ముంబైలోని వాంఖడే స్టేడియం మరో చారిత్రక విజయానికి వేదికైంది. హోరాహోరీగా సాగిన టీ 20 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
రాహా కపూర్ సందడి

ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సెమీ ఫైనల్స్ జరిగిన మైదానంలో ఆటగాళ్ల మెరుపుల కంటే గ్యాలరీలో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ దంపతుల కూతురు రాహా కపూర్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రాహా క్లాప్స్.. అలియా నవ్వులు!
ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రణ్‌బీర్ కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కానీ, కెమెరా కళ్లన్నీ బుజ్జి రాహాపైనే ఉన్నాయి. తన తండ్రి రణ్‌బీర్ ఒడిలో కూర్చుని రాహా కపూర్ ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొట్టింది.
చిట్టి చేతులతో క్లాప్స్
స్టేడియంలో అందరూ రిథమిక్‌గా చప్పట్లు కొడుతుంటే, వారిని అనుకరిస్తూ రాహా కూడా తన చిట్టి చేతులతో క్లాప్స్ కొట్టడం చూసి అలియా భట్ మురిసిపోయింది. కూతురి ముద్దు ముద్దు చేష్టలను చూస్తూ అలియా నవ్వుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సెమీ ఫైనల్స్‌లో టీమిండియా గెలిచిన తర్వాత రాహా కపూర్ సందడి వైరల్‌గా మారింది.
ముచ్చటగా ఉంది
"రాహాను చూస్తుంటే ముచ్చటగా ఉంది. భర్త, బిడ్డతో కలిసి స్టేడియంలో మ్యాచ్ చూడటం ప్రతి క్రికెట్ ప్రేమికుడి కల" అని ఒక అభిమాని కామెంట్ చేయగా, "క్యూటెస్ట్ మున్చ్‌కిన్" అంటూ నెటిజన్లు రాహాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నా కూతురే నా ఇన్‌స్పిరేషన్: అలియా
ఇటీవలే లండన్‌లో జరిగిన బాఫ్టా (BAFTA) అవార్డుల వేడుకలో పాల్గొన్న అలియా భట్ తన కూతురు రాహా గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "ప్రస్తుతం నా జీవితంలో నిజమైన మ్యాజిక్, నా ఇన్‌స్పిరేషన్ నా కూతురే. ఆమెకు ఇప్పుడు మూడేళ్లు. అప్పుడప్పుడు నా పాటలకే ఆమె డ్యాన్స్ చేస్తుంటే చూడటం నాకు లభిస్తున్న అతిపెద్ద బహుమతి. అదే అసలైన జీవితం అనిపిస్తుంది" అని అలియా భట్ పేర్కొన్నారు.
వరుస సినిమాలతో బిజీ..
వృత్తి పరంగా చూస్తే, అలియా భట్ చివరిగా 2024లో 'జిగ్రా' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) లో అలియా భట్ నటిస్తున్నారు.
{{/usCountry}}వృత్తి పరంగా చూస్తే, అలియా భట్ చివరిగా 2024లో 'జిగ్రా' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) లో అలియా భట్ నటిస్తున్నారు.
{{/usCountry}}భర్తతో కలిసి
ఇందులో బాబీ డియోల్, శర్వరీ వాఘ్ కూడా నటిస్తున్నారు. అలాగే, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తన భర్త రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి 'లవ్ అండ్ వార్' చిత్రంలోనూ అలియా భట్ నటిస్తున్నారు.