Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కలిసిన నర్మద, ప్రేమ.. ఇక బల్లక్కాయ్ కు దబిడి దిబిడే.. కుట్రను బయటపెడతారా?

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్లు ప్రేమ, నర్మద మళ్లీ ఒక చోటుకు చేరిపోయారు. ధీరజ్ ను పెళ్లి చేసుకుని ప్రేమ అత్తారింటికి తిరిగొచ్చింది. ఇక ఇద్దరు కలిసి బల్లక్కాయ్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్నారు. 

Published on: Oct 4, 2026, 08:51:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రేటింగ్ లో అదుర్స్ అనిపిస్తోంది. ఈ టాప్ సీరియల్ కు తెలుగు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎమోషనల్ తో పాటు ట్విస్టులతోనూ ఎంటర్ టైన్ చేస్తోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కలిసిన నర్మద, ప్రేమ.. ఇక బల్లక్కాయ్ కు దబిడి దిబిడే.. కుట్రను బయటపెడతారా? (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కలిసిన నర్మద, ప్రేమ.. ఇక బల్లక్కాయ్ కు దబిడి దిబిడే.. కుట్రను బయటపెడతారా? (jiohotstar)

కలిసిపోయిన నర్మద, ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్లు, రామరాజు కోడల్లయిన నర్మద, ప్రేమ మళ్లి ఒక్క చోటుకు చేరారు. రామరాజు కోడల్లుగా ఆ ఇంటిని నర్మద, ప్రేమ కాపాడుతూ వచ్చారు. కానీ బల్లక్కాయ్, భద్రావతి కుట్ర కారణంగా ధీరజ్, ప్రేమ విడిపోయారు. ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నర్మద అసలు నిజాలు బయటపెట్టడంతో ధీరజ్ ను పెళ్లి చేసుకున్న ప్రేమ తిరిగి అత్తారింటికి వచ్చింది.

బల్లక్కాయ్ భరతం

రామరాజు ఇంట్లో ప్రాబ్లెమ్స్ అన్నింటికీ బల్లక్కాయ్ కారణమని నర్మద తెలుసుకుంది. అందుకే పెద్ద కోడలు శ్రీవల్లికి ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో తన బండారం ఎప్పుడు బయటపడుతుందేమోనని వల్లి వణికిపోతుంది. ఈ నేపథ్యంలో నర్మద, ప్రేమ కలవడంతో బల్లక్కాయ్ టెన్షన్ మరింత పెరిగిపోయింది.

కుట్ర బయటపెడతారా?

కొత్త కోడలిగా పాత ప్రేమ తిరిగి రామరాజు ఇంటికి వచ్చింది. ఇక బల్లక్కాయ్ కుట్రలను మామయ్యకు ఎప్పుడు చెప్తావంటూ నర్మదను ప్రేమ అడిగింది. ఈ మాటలు విన్న బల్లక్కాయ్ ఫ్యూజులు ఔట్ అయిపోయాయి. అయితే నర్మద ఇప్పుడే బల్లి కుట్రల గురించి మామయ్యకు చెప్పే సూచనలు కనిపించడం లేదు.

కుటుంబమంతా ఆనందంగా కలిసి ఉండాలని రామరాజు కోరుకుంటున్నాడు. ఇప్పుడే ధీరజ్, ప్రేమ పెళ్లితో ఆ ఇంట్లో మళ్లీ సంతోషం నిండింది. ఈ సమయంలో వల్లి గురించి చెప్తే కచ్చితంగా ఆమెను ఇంటి నుంచి గెంటేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నర్మద అనుకుంటుంది.

వల్లితో ఆటలు

గతంలో వల్లి కాల్ రికార్డింగ్ ను అడ్డం పెట్టుకొని ఆమెతో నర్మద, ప్రేమ ఆడుకున్నారు. అయినా వల్లిలో మార్పు రాలేదు. దొంగ ప్రెగ్నెన్సీ నాటకం ఆడింది. ఆ గుట్టు బయటపడ్డా కూడా బల్లక్కాయ్ మారలేదు. ఈ సారి ఏకంగా భద్రావతితో కలిసి కుట్రలు పన్నింది. ఇప్పుడీ విషయాలన్నీ నర్మదకు తెలుసు. ఆమె దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.

మరి ఈ ఆధారాలు చూపించి బల్లక్కాయ్ ను నర్మద ఎలా ఆడుకుంటుంది? వల్లికి మారేందుకు మరో ఛాన్స్ ఇస్తుందా? అసలు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More