ బాబాయ్ అంటాడు. నేను, సుక్కు ఇడ్లీలు అమ్ముతాం కానీ నువ్వు రైస్ మిల్ కు వెళ్లమని భాగ్యం గట్టిగానే చెప్తుంది.

చింతామణి ఎంట్రీ

అప్పుడే కారులో నుంచి ఫైనాన్సియర్ చింతామణి దిగుతుంది. ఆమెను చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఇంట్లోకి పరుగెత్తుకు వెళ్లి డోర్ పెట్టుకోవాలని చూస్తారు. కానీ చింతామణి వదలదు. బయటకు రప్పించి వార్నింగ్ ఇస్తుంది. రూ.3 లక్షలు తీసుకొని మూడేళ్లయింది. గెటప్ మార్చారు. సెటప్ మార్చారు. ఈ ఊర్లో దాక్కుంటే కనిపెట్టలేరనుకున్నారా? అని చింతామణి సీరియస్ గా చెప్తుంది.

బాగోతం మొత్తం తెలుసని

ఇడ్లీ వ్యాపారం కోసం వచ్చామని భాగ్యం అబద్ధం చెప్తుంది. అబద్ధాలు చెప్పకు. నీ చావు తెలివితేటలతో కూతురిని మంచి ఇంటికి కోడలిని చేశావని చింతామణి అనగానే అందరూ షాక్ అవుతారు. నీ బాగోతం మొత్తం తెలుసుకునే వచ్చా. అదంతా ఆ ఇంటికి వెళ్లి చెప్పాలా? వడ్డీతో సహా రూ.6 లక్షలు ఇప్పుడే ఇచ్చేయాలని చింతామణి డిమాండ్ చేస్తుంది.

భాగ్యానికి చెంపదెబ్బ

లోపలికి వెళ్లి భాగ్యం రూ.6 వేలు తీసుకొస్తుంది. అది చూసి చింతామణి కోపంతో ఊగిపోయి భాగ్యాన్ని కొడుతుంది. టైమ్ ఇవ్వమని భాగ్యం అడుగుతుంది. సాయంత్రం వరకల్లా డబ్బులు ఇవ్వాలి. లేదంటే మీ కూతురి ఇంటికి వెళ్లి తేల్చుకుంటానని చింతామణి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. రామరాజు అన్నయ్య ఊర్లో లేడు. రైస్ మిల్ లో డబ్బు కొట్టేయమని భర్తకు భాగ్యం చెప్తుంది.

వల్లిని కొట్టిన చందు

రైస్ మిల్ కు వెళ్లడానికి చందు రెడీ అవుతాడు. కానీ ధీరజ్, ప్రేమ విషయాన్ని తెచ్చి చందును ఆపాలని శ్రీవల్లి చూస్తుంది. కళ్యాణ్ తో లేచిపోయిన విషయాన్నే కదా ధీరజ్ మాట్లాడాడని వల్లి అంటుంది. వెంటనే వల్లి చెంపపై కొడతాడు చందు. ఈ విషయాన్ని తల్లికి చెప్తాడు చందు. వల్లిపై వేదవతి సీరియస్ అవుతుంది. దీంతో వల్లి డ్రామా స్టార్ట్ చేస్తుంది.

కళ్యాణ్ పేరు ఎందుకు?

పెళ్లి విషయంలో నాలుగు అబద్ధాలు ఆడా. రెండు మోసాలు చేశా. దీంతో నన్ను మోసగత్తెగానే చూస్తున్నారని వల్లి ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. తోడేళ్లు సాధు జీవుల్లా మారాయని అంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు కూడా అంతేనని నర్మద అంటుంది. కానీ వల్లి మాత్రం తగ్గదు. ప్రేమ చేతిపై కళ్యాణ్ పేరు ఎందుకు రాశావని ధీరజ్ ను వల్లి అడుగుతుంది.

మంట పెట్టి

నేను రాయలేదని ధీరజ్ అంటాడు. ప్రేమపై కోపం తెచ్చుకునేలా ధీరజ్ ను రెచ్చగొట్టాలని వల్లి చూస్తుంది. ప్రేమ లేచిపోతే తప్పు లేదు కానీ, అదే మాట నువ్వుంటే తప్పు వచ్చిందా అని వల్లి అంటుంది. ఈ మాటలకు వేదవతికి కోపం వస్తుంది. మాట్లాడకమని వార్నింగ్ ఇస్తుంది. ఆ పేరు ఎవరు రాసి ఉండొచ్చని వేదవతి అడుగుతుంది.

మీ అన్నయ్య, అక్క రాసి ఉండొచ్చు. లేదా ప్రేమ రాసుకొని ఉండొచ్చని ధీరజ్ అంటాడు. తనే బంధం తెంచుకునేలా మాట్లాడుతుంది. మాట జారానని ఒప్పుకొన్నా తను వినడం లేదు. నాకు ఓపిక చచ్చిపోయింది. ఇక తన చుట్టూ తిరిగే ఓపిక లేదు. నా లైఫ్ నేను చూసుకుంటానని ధీరజ్ బయటకు వెళ్లిపోతాడు. మనం పెట్టిన మంట ఫుల్ గా అంటుకుందని వల్లి సంబరపడిపోతుంది.

ఫారెన్ కు ప్రేమ

ఇదే విషయాన్ని భద్రావతికి ఫోన్ చేసి చెప్తుంది వల్లి. ప్రేమ కోపానికి ఇంకొంచెం పెట్రోల్ పోయమని భద్రావతికి వల్లి చెప్తుంది. నా కాపురాన్ని కూల్చిన వాళ్ల కాపురం కూల్చితే ఎంత హాయిగా ఉంటుందోనని వల్లి అనుకుంటుంది.

మరోవైపు ప్రేమతో సేనాపతి మాట్లాడతాడు. జరిగినవి మర్చిపోవడానికి ఫారెన్ వెళ్తావా? ఏర్పాట్లు చేయమంటావా? అని ప్రేమను అడుగుతాడు సేనాపతి. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More