Illu Illalu Pillalu October 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-అత్తను పడేసిన వల్లి-చెంప వాయించిన నర్మద-చందుకు తెలిసిన నిజం
Illu Illalu Pillalu October 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 5 ఎపిసోడ్ లో తన బండారం ఎక్కడ బయటపడుతుందేమోనని బల్లక్కాయ్ వణికిపోతుంది. తప్పించుకోవడానికి వేదవతిని స్టూల్ పై నుంచి కిందపడేలా చేస్తుంది. దీంతో వల్లి చెంపలను నర్మద వాయిస్తుంది. చివరకు చందుకు నిజం చెప్తుంది నర్మద.
Illu Illalu Pillalu October 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి పాపాల చిట్టా మామయ్య ముందు బయటపెట్టకుండా ఎందుకు ఆగావని నర్మదను ప్రేమ అడుగుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారని ఆగుతున్నానని నర్మద చెప్తుంది.

వల్లిని చంపాలన్నంత కోపం
నన్ను, ధీరజ్ ను విడగొట్టడానికి కుట్ర చేసిందని తెలిసినప్పటి నుంచే బల్లక్కాయ్ ను చంపాలన్నంత కోపంగా ఉంది. నిన్ననే నువ్వు చెప్తావనుకున్నా. కానీ భోజనం చేస్తున్నారని ఆగానని చెప్తున్నావ్ ఏంటక్కా? ఆ వల్లిని ప్రశాంతంగా ఉండనివ్వడం కంటే పాపం ఉండదని ప్రేమ అంటుంది.
బల్లికి బడితపూజే
ఈ మాటలు వింటున్న వల్లి.. ప్రశాంతంగా ఎక్కడున్నా? వణికిపోతున్నానని అనుకుంటుంది. ఆ బల్లిని ఎందుకు ప్రశాంతంగా ఉండనిస్తా. ఈ పూజ అయిపోయిన వెంటనే ఆ బల్లికి బడితపూజే అని ప్రేమకు నర్మద చెప్పడంతో వల్లి షాక్ అవుతుంది. ఇంకాసేపట్లో నా సీటు చిరిగిపోతుంది. ఏం చేయాలి దేవుడా అని వల్లి ఆలోచిస్తుంటుంది.
తప్పించుకునే కుట్ర
అప్పుడే బుజ్జమ్మా కాఫీ అని రామరాజు అడుగుతాడు. అప్పుడే కిచెన్ లోకి వెళ్లిన వల్లి కాఫీ పొడి డబ్బాను పైన పెడుతుంది. స్టూల్ కాళ్లు కోసేస్తుంది. ఇటు బయట ఏమో మీరు నన్ను కాఫీ అడిగారా? నా కాఫీ మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నారా? ఇది ఆశ్చర్యం కాదు, కడుపు మంట. మొన్నటి వరకూ కాఫీ ఇస్తే విషంలా చూశారని వేదవతి అంటుంది.
మొగుళ్లు, పెళ్లాలు అంటూ రామరాజు, వేదవతి మాటలు అనుకుంటారు. చివరకు వేదవతి కరిగిపోతుంది. కాఫీ చేస్తానని కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ వల్లిని చూసి వేదవతి షాక్ అవుతుంది. మామయ్య మీ కాఫీనే అడిగారు కదా అని వల్లి అనగానే వేదవతి మెలికలు తిరుగుతుంది. వల్లిని బయటకు వెళ్లమంటుంది.
వేదవతి తలకు గాయం
కాఫీ పొడి కోసం వేదవతి వెతుకుతుంది. పైన ఉన్న డబ్బా చూసి వేదవతి స్టూల్ వేసుకొని ఎక్కుతుంది. అది విరిగి వేదవతి కిందపడటంతో బుజ్జమ్మా అని రామరాజు కంగారు పడి లోపలికి వస్తాడు. అందరూ భయంతో లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. వేదవతి తలకు గాయం తగిలి రక్తం వస్తుంది. స్పృహ కోల్పోయిన వేదవతిని హాస్పిటల్ కు తీసుకెళ్తారు.
