Illu Illalu Pillalu September 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ధీరజ్‌ను కొట్టిన వేదవతి-తిరుపతిని గెంటేసిన సిస్టర్స్
Illu Illalu Pillalu September 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 14 ఎపిసోడ్ లో తిరుపతి, సుకన్యకు పెళ్లి చేసిందని ధీరజ్ అని తెలియడంతో అందరూ షాక్ అవుతారు. ధీరజ్ ఏమో ప్రేమను కూడా ఇందులోకి లాగుతాడు. తిరుపతిని ఎవరూ ఇంట్లోకి రానివ్వరు. ధీరజ్ ను వేదవతి కొడుతుంది.
Illu Illalu Pillalu September 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తిరుపతి, సుకన్యకు పెళ్లి చేసిన ధీరజ్, ప్రేమ వాళ్లిద్దరినీ ఇంటికి తీసుకొస్తారు. అది చూసి వేదవతి ఫైర్ అవుతుంది. అప్పుడే శ్రీవల్లి మరో డ్రామా స్టార్ట్ చేస్తుంది.

ధీరజ్ ను నరికేయాలి
నీకు అసలు బుద్ధిందా అని సుకన్యను బల్లక్కాయ్ కొడుతుంది. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా? ఇంత మోసం చేస్తావా? అని వల్లి చేయి లేపుతుంది. అప్పుడే భద్రావతి అండ్ కో ఆవేశంతో ఊగిపోతూ దిగుతారు. కొట్టాల్సింది ధీరజ్ ను. వీడిని నరికేయాలని భద్రావతి అంటుంది.
అందరూ షాక్
భద్రావతి నోరు అదుపులో పెట్టుకో. వీళ్లు వెళ్లి పెళ్లి చేసుకుంటే నా కొడుకును అంటున్నావేంటీ? అని వేదవతి ఫైర్ అవుతుంది. ఈ పెళ్లి చేసిందే వీడు. నీ కొడుకే వీళ్లను తీసుకెళ్లి దొంగచాటుగా పెళ్లి చేశాడని భద్రావతి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. రేయ్ చిన్నోడా, వీళ్లకు పెళ్లి చేసింది నువ్వేనా అని రామరాజు అడుగుతాడు.
తిరుపతిని కొట్టిన భద్రావతి
ఆపరా నువ్వు, నీ నాటకాలు. దీని వెనుక నువ్వే ఉన్నావని, నీ కొడుకు చేయించావని నాకు తెలుసు అని రామరాజును భద్రావతి అంటారు. మా కుటుంబం మీద పగతో జమీందార్ కొడుకైన నా తమ్ముడికి, కూటికి గతిలేని దానితో పెళ్లి చేయించావని రామరాజు పైకి గొడవకు వెళ్తాడు సేనాపతి. అన్నయ్య, అనవసరంగా బావ మీద నోరు పారేసుకోకు. బావకు ఏం తెలియదని చెప్తున్న తిరుపతిని భద్రావతి కొడుతుంది.
మన స్థాయికి తగ్గ సంబంధం చూస్తే ఈ గతి లేనిదానిని పెళ్లి చేసుకుంటావా? అని భద్రావతి ఫైర్ అవుతుంది. నిశ్చితార్థం నుంచి తీసుకెళ్లి నా తమ్ముడికి పెళ్లి చేస్తావా? మీ కుటుంబానికి లేచిపోయి పెళ్లి చేసుకునే అలవాటుందని ఇలా చేస్తావా? అని ధీరజ్ ను ప్రశ్నిస్తుంది భద్రావతి. దీంతో ధీరజ్ కు చిర్రెత్తుకొస్తుంది.
ప్రేమను లాగిన ధీరజ్
ఎంతసేపు నన్నే అంటావా? నీ మేనకోడలిని అనవా? అని ప్రేమను ముందుకు లాగుతాడు ధీరజ్. నువ్వు తప్పు చేసి నా మేనకోడలిని అంటావేంటీ? అని భద్రావతి అడుగుతుంది. ఈ పెళ్లికి నేను ఒక్కడినే కాదు, ఆమె కూడా పెళ్లి పెద్దనే. ఈ పెళ్లి నేను, నా పెళ్లాం దగ్గరుండి చేయించామని ధీరజ్ అంటాడు. దీంతో ప్రేమ భయపడుతుంది.
మంచో చెడో పెళ్లి అయిపోయింది. వదిలేయండని నర్మద చెప్తుంది. కానీ ఈ పెళ్లికి, మాకు సంబంధం లేదు. ఈ జన్మలోనే వీళ్లను నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను. వీళ్లను నీ ఇంటికి తీసుకెళ్లు. తమ్ముడిని నీ ఇంట్లోనే ఉంచుకుంటానన్నావ్ కదా. మరి నువ్వే ప్లాన్ చేసి పెళ్లి చేశావా? నీ ఇంట్లోకి రానిస్తావా? అని వేదవతి రివర్స్ లో భద్రావతిని అడుగుతుంది.
