Illu Illalu Pillalu October 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ధీరజ్ ఎమోషనల్-ఏడ్చేసిన నర్మద-బ‌ల్ల‌క్కాయ్‌ను గెంటేసిన చందు

Illu Illalu Pillalu October 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 6 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వేదవతిని ధీరజ్, రామరాజు ప్రేమగా చూసుకుంటారు. ప్రేమ దగ్గరకు వెళ్లిన నర్మద ఏడ్చేస్తుంది. వల్లిపై చందు ఆవేశంతో ఊగిపోతాడు. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా బయటకు గెంటేస్తాడు.

Published on: Oct 6, 2026, 07:37:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu October 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి తప్పించుకోవడం కోసం అత్త వేదవతిని కిందపడేలా చేస్తుంది. హాస్పిటల్లో వేదవతికి స్పృహ‌ వస్తుంది. కాఫీ పొడి కోసం స్టూల్ ఎక్కి కిందపడ్డా. ఆ తర్వాత జరిగింది గుర్తులేదని వేదవతి అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

రామరాజు ఎమోషనల్

కాఫీ ఇవ్వలేదని బాధపడుతున్నారా అని రామరాజును వేదవతి అడుగుతుంది. నీకు దెబ్బ తగిలిందని బాధపడుతుంటే కాఫీ అంటావేంటని రామరాజు ఎమోషనల్ అవుతాడు. వేదవతి తలకు చిన్న దెబ్బ తగిలిందని, కాలు బెణికిందని డాక్టర్ చెప్తుంది. రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలంటుంది. అత్తయ్యను తాను చూసుకుంటానని వల్లి అంటుంది.

చందు కోపం

అక్కర్లేదు. నువ్వు మా అమ్మను తాకడానికి కూడా వీల్లేదని చందు గట్టిగా అరుస్తాడు. తను తప్పు ఏం మాట్లాడిందని కోప్పడుతున్నావని రామరాజు అనేసరికి చందు సైలెంట్ అవుతాడు. బావకు ఎందుకు అంత కోపం వచ్చిందని వల్లి టెన్షన్ పడుతుంది. ఏడుస్తున్న ధీరజ్ ను వేదవతి ఓదార్చుతుంది. చిన్నోడికి ఈ అమ్మ అంటే ప్రాణం. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడని వేదవతి అంటుంది.

ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక్క రోజులోనే పరుగులు పెడతానని వేదవతి అంటుంది. నా భార్యను నేనే చూసుకుంటా. ఇంతమంది ఉండి నా భార్యను పడగొట్టారని రామరాజు కోపంతో అంటాడు. వేదవతి చేయిని భుజాలపై వేసుకొని ఇంటికి తీసుకొస్తాడు రామరాజు.

ఏడ్చేసిన శారదాంబ

రాత్రి వేదవతిని చూసేందుకు శారదాంబ, విశ్వ వస్తారు. మేనత్తకు దెబ్బ తగిలిందని ఎందుకు కాల్ చేయలేదని అమూల్యను విశ్వ అడుగుతాడు. ఇక శారదాంబ ఏడుస్తుంది. చిన్న దెబ్బేనని వేదవతి అంటుంది. చిన్న కొడుకు పెళ్లి జరిగిందని దిష్టి తగిలినట్లు ఉంది. ఇది మంచికేనమ్మా అని వేదవతి అంటుంది. అప్పుడే రామరాజు వచ్చి టాబ్లెట్ ఇస్తాడు.

ధీరజ్, రామరాజు ప్రేమ

ఆ సీన్ చూసి శారదాంబ ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావ్ కాబట్టి మా అమ్మాయి పుట్టింటిని మర్చిపోయిందని శారదాంబ అంటుంది. ప్రేమించడమే కాదు బాధపెట్టడమూ తెలుసని వేదవతి అంటుంది. ఈ సారి మామయ్య మాట్లాడకపోతే నాకు చెప్పత్తా, వచ్చి రాజీ కుదుర్చుతానని విశ్వ మధ్యలో మాట్లాడతాడు.

నువ్వు ఎప్పుడు మారిపోయావ్ అని చాప, దిండు తీసుకొని వచ్చిన ధీరజ్ అడుగుతాడు. అది వేరే సంగతి కానీ నువ్వు చాప, దిండు తీసుకొని వచ్చావేంటని రామరాజు అడుగుతాడు. అమ్మకు దెబ్బ తగిలింది కదా దగ్గరుండి చూసుకుంటానని ధీరజ్ అంటాడు. రామరాజు వెళ్లమని చెప్పినా ధీరజ్ వినడు. రామరాజునే వెళ్లి పడుకోమంటాడు ధీరజ్. ఇదంతా చూసి వేదవతి మురిసిపోతుంది.

