Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ బతుకు బస్టాండ్.. కూతురి గోయి తవ్వుతున్న భాగ్యం.. నెక్స్ట్ ఏంటీ?

Illu Illalu Pillalu: స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’. ఈ సీరియల్ ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ ను మిక్స్ చేసి ఆడియన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. తాజాగా ఈ స్టోరీలోని ట్విస్ట్ లు సీరియల్ పై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. 

Published on: Oct 11, 2026, 16:35:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu: బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అదరగొడుతోంది. తెలుగు ప్రజలు ఈ సీరియల్ కు విశేషంగా ఆదరిస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ లో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. రామరాజు కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకునేవాళ్ల కుట్రలను చిత్తు చేస్తూ ఈ సీరియల్ స్టోరీ సాగిపోతోంది. తాజాగా బల్లక్కాయ్ కు ఇలాంటి గతే పట్టింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ బతుకు బస్టాండ్.. కూతురి గోయి తవ్వుతున్న భాగ్యం.. నెక్స్ట్ ఏంటీ?
ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ బతుకు బస్టాండ్.. కూతురి గోయి తవ్వుతున్న భాగ్యం.. నెక్స్ట్ ఏంటీ?

బల్లక్కాయ్ బండారం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లినే ఆ కుటుంబానికి శత్రవుగా మారింది. తోడి కోడళ్లు నర్మద, ప్రేమపై అసూయతో రగిలిపోతూ చేయకూడని కుట్రలు చేసింది. అబద్ధాలు చెప్పింది. మోసాలు చేసింది. చివరకు ధీరజ్, ప్రేమను శాశ్వతంగా విడగొట్టాలనుకుంది. కానీ చివరకు ఆమె బండారం మొత్తం రామరాజుతో సహా అందరికీ తెలిసిపోయింది.

బయటకు గెంటేసి

మోసం చేసి చందును పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి ధీరజ్, ప్రేమను విడగొట్టడం వరకూ బల్లక్కాయ్ అండ్ పేరేంట్స్ చేసిన కుట్రలు రామరాజుకు తెలిసిపోయాయి. దీంతో కోపంతో ఊగిపోయిన రామరాజు.. బల్లక్కాయ్ తల్లిదండ్రులు భాగ్యం, ఇడ్లీ బాబాయిని పిలిపించి మరీ చెంప పగలగొట్టారు. తల్లిదండ్రులతో పాటు బల్లక్కాయ్ ను కూడా బయటకు గెంటేశారు.

బతుకు బస్టాండ్

చేసిన పాపం పండేసరికి బల్లక్కాయ్ బతుకు బస్టాండ్ లా మారింది. ఇప్పుడు పుట్టింట్లో ఏడుస్తూ కూర్చుంది. చందు పేరును గోడపై రాస్తూ కలవరిస్తుంది. మరి ఇన్ని రోజులూ సొంత అత్తారింట్లోనే కుట్రలు చేసినప్పుడు బల్లక్కాయ్ కు ఈ బాధ తెలియలేదేమో. ఇప్పుడు మాత్రం తెగ కుమిలిపోతుంది.

భాగ్యం కన్నింగ్ ప్లాన్

ఇంత జరిగినా, మెడ పట్టుకొని రామరాజు కుటుంబం గెంటేసినా కూడా భాగ్యం బుద్ధి మాత్రం మారడం లేదు. ఆమెకు కొంచెమైనా బుద్ధి రావడం లేదు. తన కూతురిని గెంటేస్తారా అని రామరాజు కుటుంబంపై పగతో భాగ్యం రగిలిపోతుంది. ఈ క్రమంలో తన సొంత కూతురి కోసం గొయ్యి తవ్వుతుందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది.

కేసు పెడితే

రామరాజు కుటుంబం మీద కేసు పెడతానని భాగ్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బల్లక్కాయ్ కుటుంబంపై రామరాజు ఫ్యామిలీకి పీకల్లోతు కోపం ఉంది. ఇప్పుడు భాగ్యం కేసు పెడితే ఆ కోపం మరింత ద్వేషంగా మారుతుంది. వల్లి శాశ్వతంగా రామరాజు ఇంటికి దూరమవుతుంది. కానీ ఈ విషయం భాగ్యానికి అర్థం కావడం లేదు.

చేసిన తప్పులు ఒప్పుకొని రామరాజును రిక్వెస్ట్ చేస్తే ఆయన మనసు కరిగే అవకాశం ఉంది. కానీ భాగ్యం మాత్రం పట్టుదలకు పోతుంది. ఈ క్రమంలో తన కూతురి బతుకు అన్యాయమైపోతుందనే విషయాన్ని మాత్రం గమనించలేకపోతుంది.

ఇప్పుడు గనుక భాగ్యం కేసు పెడితే ఈ గొడవ ఇంకా పెద్దగా మారుతుంది. బల్లక్కాయ్ పై రామరాజు కుటుంబం ఇంకా ఫైర్ అవుతుంది. దీంతో అసలుకే ఎసరు వస్తుంది. మరి భాగ్యం తన కన్నింగ్ బుర్రను మార్చుకుంటుందా? బల్లక్కాయ్ ఏం చేస్తుంది? అనేది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More