Illu Illalu Pillalu September 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ప్రేమ షాకింగ్ నిర్ణయం-పెళ్లికి ఒప్పించాలన్న రామరాజు

Illu Illalu Pillalu September 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 21 ఎపిసోడ్ లో ప్రేమను మాయ మాటలతో భద్రావతి, సేనాపతి రెచ్చగొడతారు. దీంతో జీవితంలో ధీరజ్ దగ్గరకు వెళ్లనని ప్రేమ చెప్తుంది. మరోవైపు పెళ్లికి ప్రేమన ఒప్పించే బాధ్యతను నర్మద, వేదవతికి రామరాజు అప్పగిస్తాడు.

Published on: Sep 21, 2026, 07:51:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu September 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను మాటలతో మాయ చేయాలని భద్రావతి ప్రయత్నిస్తుంది. మన కుటుంబం పరువు ధీరజ్ తీశాడని ప్రేమను రెచ్చగొట్టాలని చూస్తుంది. ధీరజ్ ఆవేశపరుడు కావొచ్చు. కానీ రామరాజు మామయ్య నాటకాలు ఆడరు అత్తయ్య అని ప్రేమ చెప్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

సేనాపతి ఎమోషనల్ డ్రామా

నాలుగు గోడల మధ్య జరిగిన మా పెళ్లి చెల్లదని అన్నారు కాబట్టి మామయ్య మా పెళ్లి చేస్తానన్నారు. నేను, ధీరజ్ కలిసి ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నారు. అది డ్రామా కాదత్తా అని ప్రేమ చెప్పేసరికి భద్రావతి, సేనాపతికి ఫ్యూజలు ఔట్ అవుతాయి. కానీ సేనాపతి ఏమో ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తాడు.

పగతో తీసుకెళ్లాలని

రామరాజు మంచివాడే అయితే భార్య, మామను కొడతావా? అని ధీరజ్ తో మనకు క్షమాపణ చెప్పించేవాడు. అలా చేయకుండా డైరెక్ట్ గా స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారంటే అర్థం ఏంటీ? అని సేనాపతి డ్రామా ఆడతాడు. వాళ్లు నీ మీద ప్రేమతో కాదు, మా మీద పగతో వాళ్ల ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారని భద్రావతి చెప్తుంది. మళ్లీ కళ్యాణ్ తో లేచిపోయిందని ధీరజ్ అన్న మాటలనే గుర్తు చేస్తారు.

ధీరజ్ జీవితంలోకి వెళ్లను

ధీరజ్ అవమానించడని హామీ ఇచ్చావు కదా. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావ్? నువ్వు ఇచ్చిన మాటకు ఏం సమాధానం చెప్తావ్? వాడిని ఇంకా గుడ్డిగా నమ్ముతూ మాకు అవమానాన్ని ఇస్తూనే ఉంటావా? అని భద్రావతి ప్రేమను అడుగుతుంది. ధీరజ్ మళ్లీ తప్పు చేస్తే ఈ జన్మలో వాడి జీవితంలోకి వెళ్లనని మాటిచ్చా. ఆ మాట మీద నిలబడతా. ఇక నేను వాడి జీవితంలోకి వెళ్లనని ప్రేమ సంచలన నిర్ణయం తీసుకుంటుంది.

కామాక్షి హడావుడి

మరోవైపు రామరాజు ఇంట్లో చిన్నోడికి, ప్రేమకు పెళ్లి కదా. అందుకే కావాల్సిన వస్తువులు రాస్తున్నానని కామాక్షి హడావుడి చేస్తుంది. తనకు రెండు పట్టుచీరలు కావాలంటుంది. పెళ్లి కొడుకు బావకు నాలుగు సూట్లు అని తన భర్త కోసం రాసుకుంటుంది కామాక్షి. తను రవ్వల నెక్లెస్ తీసుకుంటానంటుంది.

వేదవతి కంగారు

ఇదంతా చూస్తున్న వేదవతికి చిర్రెత్తుకొస్తుంది. పెళ్లి జరగాలంటే ముందు పెళ్లి కూతురు ఉండాలి. ప్రేమ మనసులో ఏముందో? వాళ్లు ఆ మనసును ఎలా మారుస్తారో తెలియదు కదా అని వేదవతి అంటుంది. ఆవిడ రెచ్చగొట్టిందని ఈయన గారు రెచ్చిపోయి రెండు రోజుల్లో పెళ్లి చేస్తానని సవాలు చేశారు. అలా చేయకపోతే ప్రేమ జోలికి రామని పెద్ద రాయుడిలా చెప్పారని వేదవతి ఫీల్ అవుతూ చెప్తుంది.

