Illu Illalu Pillalu: ఇక బల్లక్కాయ్ బతుకు బస్టాండేనా? పవర్‌ఫుల్ ఫ్రెండ్‌ను రంగంలోకి దించిన నర్మద..మిస్టరీ వీడుతుందా?
Illu Illalu Pillalu: స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మరో టర్న్ తీసుకోనుంది. కుట్రలు, కుతంత్రాలతో రామరాజు కుటుంబంపై పగ తీర్చుకుంటున్న బల్లక్కాయ్ బండారం బయటపెట్టేందుకు నర్మద రంగంలోకి దిగింది. తన ఫ్రెండ్ కు ఆ బాధ్యతను అప్పజెప్పింది.
Illu Illalu Pillalu: అదిరిపోయే ట్విస్ట్ లు, ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో సాగుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీ మరో లెవల్ కు చేరబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ఎంటర్ టైన్ చేస్తున్న ఈ సీరియల్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బల్లక్కాయ్ బండారాన్ని బయటపెట్టేందుకు ఏకంగా పవర్ ఫుల్ ఫ్రెండ్ ను రంగంలోకి దించింది నర్మద.

బల్లక్కాయ్ కుట్రలు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అబద్ధాలు చెప్పి చందును పెళ్లి చేసుకోవడమే కాకుండా ప్రెగ్నెన్సీ డ్రామా కూడా ఆడింది శ్రీవల్లి. కానీ ఆమె గుట్టు రట్టు కావడంతో బావిలో దూకి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది. ఇంట్లోకి అయితే రానిచ్చారు కానీ చందు మాత్రం బల్లక్కాయ్ ను ఛీ కొడుతూనే ఉన్నాడు. దీంతో వల్లి ప్రతీకారంతో రగిలిపోతోంది.
ప్రేమను, తిరుపతిని పంపించేసి
తన కాపురం నాశనం కావడానికి ప్రేమ, నర్మద కారణమని బల్లక్కాయ్ రివేంజ్ కుట్రలు పన్నుతోంది. భద్రావతితో కలిసి కన్నింగ్ ప్లాన్ వేసి ప్రేమను రామరాజు ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసింది. ప్రేమ, ధీరజ్ ను విడగొట్టింది. అలాగే తిరుపతిపై దొంగతనం నింద వచ్చేలా కుట్ర పన్నింది. అతణ్ని కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసింది.
నర్మదకు డౌట్
అయితే రామరాజు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటి వెనుక బల్లక్కాయ్ ఉందని నడిపి కోడలు నర్మదకు అనుమానం ఉంది. డౌట్ మాత్రమే కాదు కచ్చితంగా ఇవన్నీ వల్లి కుట్రలే అని నమ్ముతుంది నర్మద. అందుకే ఆ గుట్టు రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నేరుగా భాగ్యం ఇంటికి వెళ్లి ‘బావిలో బల్లి’ కథ చెప్పి నిజాలు రాబట్టాలని చూసింది. కానీ వల్లి ఆస్కార్ లెవల్ యాక్టింగ్ తో తప్పించుకుంది.
అత్త డ్రామా
ఇక వేదవతితో రివర్స్ డ్రామా ఆడించింది నర్మద. వల్లి అంటే ప్రేమ ఉన్నట్లు వేదవతి నటించి, ఆమె బండారం బయటపెట్టాలనుకుంది. కానీ అద్దంలో వెనుకాల ఉన్న నర్మదను చూసి బల్లక్కాయ్ మళ్లీ అమాయకంగా నటించింది.
స్మిత హెల్ప్
ఎలాగైనా బల్లక్కాయ్ అసలు రూపాన్ని బయటపెట్టాలని చూస్తున్న నర్మద ఇప్పుడు ఏకంగా తన ఫ్రెండ్ స్మితను రంగంలోకి దించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి అయిన స్మితకు హోం మినిస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే వల్లి గుట్టు రట్టు చేసేందుకు స్మిత సాయం కోరింది నర్మద. స్మిత కూడా అందుకు అంగీకరించింది.
బతుకు బస్టాండే
స్మితను చూస్తుంటే త్వరలోనే బల్లక్కాయ్ గురించి మిస్టరీ బయటపెట్టేలా ఉంది. మరి ఆ నిజాలు తెలుసుకునేందుకు స్మిత్ ఏం చేస్తుంది? గుట్టు తెలుసుకున్నాక నర్మద ఏ ప్లాన్ వేస్తుంది? అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దీంతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రాబోయే ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశముంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


