Illu Illalu Pillalu: బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అదరగొడుతోంది. తెలుగు ప్రజలు ఈ సీరియల్ కు విశేషంగా ఆదరిస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ లో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. రామరాజు కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకునేవాళ్ల కుట్రలను చిత్తు చేస్తూ ఈ సీరియల్ స్టోరీ సాగిపోతోంది. తాజాగా బల్లక్కాయ్ కు ఇలాంటి గతే పట్టింది.
బల్లక్కాయ్ బండారం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లినే ఆ కుటుంబానికి శత్రవుగా మారింది. తోడి కోడళ్లు నర్మద, ప్రేమపై అసూయతో రగిలిపోతూ చేయకూడని కుట్రలు చేసింది. అబద్ధాలు చెప్పింది. మోసాలు చేసింది. చివరకు ధీరజ్, ప్రేమను శాశ్వతంగా విడగొట్టాలనుకుంది. కానీ చివరకు ఆమె బండారం మొత్తం రామరాజుతో సహా అందరికీ తెలిసిపోయింది.
బయటకు గెంటేసి
మోసం చేసి చందును పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి ధీరజ్, ప్రేమను విడగొట్టడం వరకూ బల్లక్కాయ్ అండ్ పేరేంట్స్ చేసిన కుట్రలు రామరాజుకు తెలిసిపోయాయి. దీంతో కోపంతో ఊగిపోయిన రామరాజు.. బల్లక్కాయ్ తల్లిదండ్రులు భాగ్యం, ఇడ్లీ బాబాయిని పిలిపించి మరీ చెంప పగలగొట్టారు. తల్లిదండ్రులతో పాటు బల్లక్కాయ్ ను కూడా బయటకు గెంటేశారు.
బతుకు బస్టాండ్
చేసిన పాపం పండేసరికి బల్లక్కాయ్ బతుకు బస్టాండ్ లా మారింది. ఇప్పుడు పుట్టింట్లో ఏడుస్తూ కూర్చుంది. చందు పేరును గోడపై రాస్తూ కలవరిస్తుంది. మరి ఇన్ని రోజులూ సొంత అత్తారింట్లోనే కుట్రలు చేసినప్పుడు బల్లక్కాయ్ కు ఈ బాధ తెలియలేదేమో. ఇప్పుడు మాత్రం తెగ కుమిలిపోతుంది.
భాగ్యం కన్నింగ్ ప్లాన్
ఇంత జరిగినా, మెడ పట్టుకొని రామరాజు కుటుంబం గెంటేసినా కూడా భాగ్యం బుద్ధి మాత్రం మారడం లేదు. ఆమెకు కొంచెమైనా బుద్ధి రావడం లేదు. తన కూతురిని గెంటేస్తారా అని రామరాజు కుటుంబంపై పగతో భాగ్యం రగిలిపోతుంది. ఈ క్రమంలో తన సొంత కూతురి కోసం గొయ్యి తవ్వుతుందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది.
కేసు పెడితే
{{/usCountry}}ఇంత జరిగినా, మెడ పట్టుకొని రామరాజు కుటుంబం గెంటేసినా కూడా భాగ్యం బుద్ధి మాత్రం మారడం లేదు. ఆమెకు కొంచెమైనా బుద్ధి రావడం లేదు. తన కూతురిని గెంటేస్తారా అని రామరాజు కుటుంబంపై పగతో భాగ్యం రగిలిపోతుంది. ఈ క్రమంలో తన సొంత కూతురి కోసం గొయ్యి తవ్వుతుందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది.
కేసు పెడితే
{{/usCountry}}రామరాజు కుటుంబం మీద కేసు పెడతానని భాగ్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బల్లక్కాయ్ కుటుంబంపై రామరాజు ఫ్యామిలీకి పీకల్లోతు కోపం ఉంది. ఇప్పుడు భాగ్యం కేసు పెడితే ఆ కోపం మరింత ద్వేషంగా మారుతుంది. వల్లి శాశ్వతంగా రామరాజు ఇంటికి దూరమవుతుంది. కానీ ఈ విషయం భాగ్యానికి అర్థం కావడం లేదు.
చేసిన తప్పులు ఒప్పుకొని రామరాజును రిక్వెస్ట్ చేస్తే ఆయన మనసు కరిగే అవకాశం ఉంది. కానీ భాగ్యం మాత్రం పట్టుదలకు పోతుంది. ఈ క్రమంలో తన కూతురి బతుకు అన్యాయమైపోతుందనే విషయాన్ని మాత్రం గమనించలేకపోతుంది.
ఇప్పుడు గనుక భాగ్యం కేసు పెడితే ఈ గొడవ ఇంకా పెద్దగా మారుతుంది. బల్లక్కాయ్ పై రామరాజు కుటుంబం ఇంకా ఫైర్ అవుతుంది. దీంతో అసలుకే ఎసరు వస్తుంది. మరి భాగ్యం తన కన్నింగ్ బుర్రను మార్చుకుంటుందా? బల్లక్కాయ్ ఏం చేస్తుంది? అనేది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.