గుమ్మం తొక్కనివ్వనని
నా ఇంట్లోకి ఎందుకు రానిస్తా? నా ఇంటి పరువు తీసినవాడు తమ్ముడైనా సరే ఇంటి గుమ్మం తొక్కనివ్వను. నువ్వు పనోడిని పెళ్లి చేసుకున్నావని నిన్నే వదులుకున్నా, మరి వాడిని వదిలేసుకోనా అని భద్రావతి అంటుంది. మీరు ఎవరు రానివ్వకపోతే వాడు ఎక్కడికి పోతాడని శారదాంబ, రేవతి అడుగుతారు. వాడు ఇంట్లోకి వస్తే అక్కా, నేను ఎవరూ ఉండమని సేనాపతి షాక్ ఇస్తాడు.
భాగ్యం ఇంట్లో మకాం
మామ నీ పెళ్లి గొడవ ఏటో పోతుంది. ప్రస్తుతానికి భాగ్యం ఇంట్లో మకాం వేయమని ధీరజ్ చెప్తాడు. బావ మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నేను నిన్ను తండ్రిలా చూశా. నీ బిడ్డ జీవితం బాగుండాలని కోరుకుంటే మంచి మనసుతో ఆశీర్వదించు బావ అని రామరాజు కాళ్లపై సుక్కుతో పడతాడు తిరుపతి. సరే ఏదో ఒకటి చేసుకోండి, చల్లగా ఉండండని రామరాజు ఆశీర్వదిస్తాడు.
వేదవతి మాత్రం కాళ్లు విరగ్గొడతానని వార్నింగ్ ఇస్తుంది. ధీరజ్ కు థ్యాంక్స్ చెప్పి ఎమోషనల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు తిరుపతి. ప్రేమతో మాట్లాడాలని భద్రావతి లాక్కెళ్తుంది. గండం గడిచిందని బల్లక్కాయ్ అనుకుంటుంది. ప్రేమను నీకు శాశ్వతంగా దూరం చేస్తానని ధీరజ్ కు భద్రావతి వార్నింగ్ ఇస్తుంది.
ధీరజ్ కు చెంపదెబ్బ
ధీరజ్ ను వేదవతి లోపలికి లాక్కెళ్లి కొడుతుంది. నీకెందుకు రా బోడి పెత్తనాలు? అప్పుడే పెళ్లి చేసేంత గొప్పోడివి అయిపోయావా? తెలిసి తెలిసి ఆ కొంపలు కూల్చేవాళ్ల అమ్మాయిని తెచ్చి అమాయకుడైన నా తమ్ముడి గొంతు కోశావు కదా. తిరుపతి విషయంలో గొడవ జరిగింది కదా. ఈ పెళ్లి చేస్తే రెండు కుటుంబాల మధ్య గొడవలు పెద్దవి అవుతాయని తెెలీదా అని వేదవతి ప్రశ్నిస్తుంది.
కన్విన్స్ చేసిన చిన్నోడు
మొగుడు పెళ్లాలు కలిసిపోండి అని చెప్తే మాత్రం చేయరు. కానీ పనికిమాలిని విషయంలో మాత్రం ఇద్దరు కలిసికట్టుగా పనిచేశారని నర్మద దెబ్బిపొడుస్తుంది. సుక్కుతో పెళ్లి కాకపోయి ఉంటే నీ తమ్ముడు చచ్చిపోయేవాడు. అందుకే తప్పైనా తప్పక పెళ్లి చేశా. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో పెద్దోడిని అడుగు అని ధీరజ్ కన్విన్స్ చేస్తాడు.
రామరాజు సీరియస్
వీళ్లు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదని బయట ఉన్న బల్లక్కాయ్ గింజుకుంటుంది. సీక్రెట్ మీటింగ్ లు పెట్టుకుంటున్నారని రామరాజుకు ఎక్కిస్తుంది. రహస్యంగా మీ మంతనాలు ఏంటీ? అని లోపలికి వెళ్లి రామరాజు సీరియస్ అవుతాడు. నీ తమ్ముడి ప్రేమ వ్యవహారం తెలిసి కూడా నాకు చెప్పావా? అన్నింటికీ నువ్వే కారణం కాదా అని వేదవతిపై రామరాజు ఫైర్ అవుతాడు.
గుడిలో మామకు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అది తెలిసి సుక్కు ప్రాణాలు తీసుకోబోయింది. అందుకే చెప్పేంత టైమ్ లేక పెళ్లి చేయాల్సి వచ్చింది. సారీ నాన్న, దయచేసి అర్థం చేసుకోండని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. నువ్వు చెప్పి ఉంటే అందరితో మాట్లాడి పెళ్లి చేసేవాడినని రామరాజు అంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