ధీరజ్ కోపం
ప్రస్తుతానికి బయటపడ్డానని వల్లి అనుకుంటుంది. బాధపడుతున్న ధీరజ్ దగ్గరకు వెళ్లి ప్రేమ ఓదార్చాలని చూస్తుంది. కానీ ధీరజ్ ఆవేశపడతాడు. ఇంట్లో ముగ్గురు కోడళ్లున్నారు. స్టూల్ విరిగిపోయిన విషయం ఎవరూ గమనించరా? పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారా? ఆ స్టూల్ ను బయట పడేస్తే అమ్మకు దెబ్బ తగిలేదే కాదని ధీరజ్ కోపంగా అంటాడు.
వల్లి మొసలి కన్నీరు
ఆ స్టూల్ పై నేను చాలా సార్లు కూర్చున్నా కానీ ఏం కాలేదని నర్మద చెప్తుంది. బాగున్న స్టూల్ సడెన్ గా విరగడం ఏంటీ అని ధీరజ్ అనేసరికి అందరికీ అనుమానం వస్తుంది. వీళ్లు స్టూల్ మీద పడ్డారేంటీ అని వల్లి భయపడుతుంది. అత్తయ్యకు ఆ దేవుడు ఇలాంటి పరిస్థితి తెస్తాడా? అని వల్లి మొసలి కన్నీరు కారుస్తూ డ్రామా ఆడుతుంది.
నీతో పనుంది బయటకు రా అని బల్లక్కాయ్ ను నర్మద లాక్కెళ్తుంది. ప్రేమ కూడా వెనకాలే వెళ్తుంది. వీళ్లను చూసి చందు కూడా వెళ్తాడు. బయటకు తీసుకెళ్లిన వల్లి చెంపలను నర్మద వాయించేస్తుంది. ఏం తప్పు చేశానని కొడుతున్నావని వల్లి అడుగుతుంది.
ఎమోషనల్ డ్రామా
నీ కుట్రలను నేను బయటపెడతానని అత్తయ్యను నువ్వే పడేశావ్ కదా అని నర్మద అడుగుతుంది. దేవతలాంటి అత్తయ్యకు నేనెందుకు అట్టా చేస్తా. నా గురించి మామయ్యకు ఇప్పుడే చెప్పేయ్. నన్ను ఇటు నుంచి ఇటే పంపిచేస్తారు అని వల్లి డ్రామా కంటిన్యూ చేస్తుంది.
ప్రేమ ఆవేశం
నన్ను, ధీరజ్ ను విడగొట్టేందుకు కుట్ర చేశావని తెలియగానే చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నీ నిజస్వరూపాన్ని అక్క బయటపెడతానంది కాబట్టే ఆగా. కానీ అత్తయ్యకు ఇలా చేసి తప్పించుకోవాలని అనుకుంటున్నావేమో. అది జరగదని తెలుసుకో అని ప్రేమ కోపంగా చెప్తుంది. మామయ్యను కూడా హాస్పిటల్ బెడ్ మీద పడేలా చేస్తారా అని వల్లి అంటుంది. ఎమోషనల్ డ్రామా ఆపుతావా అని నర్మద మళ్లీ కొట్టబోతే వల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
చందు షాక్
ఇదంతా విన్న చందు వచ్చి వల్లి మళ్లీ ఏం మోసాలు చేసిందని నర్మదను అడుగుతాడు. తర్వాత మాట్లాడుకుందామని నర్మద అంటుంది. తర్వాత కాదు. ఎందుకు దాచిపెట్టాలి? అని ప్రేమ అంటుంది. దీంతో జరిగిన మొత్తాన్ని చందుకు నర్మద చెప్తుంది. ప్రేమ, ధీరజ్ లను విడదీయడం, రైస్ మిల్ లో రూ.6 లక్షల దొంగతనం అన్ని వల్లినే చేసిందని నర్మద చెప్పేసరికి చందు షాక్ అవుతాడు.
ఇక దాన్ని వదిలిపెట్టనని చందు కోపంతో ఊగిపోతాడు. అత్తయ్యకు అలా జరిగిందని మామయ్య, ధీరజ్ బాధపడుతున్నారు. ఈ సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు. అత్తయ్య ఇంటికి వెళ్లగానే చెప్పేస్తానని చందును నర్మద ఆపుతుంది.
హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వేదవతికి స్పృహ వస్తుంది. స్టూల్ పై నుంచి కింద పడ్డ విషయం గుర్తు చేసుకుంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