నర్మద కన్నీళ్లు

ప్రేమ గదిలోకి వెళ్తున్న నర్మదను చూసి సుక్కు ఫాలో అవుతుంది. ప్రేమ దగ్గరకు వెళ్లి నర్మద ఏడుస్తుంది. ఇదంతా కిటికీలో నుంచి సుక్కు చూస్తుంది. ఏమైంది అక్క? అత్త గురించే కదా నీ కన్నీళ్లు. మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే చిన్నపిల్లలా ఏడుస్తున్నావని ప్రేమ ఫీల్ అవుతుంది.

అత్తయ్య నాకు అమ్మకంటే ఎక్కువయ్యారు. అందుకే అలా జరిగే సరికి నా మనసు మనసులో లేదు. ఏదో అలజడి ఉంది. లోపల భయం ఉందని నర్మద ఏడుస్తుంది. నీది, అత్తది అమ్మాకూతురు బంధం అని ప్రేమ అంటుంది. దేవుడి దయ వల్ల అత్త సంతోషంగా ఉన్నారు. రేపు ఉదయం గుడికి వెళ్దామని నర్మద అడిగితే, ప్రేమ ఓకే అంటుంది.

సుక్కు షాక్

వల్లి విషయం ధీరజ్ కు చెప్పావా అని ప్రేమను నర్మద అడుగుతుంది. చెప్పడానికి కుదర్లేదు. ఆ వల్లినే భద్రావతి అత్తతో కలిసి మమ్మల్ని విడదీసిందనే విషయం ధీరజ్ కు తెలిస్తే అసలు ఊరుకోడు. రేపు పొద్దునే అందరికీ చెప్పేస్తానని ప్రేమ అంటుంది. రెండు రోజులు ఆగమని నర్మద చెప్తుంది. కానీ చందు బావ ఆగరు కదా. ఆ వల్లిని ఊరికే వదిలిపెట్టడని ప్రేమ అంటుంది. ఈ మాటలు విని సుక్కు షాక్ అవుతుంది. వెంటనే వల్లికి ఈ విషయం చెప్పాలని వెళ్తుంది.

బల్లక్కాయ్ ఫ్యూజులు ఔట్

మరోవైపు ‘నేనో బటర్ ఫ్లై’ అంటూ డ్యాన్స్ చేస్తుంటుంది బల్లక్కాయ్. అప్పుడే సుక్కు వెళ్లి చందుకు నిజం తెలిసిపోయిందని చెప్పడంతో వల్లి ఫ్యూజులు ఔట్ అయిపోతాయి. అసలే చందు బావ ఇంకా ఇంటికి రాలేదు. వస్తే ఎలా రియాక్టవుతారో కూడా తెలియడం లేదని వల్లి టెన్షన్ పడుతుంది.

చందు ఫైర్

ముందు భద్రావతితో మాట్లాడిన సిమ్ విరిచేయమని సుక్కు చెప్తుంది. వల్లి సిమ్ విరిచేస్తుండగా చందు ఎంట్రీ ఇస్తాడు. అది చూసి షాక్ అయ్యి వల్లి సిమ్ పారేస్తుంది. అది చూసిన చందు ఏంటీ అని అడుగుతాడు. దోమ అని వల్లి చెప్పగానే.. లాగిపెట్టి చెంప మీద కొడతాడు చందు. ఎంత ధైర్యం ఉంటే భద్రావతితో కలిసి ప్రేమ, ధీరజ్ ను విడగొడతారా? రైస్ మిల్ లో దొంగతనం చేసి తిరుపతి మామయ్యపై నింద వేస్తావా? అని చందు ఫైర్ అవుతాడు.

వల్లిని గెంటేసిన చందు

ఇప్పుడే నిజం తెలియాలి. తప్పు మాదే. పాముకు పాలు పోస్తే కాటేయకుండా మానుతుందా? నీ బుద్ధి అంతే. ముందు బయటకు పో అని చందు గట్టిగా అరుస్తాడు. నేను పూర్తిగా మారిపోతాను బా. ఒక్కసారికి క్షమించు బా అని వల్లి కాళ్లు పట్టుకుంటుంది. నీ డ్రామాలు నా దగ్గర కాదు. నీ అంతట నువ్వే సైలెంట్ గా సర్దుకోని పోతే నీకే మంచిదని చందు ఆవేశంతో ఊగిపోతాడు.

బయటకు పో అని వల్లిని గెంటేస్తాడు చందు. తెల్లారేసరికల్లా నీ ముఖం నాకు కనిపించకూడదు అని బయటకు తోసేసి గది తలుపు పెడతాడు చందు. ప్లీజ్ బావ తలుపు తీయు అని వల్లి ఏడుస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More