ఈ పెళ్లి జరగకపోతే చిన్నోడికి ప్రేమ శాశ్వతంగా దూరమైపోదా? అని వేదవతి కంగారు పడుతుంది. నేను రెచ్చిపోయి సవాలు చేయలేదు. వాళ్ల నోళ్లు మూయించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. రేయ్ చిన్నోడా, అసలు మీ పెళ్లి చెల్లదని వాళ్లు మాటలు అన్నారు. ఊరందరి సమక్షంలో మీ పెళ్లి జరగాలని రామరాజు చెప్తాడు.

నర్మద ఒప్పించాలని

అవసరమైతే ప్రేమను బలవంతంగా తీసుకొచ్చి అయినా మెడలో తాళి కడతానని ధీరజ్ అంటాడు. మీ ఇద్దరి ఇష్టంతోనే పెళ్లి జరగాలని రామరాజు కండీషన్ పెడతాడు. మీ అత్త, నువ్వు కలిసే కదా ఆ రోజు ప్రేమను ఒప్పించారు. ఇప్పుడు కూడా మీరే ఒప్పించాలని నర్మదకు చెప్తాడు రామరాజు. ఛాలెంజ్ లు చేసింది మీరు, ఒప్పించేది మేమా? అని వేదవతి నిట్టూర్చుతుంది.

పెళ్లి చేయాలంటే ముందు మీరు, అత్తయ్య మాట్లాడుకోవాలి కదా అని రామరాజును నర్మద అడుగుతుంది. పెళ్లాన్ని అర్థం చేసుకోలేని మొగుడితో మాట్లాడాలని లేదని వేదవతి అంటుంది. ఈ పెళ్లి జరిగితే మాట్లాడతా. రేపు 10 గంటలకు పంతులు పెళ్లి ముహూర్తం పెట్టాడు. అప్పటివరకల్లా ప్రేమను ఒప్పించాలని రామరాజు చెప్పి వెళ్లిపోతాడు.

నేనంటే ప్రేమ లేదా?

రాత్రి ధీరజ్, ప్రేమ బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. ఇంటికి వచ్చేయమని పోలీస్ స్టేషన్లో అడిగా కదా. మరి ఎందుకు రాలేదు? నేనంటే ప్రేమ లేదా అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే మా ఇంటికి వచ్చి గొడవ చేయవు. నా మీద, మా నాన్న మీద చేయి చేసుకొని మా బంధువుల ముందు మా పరువు తీశావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటావని ప్రేమ అంటుంది.

ప్రేమ ఎమోషనల్

తప్పులన్నీ నువ్వే చేసి నేనే తప్పు చేశానంటావని ప్రేమ చెప్తుంది. మా నాన్న మనకు గ్రాండ్ గా పెళ్లి చేస్తారన్నారు. నువ్వు కోరుకుంది కూడా అదే కదా. మన మధ్య అపార్థాలు రాకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందామని ప్రేమను ధీరజ్ అడుగుతాడు. అందరు అంటే మీ కుటుంబం మాత్రమే కాదు. రెండు కుటుంబాలు. నా మాటకు, నా జీవితానికి విలువ ఉండదా? అని ప్రేమ ఎమోషనల్ అవుతుంది.

పెళ్లికి వస్తావా రావా?

నా బాధ ఏంటో తెలుసుకో. నీ కారణంగా ఎంత కన్నీళ్లు మోస్తున్నానో అర్థం చేసుకో అని ప్రేమ అంటుంది. అవన్నీ వదిలేయ్. నువ్వు పెళ్లికి వస్తావా రావా? మనం హ్యాపీగా కలిసి ఉందామా వద్దా? అని ధీరజ్ డైరెక్ట్ గా అడుగుతాడు. మా అత్తకు మాటిచ్చా. నువ్వు నా నమ్మకాన్ని చంపేశావని ప్రేమ అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More